E-Paper
Advertisement

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్

కాస్మెటిక్ క్లినిక్‌లో షాకింగ్ నిజాలు… స్టార్ డాక్టర్‌తో ఢీకొన్న తర్వాత బయటపడే బ్యూటీ ఇండస్ట్రీ డార్క్ సీక్రెట్స్
Advertisement

Medical Psychological Drama: ఇంట్రెస్టింగ్ ఇంటెన్స్ సైకలాజికల్ మెడికల్ డ్రామా సిరీస్ ‘ప్లాస్టిక్ బ్యూటీ’ (Plastic Beauty) ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సిరీస్ అందం, సోషల్ మీడియా మోజు, మనుషుల మానసిక పోరాటాల చుట్టూ తిరిగే ఒక ఆసక్తికరమైన డ్రామా. నేటి సమాజంలో అందంగా కనిపించడం కోసం, పది మందిలో ప్రత్యేకంగా నిలవడం కోసం యువత ఎలాంటి ఒత్తిడికి గురవుతుందో ఈ కథలో ప్రధానంగా చూపించారు.  ఇది కేవలం హాస్పిటల్ లో జరిగే వైద్యం గురించి మాత్రమే కాకుండా, గ్లామర్ ప్రపంచంలోని చీకటి కోణాలను లోతుగా విశ్లేషించే డార్క్ అండ్ రియలిస్టిక్ జోనర్ సిరీస్. అందాల పరిశ్రమ వెనుక ఉన్న చీకటి కోణాలను ఈ జపనీస్ సైకలాజికల్ మెడికల్ డ్రామా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది. టోక్యో నగరంలోని ప్లాస్టిక్ సర్జరీ ప్రకటనలు, గ్లామర్ ప్రపంచాన్ని చూపిస్తూనే, మరోవైపు ప్రాణాలు కాపాడటానికి డాక్టర్ ఫుమి పడే తపనతో ఈ సిరీస్ సాగుతుంది.

కథలోకి వెళ్తే…

ఫుమి నుమాటా ప్రతిభావంతమైన ఎమర్జెన్సీ సర్జన్. ఓ అత్యవసర ఆపరేషన్ తర్వాత పరిస్థితులు మారడంతో ఆమె ఆసుపత్రి నుంచి బయటకు వచ్చి కాస్మెటిక్ మెడిసిన్ వైపు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ప్రముఖ కాస్మెటిక్ సర్జన్ రిన్ తోయామా నిర్వహిస్తున్న క్లినిక్‌లో చేరుతుంది. అయితే కాస్మెటిక్ సర్జరీపై మొదటి నుంచే సందేహాలు ఉన్న ఫుమి, అక్కడ జరుగుతున్న విధానాలను అంత ఈజీగా అంగీకరించదు.

Advertisement

రిన్ మాత్రం అందం కోసం చేసే మార్పులను కూడా ఒక రకమైన వైద్యంగానే చూస్తుంది. ఇద్దరి ఆలోచనలు పూర్తిగా భిన్నంగా ఉండటంతో క్లినిక్‌లో అడుగుపెట్టినప్పటి నుంచే ఘర్షణ మొదలవుతుంది. అదే సమయంలో ఒక్కో పేషెంట్ కథ ఫుమికి కొత్త ప్రశ్నలను ఎదురుచూపిస్తుంది. సోషల్ మీడియా ఫేమ్ కోసం సర్జరీ కోరుకునే యువకులు, తమ రూపంపై అసంతృప్తితో పదేపదే మార్పులు కోరుకునే వాళ్లు, కుటుంబ ఒత్తిడితో రూపాన్ని మార్చుకోవాల్సి వచ్చే పిల్లలు ఇలా ఒక్కో కేసు వెనుక ఒక్కో మానసిక సంఘర్షణ కనిపిస్తుంది.

