E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

టాలీవుడ్‌కి దొరికిన మరో విజయ్ దేవరకొండ.. ఆకాశానికి ఎత్తేసిన ఆర్జీవి

టాలీవుడ్‌కి దొరికిన మరో విజయ్ దేవరకొండ.. ఆకాశానికి ఎత్తేసిన ఆర్జీవి
Advertisement

Deewana Movie: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏ చిన్న సినిమా సంచలనం సృష్టిస్తుందో చెప్పడం కష్టం. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి, బాక్సాఫీస్ దగ్గర అలాగే సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించే సినిమాలే వేరు. ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో, నెటిజన్ల నోళ్లలో నానిపోతున్న ఒకే ఒక్క పేరు దీవాన . ఒక వైపు క్లాసిక్ టచ్, మరోవైపు ఊరమాస్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ‘ఇదొక్క అద్భుతమైన ఫిల్మ్’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

లైన్ ఆన్ ది లైన్స్ ఆఫ్ విజయ్ దేవరకొండ

ముఖ్యంగా ఈ సినిమాతో పరిచయమైన యంగ్ అండ్ డైనమిక్ హీరో హర్షిత్ రెడ్డి (@harshitreddy_16) నటనకు టాలీవుడ్ ఫిదా అయిపోతోంది.ఇక ఇదే సినిమా పై రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అవుతూ ఒక కొత్త నటుడు స్క్రీన్ మీదకి వచ్చినప్పుడు ప్రేక్షకులు మొదట చూసేది ఆటిట్యూడ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్. ఈ విషయంలో హర్షిత్ రెడ్డి వందకు వంద మార్కులు కొట్టేశాడు. థియేటర్ల నుండి బయటకు వస్తున్న ఆడియన్స్ నుండి వింటున్న  మాట ఒక్కటే—లైన్ ఆన్ ది లైన్స్ ఆఫ్ విజయ్ దేవరకొండ!.అంటూ  హర్షిత్ ని ఆకాశానికి ఎత్తేశాడు.

Advertisement

Also read :పాపం హరీష్ శంకర్ …అసలు లెక్క చేయని నవీన్ పోలిశెట్టి!

టాలీవుడ్‌కి మరో లీడింగ్ అండ్ రిమార్కబుల్ యాక్టర్

ఒకప్పుడు ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో విజయ్ దేవరకొండ చూపించిన ఆ ఇంటెన్సిటీ, ఆ రా వైబ్స్, ఆ డైలాగ్ డెలివరీ గుర్తున్నాయా? సరిగ్గా అలాంటి అరాచకమైన నటననే హర్షిత్ ఈ సినిమాలో డెలివర్ చేశాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. కేవలం నటన మాత్రమే కాదు, క్యారెక్టర్‌లోని పెయిన్, ఎమోషన్, అగ్రెషన్‌ను హర్షిత్ క్యారీ చేసిన విధానం చూస్తుంటే.. టాలీవుడ్‌కి మరో లీడింగ్ అండ్ రిమార్కబుల్ యాక్టర్ దొరికేసినట్టే అనిపిస్తోంది. ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్స్ లేకపోయినా, కేవలం టాలెంట్‌తోనే యూత్‌ని తన వైపు తిప్పుకునే కెపాసిటీ హర్షిత్ రెడ్డికి ఉందని ఈ సినిమాతో ప్రూవ్ అయిపోయిందనె  చెప్పాలి .

ఈ కుర్రాడి క్రేజ్ మరింత పెరగడం ఖాయం

Advertisement

సినిమా చూసిన క్రిటిక్స్ సైతం ‘దీవాన’ ఒక ఫైనెస్ట్ ఫిల్మ్ మేకింగ్‌కి నిదర్శనం అని మెచ్చుకుంటున్నారు . రొటీన్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా, నేటితరం యూత్ మైండ్ సెట్‌ను ప్రతిబింబించేలా ఈ కథను తెరకెక్కించారు. ఇందులో సినిమా ఎక్కడా ఆర్టిఫిషియల్‌గా అనిపించదు. ప్రతి సీన్ మన పక్కింట్లోనో, మన లైఫ్ లోనో జరిగినట్టుగా అంత నేచురల్‌గా ఉంటుంది. కేవలం లవ్ అండ్ అగ్రెషన్ మాత్రమే కాదు, ఇందులో ఉన్న యూత్ ఫుల్ ఎమోషన్స్ ఆడియన్స్‌ను సీట్లకు కట్టిపడేస్తున్నాయి.

Also read :తారక్ రికార్డ్‌పై ‘పెద్ది’ గురి తప్పిందా?.. ఎంత కష్టపడినా చరణ్‌కు అది అందని ద్రాక్షేనా ?

సినిమాలోని డైలాగ్స్ మరియు మ్యూజిక్ ఇప్పటికే రీల్స్‌లో, మీమ్స్ లో వైరల్ అవుతూ నెక్స్ట్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం ఎక్స్ (ట్విట్టర్), ఇన్ స్టాగ్రామ్‌లలో #Deewanaహ్యాష్ ట్యాగ్ తెగ హల్‌చల్ చేస్తోంది. “ఈ సినిమా ఒక ఎమోషనల్ రైడ్, మిస్ అవ్వకండి” అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. హర్షిత్ రెడ్డి పర్ఫార్మెన్స్‌పై వస్తున్న పాజిటివ్ రివ్యూలు చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ కుర్రాడి క్రేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

Related News

గోవాలో ఖుష్బూ కూతురి పెళ్లి.. ఒకే వేదికపై మెరిసిన టాలీవుడ్ స్టార్స్

పాపం హరీష్ శంకర్ …అసలు లెక్క చేయని నవీన్ పోలిశెట్టి!

నెట్టింట వైరల్ అవుతున్న లక్ష్మీ మంచు కామెంట్స్.. కలెక్షన్ కింగ్ వారసత్వం అంటే ఇదే మరి!

తారక్ రికార్డ్‌పై ‘పెద్ది’ గురి తప్పిందా?.. ఎంత కష్టపడినా చరణ్‌కు అది అందని ద్రాక్షేనా ?

Pawan Kalyan OG 2…ఊహించని రేంజ్‌లో ‘OG 2’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

40 ఏళ్ల తర్వాత రజనీ, కమల్ క్రేజీ కాంబో.. ‘ధర్మన్’ మేకింగ్ వీడియోతో పూనకాలు!

పోలీస్ స్టేషన్ టు బిగ్‌బాస్ హౌస్? సీజన్ 10 మేకర్స్‌కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన ఎస్‌ఐ..

Big Stories

×