E-Paper
Advertisement

తండ్రీకొడుకుల డబుల్ ధమాకా.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు!

తండ్రీకొడుకుల డబుల్ ధమాకా.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు!
Advertisement

Mega Family Unique Box Office Feat: తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటుతున్న మెగా ఫ్యామిలీ.. సినీ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఒకే క్యాలెండర్ ఇయర్ లో ఒకే కుటుంబానికి చెందిన తండ్రీకొడుకుల సినిమాలు విడుదలై, రెండు చిత్రాలూ రూ. 300 కోట్ల మార్క్ ను క్రాస్ చేశాయి. వసూళ్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డును నెలకొల్పాయి. ప్రపంచ సినిమా చరిత్రలోనే ఇలాంటి రికార్డు నమోదు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.

అటు “మన శంకర వర ప్రసాద్ గారు”.. ఇటు “పెద్ది”..

ఈ అసాధారణమైన అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన “మన శంకర వర ప్రసాద్ గారు” బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో ప్రభంజనం సృష్టించింది. తన అద్భుత నటన, పవర్‌ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌ తో చిరంజీవి కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈజీగా రూ. 300 కోట్ల క్లబ్‌ లో చేరింది.

Advertisement

మరోవైపు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన “పెద్ది” చిత్రం కూడా థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేసింది. విభిన్నమైన కథాంశంతో, చరణ్ మాస్ ఓరియెంటెడ్ పర్ఫార్మెన్స్‌ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ను షేక్ చేసింది. ఈ చిత్రం కూడా అతి తక్కువ సమయంలోనే రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ఒకే ఏడాదిలో చిరు-చరణ్ సంచలనం..

ఒకే సంవత్సరంలో తండ్రీకొడుకులు ఇద్దరూ విడివిడిగా రూ. 300 కోట్ల మైలురాయిని దాటడం భారతీయ సినిమాలోనే కాకుండా, గ్లోబల్ సినిమా హిస్టరీలోనే అత్యంత అరుదైన రికార్డు. ఏ తండ్రీకొడుకులకూ అందని ఈ అద్భుతాన్ని మెగా పవర్ అందుకుంది. ఈ ఘనతతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం మెగా ఫ్యామిలీకి కొత్తేమీ కాకపోయినా, ఈ సరికొత్త రికార్డును మాత్రం భవిష్యత్తులో మరే ఇతర స్టార్ జంట బద్దలు కొట్టకపోవచ్చు అంటున్నారు. కనీసం ఊహించడం కూడా కష్టమేనని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Read Also: ప్రముఖ నటి ఆత్మహత్య.. షాక్ లో ఇండస్ట్రీ!

Related News

హీరోలకు థియేటర్లపై ఇంత మోజు ఎందుకో.. అసలు ప్లాన్ ఇదేనా?

సీత పాత్రతో జాక్‌పాట్ కొట్టిందా?.. సాయి పల్లవి రెమ్యూనరేషన్‌పై కొత్త టాక్!

ఇద్దరి ఫ్రెండ్షిప్ మళ్లీ వైరల్.. జాన్వీ పోస్ట్‌తో రచ్చ!

టీజర్ చూసి అప్పుడే తీర్పా?.. ‘రామాయణం’పై ఇదేం హడావిడి!

‘ది పారడైస్’ టీజర్‌కి ఇక డేట్ ఫిక్స్…తగలబెట్టేయ్ అంటున్న ఫ్యాన్స్ !

మహేష్ ఫ్యాన్స్ హ్యాండ్ ఇచ్చారా.. తొలి రోజు కలెక్షన్స్ ఎంతంటే?

‘పారడైస్’కి మళ్లీ బడ్జెట్ షాక్?.. నాని ఫుల్ టెన్షన్‌లో ఉన్నాడా?

రెండో పెళ్లిపై మనసులో మాట బయటపెట్టిన సురేఖ వాణి!

Big Stories

Advertisement
×