ఫుమి ఈ ప్రపంచాన్ని లోతుగా పరిశీలించే కొద్దీ కేవలం సర్జరీలకే పరిమితం కాని డబ్బు, ఆశ, ఇమేజ్, కుటుంబ సంబంధాల వ్యవహారం బయటపడుతుంది. రిన్ గతం, ఆమె కుటుంబంతో ఉన్న సంబంధాలు కూడా కథలో కీలకంగా మారతాయి. ఆ రహస్యాలు బయటకు వస్తున్న కొద్దీ ఇద్దరు డాక్టర్ల మధ్య పోరు మరింత తీవ్రమవుతుంది. చివరికి ఫుమి, రిన్ ఇద్దరూ తమ నమ్మకాలను ఎదుర్కోవాల్సిన పరిస్థితికి చేరుకుంటారు. మరి ఫుమి కాస్మెటిక్ క్లినిక్‌లోకి ఎందుకు వెళ్లింది? రిన్ నడిపిస్తున్న ప్రపంచంలో దాగున్న నిజాలు ఏంటి? అందం కోసం మనుషులు ఎంత దూరం వెళ్లగలరు? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుకోవాల్సిందే.

Netflix ఓటీటీలో చూడవచ్చు 

Advertisement

యుకి సైతో దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు జున్యా ఇకెగామి రచన అందించారు. మయు మత్సుఒకా, రీసా నకా, షోటారో మామియా, మినామి తనకా, రికు హగివారా, మిజికా నగై తదితరులు నటించారు. మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్న ఈ జపనీస్ మెడికల్ సైకాలజికల్ డ్రామా Netflixలో సెప్టెంబర్ 17 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. భారత Netflix లిస్టింగ్‌లో జపనీస్ ఒరిజినల్‌తో పాటు ఇంగ్లీష్ ఆడియోలో కూడా అందుబాటులో ఉంది.  కాస్మెటిక్ సర్జరీ, బ్యూటీ స్టాండర్డ్స్, మానసిక ఒత్తిళ్లు, మెడికల్ సస్పెన్స్ కలిసిన కథలు ఇష్టపడేవారికి ‘Plastic Beauty’ డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్.

Read Also: మిలిటరీ స్కూల్‌లో ఫ్రెండ్ అదృశ్యం… ఇంటెన్స్ సిరీస్‌ను టీనేజర్స్ డోంట్ మిస్

Tags

Related News

సముద్రం కింద మరో అద్భుత ప్రపంచం… ఎడారిలోనూ వేలాది జీవుల వింత జీవితం… కళ్లకు విందు చేసే నేచర్ డాక్యుమెంటరీ

టాయ్స్‌కు కొత్త టెక్నాలజీతో పోటీ… స్మార్ట్ ట్యాబ్‌ను ఆపేందుకు రంగంలోకి వుడీ, బజ్… క్రేజీ ఫన్ అడ్వెంచర్

స్విట్జర్లాండ్ ట్రిప్‌లో తగిలే మిస్టీరియస్ యువకుడు… విధిని దాటి సాగే మ్యాజికల్ రొమాంటిక్ డ్రామా

తప్పు కేసులో జైలుకు… కోర్టు తీర్పు వెనుక షాకింగ్ సీక్రెట్… ఇంటెన్స్ కోర్టు రూమ్ సస్పెన్స్ డ్రామా

చాక్లెట్ ఫ్యాక్టరీలోకి 12 టీమ్స్ ఎంట్రీ… టెంప్ట్ అవ్వకపోతే కోట్ల ప్రైజ్ మనీ… క్రేజీ రియాలిటీ కాంపిటీషన్

ఆన్‌లైన్ స్కామర్లను ఆటపట్టించే కుర్రాళ్లు… ఏకంగా బిలియనీర్ క్రిప్టోనే కొట్టేస్తే? హై టెన్షన్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఫ్రెండ్ కోసం ఫేక్ డేటింగ్… ప్రొఫెసర్‌తో ఆ పనిదాకా వెళ్తే… ఈ రొమాంటిక్ కామెడీ తెలుగులోనే

Big Stories

Advertisement
×