తెలంగాణను దేశంతో ముడిపెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఇంతటి విపత్తు రాలేదనుకుంటా. పవన్ కళ్యాణ్ పుణ్యమా అని ఇప్పుడు ఇది దేశానికి సంబంధించిన ఇష్యూగా మారింది. ఎవరో కలలో వచ్చి చెప్పినట్టు.. జూన్ 2న వచ్చి మీటింగు పెడతానని నానాయాగీ చేశాడు. పర్మిషన్ ఎందుకియ్యరు? అంటూ తనే గొంతు చించుకున్నాడు. మీ అయ్య జాగీరా అని రెచ్చగొట్టాడు. దేశ సమైక్యత ఎటు పోతుందన్నాడు. ఇది పాకిస్తానా అని అర్థం పర్ధం లేని మాటలన్నాడు. మీరు ఉగ్రవాదులు అని కూడా సర్టిఫికెట్ ఇచ్చాడు.
నేను వస్తా.. ఎవరు ఆపుతారో చూస్తానని తనకు తానే తమాయించుకున్నాడు. ఎవరూ ఆపకున్నా.. ఆపినంత పనిచేసుకున్నాడు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన విషయం ఎవరికీ తెలియదనుకున్నాడు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌పై కొత్త కేసు పెట్టాలంటున్నారు. అదేమిటో తెలుసా? దేశ ద్రోహం కేసు. అవును.. కవిత సర్కార్‌ను డిమాండ్ చేశారు. వేర్పాటు వాదులని పెద్ద పెద్ద పదాలు వాడిన పవన్… తామేమీ దేశం నుంచి విడిపోతామని అనలేదే..? అనే కొత్త అంశాన్ని తీసుకొచ్చారు.
రాష్ట్రం విడిపోయింది. ఎవరికి వారు హాయిగా ఉన్నారు. ఎవరి రాజకీయాలు వారివి. మధ్యలో పవన్ వచ్చే చిచ్చుపెట్టాడు. ఢిల్లీకి పోయి.. మళ్లీ అవే మాటలు.. జాతీయత.. సమగ్రత.. సమైక్యత! ఎవరు కాదన్నారు? ఎవరు ఆటంక పరిచారు. తనకు తానే అన్నీ క్రియేట్ చేసుకుని. ఏదో జరుగుతుందని భ్రమించి.. భయపెట్టి.. రెచ్చగొట్టి.. రెచ్చిపోయి… పిచ్చిపట్టునట్టుగా ఊగిపోయి.. ఇవన్నీ ఇప్పుడు తెలంగాణ జనం భరిస్తున్నారు.
ఢిల్లీలో కూర్చుని ఇక్కడి నేతలను అవమానించేలా మాట్లాడాడు పవన్. ఢిల్లీ మెడలు వంచుతామంటారు. ఇక్కడికి రాగానే పిల్లులవుతారు.. అని మోడీకి తెలంగాణ నేతలు గజ్జున వణుకుతారనే విధంగా మాట్లాడారు. చలి చీమల చేతజిక్కి చావదే సుమతీ అనే పద్యాన్ని మొన్న హైదరాబాద్‌లో కాక్రోచ్ పార్టీ నిరసనలో ఎవరో అన్నారు. దీని అర్థం కూడా కరెక్టుగా తెలియదు పవన్‌కు. దీని సారాంశం.. చెడు బలమైనదైనా..మంచి, సత్యం.. బలహీనంగా ఉన్నా.. అవన్నీ కలిసి బలవంతమైన చెడును చంపేస్తాయనేది దాని అర్ధం. చలి చీమల ఐకమత్యాన్ని దీంట్లో పాజిటివ్‌గా చెప్పుకుంటారు. బలవంతమైన సర్పం.. భయానకంగా ఉండి చెడు చేసే దానికి చిహ్నంలా అర్థం చేసుకోవాలి.
కానీ పవన్ ఏమన్నాడు? చలి చీమలు వచ్చి.. బలవంతమైన సర్పాన్ని చంపుతాయి.. అందుకే కాక్రోచ్ పార్టీతో మనం జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చాడు. అంటే బలవంతమైన సర్పం.. మోడీ అని ఒప్పుకున్నాడా? ఆ పద్యంలో సర్పం… చెడుకు సంకేతం..బలహీనులు భయపడే ఓ భూతం.. మరి ఆ భూతం.. బీజేపీ అని అంగీకరించాడా? ఇక్కడ గుడ్డిగా కాక్రోచ్ పార్టీని వ్యతిరేకించాలనే భావనే తప్ప.. ఆ పద్యం సారాంశమేమిటో కూడా తెలియదు పవన్‌కు.
అంతటి ఆవేశపరుడు. ఆలోచన లేని నేత. అవగాహన శూన్యం. అందుకే కవిత అన్నారు ఇవాళ.. పిస పవన్ అని. పిస అంటే తెలంగాణలో పిచ్చోడు అని. నిజంగానే అట్లనే ఉన్నది పవన్ వ్యవహారం. దేశం కోసం తానే ఏదో పొడిచేస్తున్నట్టుగా బిల్డప్ ఇచ్చి.. మిగిలిన వాళ్లంతా దేశ ద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్న వపన్‌కు.. కవిత కరెక్టుగా సమాధానమిచ్చారనే అనుకోవాలి. దేశ ద్రోహం కేసు పెట్టండని ఆమె అనడం కూడా సందర్బోచితంగా ఉంది. సముచితంగా కూడా ఉందంటున్నారు తెలంగాణ వాదులు.