BigTV English

Kannappa Collections: కన్నప్ప మొదటివారం కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

Kannappa Collections: కన్నప్ప మొదటివారం కలెక్షన్స్.. మొత్తం ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?

Kannappa Collections: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu) వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు విష్ణు (Manchu Vishnu).. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన చిత్రం కన్నప్ప(Kannappa). జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఒక మోస్తారుగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజానికి ముందు నుంచి నెగిటివ్ ట్రోల్స్ ఎదుర్కొంటూ వచ్చిన ఈ సినిమా.. ఆ తర్వాత ప్రత్యేకించి ప్రభాస్ (Prabhas), మోహన్ లాల్ (Mohan Lal)పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అటు మంచు విష్ణు కూడా ఈ సినిమా కోసం భారీగానే కష్టపడ్డారని, వర్మ (RGV) లాంటి వాళ్లు తెగ పొగిడేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో అక్షయ్ కుమార్ (Akshay Kumar), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) వంటి వారు నటించారు. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి వారం పూర్తయిన నేపథ్యంలో మొదటి వారం ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయం ఇప్పుడు వైరల్ గా మారింది.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వారం రోజులు పూర్తయినా.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయింది. మొదటివారం ముగిసేసరికి ఇండియా మొత్తం ఇప్పటివరకు కేవలం రూ.30.14 కోట్ల నెట్ వసూల్ ను మాత్రమే సాధించిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఇండియా గ్రాస్ అలాగే ఓవర్సీస్ వసూలు కలుపుకొని రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆక్యుపెన్సీతో కూడా తప్పని తిప్పలు..


ఇక ఇప్పుడు థియేటర్ ఆక్యుపెన్సీతో కూడా ఇబ్బంది పడుతోంది. ఏడవ రోజు తెలుగు వెర్షన్ 12.89% ఆక్యుపెన్సీ మాత్రమే నమోదు చేసింది. మార్నింగ్ షోలు 11.06% ఉండగా.. నైట్ షో లకు 13.99% గా ఉంది. ఇలా గురువారం మాత్రం 6.61% మాత్రమే ఆక్యుపెన్సీతో థియేటర్లు రన్ అయ్యాయి. ఇక హిందీ వెర్షన్ పరిస్థితి అయితే మరింత దారుణంగా మారిపోయింది.

రోజూ వారీ కలెక్షన్స్..

జూన్ 27వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ.9.35 కోట్లు వసూలు చేయగా.. శనివారం రూ.7.15 కోట్లు.. ఆదివారం రూ.6.9 కోట్లు సంపాదించింది. ఇక నాలుగవ రోజు రూ.2.30 కోట్లు, ఐదవ రోజు రూ.1.18 కోట్లు, ఆరవ రోజు రూ.1.35 కోట్లు, ఏడవ రోజు రూ.1.25 కోట్లు వసూల్ చేసింది. అలా రూ.28.65 కోట్ల నెట్ వసూలు వసూల్ చేయగా.. రిలీజ్ అయిన ఏడు రోజుల్లోనే రూ.30.14 కోట్ల నెట్ కలెక్షన్ సాధించి పెద్దగా అభివృద్ధి చూపించలేకపోయింది. ఏది ఏమైనా రూ.200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా.. వారం రోజులైనా ఇంకా రూ.50 కోట్లు కూడా పూర్తి చేయకపోవడంతో ఈ సినిమా భారీ నష్టాల్లో ఉందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఇండస్ట్రీ హిట్ అని చెప్పుకొని తిరుగుతున్న చిత్ర బృందం.. ఈ కలెక్షన్స్ తో ఎలాంటి సమాధానం ఇస్తుంది అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ:Ranya Rao: ప్రముఖ హీరోయిన్ కి ఈడీ షాక్.. రూ.34 కోట్ల అక్రమ సంపాదనపై!

Related News

Ananya Nagalla : మృణాల్ ఏముంది భయ్యా? ఈ తెలుగు అమ్మాయి అందం చూస్తే మతిపోతుంది

Nara Rohit: ఎన్టీఆర్ ఇష్యూ పై స్పందించిన నారా రోహిత్.. అసలు మ్యాటర్ ఏంటంటే?

Kajol: కాజోల్ పై బాడీ షేమింగ్.. సిగ్గులేదా అంటూ ప్రముఖ నటి ఫైర్!

Peddi : రామ్ చరణ్ సినిమాలు రిజెక్ట్ చేసిన మలయాళం బ్యూటీ

Samantha: క్రైమ్ థ్రిల్లర్ కథతో సమంత కొత్త మూవీ.. డైరెక్టర్ ఎవరంటే?

Raja saab : రాజా సాబ్ లైన్ క్లియర్, ఇంకా ఇంత వర్క్ పెండింగ్ లో పెట్టారా?

Big Stories

×