Visakhapatnam: విశాఖపట్నంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. HPCLలో రఫ్ గ్యాస్ కంప్రెసర్ లీకైంది.దీనితో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించింది.ఈ ఘటనతో భయాందోళనకు గురైన కార్మికులు బయటకు పరుగులు తీశారు. కొందరు కార్మికులు ప్రమాదంలో చిక్కుకున్నట్టు సమాచారం.పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపడుతున్నారు.