Sathi Leelavathi: ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) తాజాగా నటిస్తున్న చిత్రం ‘సతీ లీలావతి’. ఒకవైపు ఆమె ప్రెగ్నెన్సీనీ ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే.. మరొకవైపు తాను నటించిన చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కూడా వరుసగా వదులుతూ వార్తల్లో నిలుస్తోంది లావణ్య త్రిపాఠి. అందులో భాగంగానే ప్రముఖ డైరెక్టర్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్న సతీ లీలావతి మూవీ నుంచి ఇటీవల టీజర్ విడుదల చేయగా.. ఇప్పుడు లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. ఈ సినిమా నుండి చిత్ర బృందం పెళ్లి పాటను విడుదల చేసింది. “ఓరి పిల్ల.. చిత్తూరు పిల్ల” అంటూ సాగే ఈ లిరికల్ సాంగ్ కి వనమాలి లిరిక్స్ అందించగా.. నూతన్ మోహన్, కృష్ణ తేజస్వి ఆలపించారు. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం హైలెట్ గా నిలిచింది.. ఇక త్వరలోనే మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించనున్నారు. ఇకపోతే ఈ సినిమాలో దేవ్ మోహన్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
సతీ లీలావతి సినిమా విశేషాలు..
ఈ చిత్రం విషయానికి వస్తే.. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. భార్యాభర్తల మధ్య సంబంధాన్ని భావోద్వేగ, హాస్య అంశాలతో అన్వేషించే ఒక ఫీల్ గుడ్ మూవీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఇటీవల విడుదలైన టీజర్, వైవాహిక సంబంధాలపై విభేదాలు, విచిత్రమైన మలుపులను చూపించింది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ జూన్ లో విడుదలవగా.. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించి, ఆడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న లావణ్యకి.. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
లావణ్య త్రిపాఠి కెరియర్..
మోడల్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈ చిన్నది.. ఆ తర్వాత నటిగా మారింది. తెలుగు, తమిళ్ , హిందీ భాషలలో ప్రధానంగా నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది.. 2012లో వచ్చిన ‘అందాల రాక్షసి’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన లావణ్య.. ఆ తర్వాత దూసుకెళ్తా , మనం, భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయన , శ్రీరస్తు శుభమస్తు, ఉన్నది ఒకటే జిందగీ ఇలా దాదాపు చాలా సినిమాలలో నటించి మెప్పించింది. ఇక తాను ఇష్టపడిన మెగా హీరో వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్న ఈమె.. ఇప్పుడు గర్భం దాల్చిన విషయం తెలిసిందే.ఇక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా చేసిన లావణ్య ఇప్పుడు సతీ లీలావతి సినిమాతో సక్సెస్ అందుకోవాలని.. తన మొదటి బిడ్డకు కానుకగా ఇవ్వాలి అని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. మరి మెగా ఫ్యామిలీ సపోర్టుతో లావణ్యకి ఈ సినిమా కలిసొచ్చేటట్టే ఉంది అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు..
ALSO READ:War 2 First Review : వార్ 2 ఫస్ట్ రివ్యూ.. హృతిక్ కంటే ఎన్టీఆరే!