Sathya Golden:సత్య .. కమెడియన్ గా ఇబ్బడి ముబ్బడిగా సినిమాలు చేస్తూనే మరో వైపు లీడ్ రోల్స్ చేస్తూదూసుకుపోతున్నాడు ఈ క్రేజీ కమెడియన్.నిజానికి చాలా మంది కమెడియన్స్ తో పోలిస్తే సత్యకి ఉన్న ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్, టైమింగ్ ఉన్నాయనే చెప్పాలి.ఆ టాలెంట్ వల్లే పెద్ద పెద్ద హీరోల సినిమాలలో రెండు మూడు సీన్లు కనిపించినా చాలు థియేటర్లు నవ్వులతో దద్దరిల్లిపోతాయి.
వివాహ భోజనంబు సినిమాతో మంచి మార్కులు
అయితే కమెడియన్ గా టాప్ లీగ్ లోకి దూసుకుపోయిన సత్య హీరోగా కాస్త తడబడుతున్నాడనే చెప్పాలి. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన వివాహ భోజనంబు సినిమాతో మంచి మార్కులే వేసుకున్న సత్య నితీష్ రానా దర్శకత్వంలో వచ్చిన జెట్లీ సినిమాతో మాత్రం ఆ అంచనాలని అందుకోలేకపోయాడు,నిజానికి సత్య హీరోగా వస్తున్నాడంటే ట్రేడ్ వర్గాలతో పాటు,అటు ఆడియన్స్ లో కూడా మంచి బజ్ ఏర్పడింది కూడా.కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద బొక్క బొర్లా పడింది.దీంతో సత్య మళ్ళీ సినిమాలో మెయిన్ లీడ్ గా కనిపించే ధైర్యం చేస్తాడా అని అనుకున్నారంతా ..
ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో హీరోలుగా
కానీ అస్సలు తగ్గేదేలే అంటూ ఈసారి కోలీవుడ్ స్టార్ కమెడీయన్ యోగి బాబుతో జోడీ కట్టి పవన్ బాసం శెట్టి దర్శకత్వంలో ‘గోల్డెన్ భాగ్యం’ అనే సినిమాతో మరోసారి ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయిపోయాడు.ఒక తెలుగు కమెడియన్.. ఒక తమిళ కమెడియన్.. ఇద్దరూ కలిసి ఒకే సినిమాలో హీరోలుగా కనిపించడం ఇప్పటికే కొంత క్యూరియాసిటీ తీసుకొచ్చింది. పైగా దర్శకుడు వీళ్లిద్దరి భాషా తేడానే కామెడీ పాయింట్‌గా మార్చే ప్రయత్నం చేశాడు. సత్య తమిళంలో మాట్లాడటం.. యోగిబాబు తెలుగులో మాట్లాడటం.. ఈ కాన్సెప్ట్‌ను ‘తెలుమిళ్’ అంటూ పరిచయం చేయడం చూస్తే సినిమా ఫుల్ కామెడీ రైడ్‌లా కనిపిస్తోంది.
కానీ గ్లింప్స్ లో ఉన్న కామెడీ సినిమా మొత్తం కంటిన్యూ అవుతుందా అనేదే అసలు ప్రశ్న. జెట్లీ సినిమాలో కూడా ఇలాగే గ్లింప్స్ లో తెగ నవ్వించిన సినిమా థియేటర్ లో ఫుల్ సినిమాకి వచ్చేసరికి ఏమైందో మనం చూశాం. మరి ఈ ‘గోల్డెన్ భాగ్యం’ సత్య పాలిట నిజంగానే ‘గోల్డెన్ గా మారుతుందా లేక టైటిల్ వరకే ఆ ‘గోల్డెన్ పరిమితం అవుతుందా చూడాలి.
సత్తా చాటుతాడా లేక సైలెంట్ గా సైడ్ అయిపోతాడా
నిజానికి సత్య దగ్గర కామెడీకి కొదవ లేదు. కానీ ఆ కామెడీని సరిగ్గా వాడుకుంటూ ఫుల్ సినిమాగా ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేయగలగడమే ఇపుడు అసలు ఛాలెంజ్.అందుకే ఇప్పుడు ‘జెట్‌లీతో జలక్ తిన్నావ్ సత్యా.. ఈ సినిమాతో అయినా హిట్ కొడతావా?’ అంటూ సరదాగా సెటైర్లు పడుతున్నాయి.
also read :బండ్ల గణేష్ ..ఈవెంట్లు ఫుల్ ..సినిమాలు మాత్రం నిల్ !
మొత్తానికి ‘గోల్డెన్ భాగ్యం’ సినిమాతో సత్యకు కావాల్సింది ఇప్పుడు కావలసింది కామెడీ సినిమా కాదు.. తన హీరో ఇమేజ్‌ను మరో మెట్టు ఎక్కించే సినిమా. ‘జెట్‌లీ’ తర్వాత వచ్చిన విమర్శలకి ఆన్సర్ ఇచ్చే మంచి ఛాన్స్ వచ్చింది,మరి సత్య సత్తా చాటుతాడా లేక సైలెంట్ గా జెట్లీలా సైడ్ అయిపోతాడా చూడాలి !