E-Paper
Advertisement

చిలకపచ్చ రంగు.. ఎర్రటి బార్డర్.. ఈసారి బతుకమ్మ చీరల లుక్ ఇదే!

చిలకపచ్చ రంగు.. ఎర్రటి బార్డర్.. ఈసారి బతుకమ్మ చీరల లుక్ ఇదే!
Advertisement

Bathukamma Sarees: బతుకమ్మ పండుగ వచ్చేస్తోంది. తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం చీరల కానుక సిద్ధం చేస్తోంది. ఇందిరా మహిళా శక్తి చీరల తయారీతో సిరిసిల్ల పవర్లూమ్‌లకు మళ్లీ జోష్ వచ్చింది. మే మొదటి వారం నుంచే చీరల తయారీ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 95 లక్షల మంది మహిళలకు చీరలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సిరిసిల్లకు ఏకంగా 10 కోట్ల మీటర్ల ఆర్డర్ వచ్చింది. గర్షకుర్తిలోనూ చీరల తయారీ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 40 లక్షలకు పైగా చీరలు సిద్ధమయ్యాయి. మరో పది, పదిహేను రోజుల్లో 60 లక్షల చీరల తయారీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మీటర్‌కు ఐదు రూపాయలు..

ఈసారి చీరల రంగు కూడా ప్రత్యేకమే చిలకపచ్చ రంగు.. ఎర్రటి బార్డర్. ఇక వృద్ధ మహిళల కోసం గర్షకుర్తిలో తొమ్మిది మీటర్ల పొడవైన చీరలను తయారు చేస్తున్నారు. చీరల తయారీతో నేతన్నలకు ఆరు నుంచి ఏడు నెలల పాటు పని దొరుకుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం యజమానులు మీటర్‌కు ఐదు రూపాయలు చెల్లిస్తున్నారు. చీరల తయారీ ఓ వైపు జోరుగా సాగుతున్నా బిల్లుల బకాయిలు మాత్రం యజమానులకు ఇబ్బందిగా మారాయి.

నేతన్నలు బిజీబిజీ..

Advertisement

సిరిసిల్లలో ఎటు చూసినా పవర్లూమ్‌ల మోతే వినిపిస్తోంది. బతుకమ్మ చీరల తయారీలో నేతన్నలు బిజీబిజీగా ఉన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్‌ను పూర్తి చేసేందుకు యజమానులు, కార్మికులు కలిసి పనిచేస్తున్నారు.

Also read: రేపు తెలంగాణకు భారీ వానగండం.. ఈ 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..?

Tags

Related News

దసరా పండుగ కంటే ముందే.. కాంగ్రెస్ నాయకులకు గుడ్‌న్యూస్..?

కేసీఆర్ ఫామ్ హౌస్ భూములపై సీఎం రేవంత్ రహస్య సర్వే.. ఇక నెక్ట్స్ ప్లాన్ అదేనా..?

నమ్మి గెలిపిస్తే.. ముఖం చాటేశాడు! సిరిసిల్లలో ఇప్పటి వరకు 15 సార్లు మాత్రమే పర్యటించిన కేటీఆర్‌..!

ఖైరతాబాద్‌లో హీటెక్కిన పాలిటిక్స్.. బీజేపీ టికెట్ కోసం ముమ్మర కసరత్తు!

వరి వద్దు.. ఈ సర్కార్‌ నోటి వెంటా ఇప్పుడిక అదే మాట..! కరువు ప్రభావం.. సాగునీటికి కటకట..!

కాసాని జ్ఞానేశ్వర్ రీ-ఎంట్రీ.. నెక్ట్స్ పొలిటికల్ ప్లాన్ ఇదేనా?

పులివెందుల రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. వైఎస్ ఫ్యామిలీ నుంచి మరొకరు రాజకీయాల్లోకి?

Big Stories

Advertisement
×