E-Paper
Advertisement

వారణాసిలో రామ్ చరణ్.. ఏ పాత్రలో అంటే?

వారణాసిలో రామ్ చరణ్.. ఏ పాత్రలో అంటే?
Advertisement

Varanasi: ఈ మధ్యకాలంలో చాలామంది హీరోలు ఇతర హీరోల చిత్రాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ సినిమాకి అదనపు హైప్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల చిత్రాలలో మరో స్టార్ హీరో క్యామియో రోల్ పోషించి ఆకట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు వారణాసి మూవీకి మరో హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి చేస్తున్న ఈ ప్రయత్నం సినిమాకు అదనపు క్రేజ్ ను తీసుకురావడం గ్యారెంటీ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

వారణాసి పై క్రేజీ న్యూస్..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకుడిగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రాజమౌళి (Rajamouli) వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటిస్తున్నారు. అందులో భాగంగానే ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో ఏకంగా ఆస్కార్ రెడ్ కార్పెట్ పై దర్శనమిచ్చిన ఈయన.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ‘వారణాసి’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ ఏడవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం నుండి ఇప్పుడు మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

అలాంటి పాత్రలో రామ్ చరణ్..

Advertisement

ఈ సినిమా నుండి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నా.. రాజమౌళి మాత్రం కేవలం పోస్టర్లతోనే సరిపెడుతున్నారు. అందులో భాగంగానే ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా కేవలం రుద్ర పాత్రలో నటిస్తున్నట్లు ఒక ఫోటోను మాత్రమే రివీల్ చేసి సరిపెట్టారు. అయితే ఇప్పుడు వారణాసిపై మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయంలోకి వెళ్తే.. మహేష్ బాబు ఈ సినిమాలో రుద్రుడిగా, రాముడిగా నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రాముడి పాత్ర రివీల్ చేయలేదు. ఈ మేరకు ఈ సినిమాలో త్రేతాయుగంలో రాముడి పాత్రలో మహేష్ బాబు నటిస్తున్నారని, అటు హనుమంతుడిగా రామ్ చరణ్ (Ram Charan) కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సాధ్యమేనా?

ఒకవేళ ఇదే నిజమైతే సినిమాపై అంచనాలు తారస్థాయికి చేరడమే కాకుండా హనుమంతుడి పాత్రలో రామ్ చరణ్ నటన ఎలా ఉంటుందో చూడడానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎగ్జైట్ అవుతున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వస్తున్న ఈ క్రేజీ న్యూస్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ సమయంలో జరిగిన గాయానికి ఇటీవల చేతి మణికట్టు వద్ద సర్జరీ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. త్వరలోనే సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తన కొత్త మూవీ ప్రాజెక్టును లాంచనంగా ప్రారంభించనున్నారు. ఇలాంటి సమయంలో ఈ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. మరి ఈ వార్త సాధ్యమేనా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి?

వారణాసి నుండి అప్డేట్ ఎప్పుడు?

Advertisement

గత ఏడాది ఆఖరిలో వారణాసి సినిమా టైటిల్ రివీల్ చేస్తూ ఒక చిన్న గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారే కానీ రాజమౌళి దీనిపై స్పందించకపోవడం గమనార్హం. మరొకవైపు ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్ర పోషిస్తున్నారు.

Related News

ఆగస్టు 15న మూవీ మజా.. ఏకంగా 7 సినిమాలు.. ఆ 2 మూవీస్ మస్ట్ వాచ్!

నా ఓటు గల్లంతయ్యింది -ప్రకాష్ రాజ్

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై కేస్ ఫైల్.. యువతికి హత్యా బెదిరింపులు!

స్టోరీ రైటర్స్ కు లక్కీ ఛాన్స్.. అన్నపూర్ణ స్టూడియోలో అవకాశం..!

ఆ విషయంలో అమల చాలా లక్కీ – నాగార్జున

ఆ మాట చెబుతూ.. వేదిక పైనే బోరున ఏడ్చేసిన కామాక్షి భాస్కర్ల

నడుము వయ్యారాలతో గిలిగింతలు పెడుతున్న రీతూ వర్మ.. ఫోటోలు వైరల్!

Big Stories

Advertisement
×