Tammareddy Bharadwaj:మెగా స్టార్ చిరు స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంతో మందికి ప్రాణదానం చేసిన సంగతి తెల్సిందే.అయితే అదే స్థాయిలో దీనిపై నెగెటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.అయితే దీనిపై కొన్ని రోజుల క్రితమే తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు చిరు. నేను బ్లడ్ ప్యాకెట్లు అమ్ముకుంటున్నానని అన్నారు .అసలు నేను సినిమా చేస్తే వచ్చే పారితోషికం ఎన్ని వేల,లక్షల బ్లడ్ ప్యాకెట్లు అమ్ముకుంటే వస్తుందని, కాబట్టి ఇలాంటి విమర్శలు ఎన్ని వచ్చినా మన సంకల్పాన్ని దెబ్బ తీయొద్దు అంటూ చెప్పుకొచ్చారు.
‘చిరంజీవి బ్లడ్ అమ్ముకుంటున్నారు’
ఇక విషయం పై తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్ ఒకటి ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తన జీవితంలో విన్న మోస్ట్ ఫూలిష్ గాసిప్ ఏదైనా ఉందంటే అది ‘చిరంజీవి బ్లడ్ అమ్ముకుంటున్నారు’ అనే మాటేనని అన్నారు. అసలు ఇలాంటి వార్త ఎలా పుట్టిందో కూడా అర్థం కాదని చెప్పుకొచ్చారు.
ఒక్క ఎకరం భూమి అమ్మినా చాలు
ఆ ఏరియాలో ఒక్క ఎకరం భూమి అమ్మినా భారీగా డబ్బులు వస్తాయని, అలాంటి విలువైన భూమిని పెట్టుకుని కేవలం బ్లడ్ అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించాల్సిన అవసరం చిరంజీవికి ఎందుకు ఉంటుందని ప్రశ్నించారు. వందల కోట్ల విలువైన ల్యాండ్‌ను అమ్మకుండా ఉంచుకుని, వంద రూపాయల కోసం బ్లడ్ అమ్ముకుంటారని చెప్పడం తనకు చాలా విచిత్రంగా అనిపించిందని మనసులోని అభిప్రాయాన్ని బయటపెట్టారు.
చిరంజీవి కెరీర్‌ను చూస్తే
నిజానికి చిరంజీవి కెరీర్‌ను చూస్తే ఈ స్థాయికి ఎలా వెళ్లారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఖైదీతో స్టార్‌గా మారిన చిరంజీవి.. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు, ముఠా మేస్త్రి, ఇంద్ర, ఠాగూర్ వంటి సినిమాలతో తన క్రేజ్‌ను మరింత పెంచుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఖైదీ నంబర్ 150తో మళ్లీ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కూడా సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్‌ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్,మన శంకర వరప్రసాద్ వంటి సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించారు.
also read :సుడిగాలి సుధీర్ ‘గోట్’కు మరో రిలీజ్ డేట్.. ఈసారి ఏమవుతుందో?
ఇలాంటి స్టార్ హీరో గురించి ఇలాంటి గాసిప్ రావడమే తనకు ఆశ్చర్యంగా ఉందన్నది తమ్మారెడ్డి వాదన. సినిమాల ద్వారా కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయిలో ఉన్న వ్యక్తి.. బ్లడ్ అమ్ముకుని డబ్బులు సంపాదించాల్సిన అవసరం ఏముంటుందనే ప్రశ్నను ఆయన లేవనెత్తడం తో మరోసారి చిరు బ్లడ్ బ్యాంక్ మీడియాలో హైలెట్ అయింది.