Mahabubnagar:మహబూబ్ నగర్ కి చెందిన నిజాముద్దీన్ అనే యువకుడు ఎంఎస్ చేసేందుకు 2016లో యుఎస్ కి వెళ్లాడు. అక్కడ కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి రూమ్ లో ఉన్నాడు. తోటి రూమ్‌మేట్స్ తో ఏసీ విషయంలో గొడవ జరిగింది. ఆ క్రమంలో నిజాముద్దీన్ రూమ్‌మేట్ పై కత్తితో దాడి చేశాడు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిజాముద్దీన్ చేతిలో ఉన్న కత్తిని వదలమని ఆదేశించారు. అతడు వారి మాట వినకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో నిజాముద్దిన్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే అతడు చనిపోయాడని వైద్యులు తెలిపారు.