Chiranjeevi 158: మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్ అనగానే టాలీవుడ్‌లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘వాల్తేరు వీరయ్య’తో బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన ఈ క్రేజీ కాంబో.. ఇప్పుడు ‘Mega 158’ (వర్కింగ్ టైటిల్) అంటూ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది.
ఇక వినిపిస్తున్న టాక్స్ ప్రకారం సెకండ్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్లాన్ చేస్తుందట మూవీ టీమ్ .అందుకోసమే ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఒక భారీ, సెట్‌ను నిర్మించిందట .ఇక మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే ఈ సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో కొన్ని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు కథలో ముఖ్యమైన టాకీ భాగాలను షూట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇక మన శంకర వరప్రసాద్ అంటూ పొంగల్ కి వచ్చి బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించిన చిరు ఈ సినిమాని కూడా అదే పొంగల్ బరిలో దించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.అందులో భాగంగానే షెడ్యూల్ ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.ఇక ఇక్కడ మరో క్రేజీ న్యూస్ ఏంటంటే ఈ సెకండ్ షెడ్యూల్ ముగిసేలోపే హీరోయిన్ ఎవరనేది అఫీషియల్ గా ప్రకటించేందుకు ప్లాన్ చేస్తోందట ప్రొడక్షన్ హౌస్.అంటే వాళ్ళు కాదు వీళ్ళు అంటూ ఇండస్ట్రీలో తెగ సర్క్యులేట్ అవుతున్న గాసిప్స్ కి త్వరలోనే ఎండ్ కార్డ్ పడనుందన్న మాట.
Also read :ఆ హిట్ సినిమా రీమేక్ ? అనిల్ రావిపూడి కొత్త సినిమా కథపై సరికొత్త లీక్స్ !
ఇక బాబీ గతంలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్‌ను, మాస్ పల్స్‌ను పక్కాగా వాడుకుని ‘వాల్తేరు వీరయ్య’ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. కాబట్టి ఈసారి కూడా మెగాస్టార్‌ను వింటేజ్ లుక్‌లో, ఫుల్-లెంగ్త్ ఎంటర్‌టైనర్‌గా చూపిస్తారంటూ పిచ్చ కాన్ఫిడెంట్ గా ఉన్నారు మెగా ఫ్యాన్స్.ఇక ఈ సినిమాకి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ ఎస్ సంగీతాన్ని అందిస్తుండటం విశేషం. చిరంజీవి సినిమాలకు థమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏ రేంజ్‌లో ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే, మలయాళీ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ ఈ సినిమాలో చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తోంది. టాలీవుడ్‌లో వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ (KVN Productions)ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తోంది.
అయితే ఇదే సినిమాపై పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా వినిపిస్తుందండోయ్..అవును .. చిరంజీవి-బాబీ కాంబో అనగానే ఒక వర్గం ప్రేక్షకులు ‘మళ్లీ అదే రొటీన్ మాస్ మసాలా ఫార్ములానా?’ అనే డౌట్స్ రైజ్ చేస్తున్నారు మూవీ లవర్స్. ‘వాల్తేరు వీరయ్య’ కమర్షియల్‌గా సక్సెస్ అయినా, కథ పరంగా కొత్తదనం లేదనే విమర్శలు వచ్చాయి. ఈసారి బాబీ కొత్త కథతో వస్తున్నారా, లేక పాత ఫార్ములానే నమ్ముకున్నారా అనేది చూడాలి.ఇక సినిమాలో కూతురి పాత్ర (అనస్వర రాజన్) చుట్టూ తిరిగే సెంటిమెంట్ డ్రామా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఈ కాలంలో మితిమీరిన సిస్టర్ లేదా డాటర్ సెంటిమెంట్ వర్కవుట్ అవ్వడం కాస్త కష్టమే. మాస్ ఎలిమెంట్స్‌తో పాటు ఈ ఎమోషన్‌ను బాబీ ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్.
Also read :నజ్రియా కొంపముంచిన సెన్సేషనల్ పోస్ట్.. ఆ ఒక్క మాటతో బుక్కయిపోయిందా?
ఇక వీళ్ళ కాంబోకి దేవీశ్రీ కలిస్తే ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఆల్బమ్ వచ్చిందో తెల్సిందే. మరి dsp ని కాదని తమన్ ఆన్ బోర్డ్ అయితే ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందా అన్నది చూడాల్సిందే.నిజానికి థమన్ ఇటీవల కొన్ని సినిమాలకు రొటీన్ ట్యూన్స్ ఇచ్చాడన్న విమర్శలు వచ్చాయి. దీనికి తోడు ఈ చిత్రానికి సరైన అవుట్‌పుట్ సమయానికి ఇస్తాడా లేదా అనే భయం కూడా ఉంది.ఏదేమైనప్పటికీ, ‘Mega 158’ చుట్టూ జరుగుతున్న హడావుడి చూస్తుంటే ఇది టాలీవుడ్‌లో మరో ల్యాండ్‌మార్క్ మూవీ అయ్యేలాగే కనిపిస్తోంది. చూడాలి భారీ అంచనాల మధ్య సంక్రాంతి 2027 బరిలో దిగనున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో !