Raviteja:మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలతో దూసుకుపోతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇటీవలే ‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న ఆయన, తన 78వ చిత్రాన్ని వైవిధ్యమైన సినిమాల దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘తులాభారం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేస్తూ, చిత్ర బృందం ప్రత్యేకంగా టైటిల్ డాక్యుమెంటరీని విడుదల చేసింది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం..
‘బ్రోచేవారెవరురా’, ‘సరిపోదా శనివారం’ లాంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వివేక్ ఆత్రేయ, రవితేజ కోసం ఒక సరికొత్త కథను సిద్ధం చేశారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ‘తులాభారం’ టైటిల్ డాక్యుమెంటరీని మేకర్స్ ఈరోజు గ్రాండ్‌గా విడుదల చేశారు. చిత్ర నిర్మాణం, బ్యాక్‌గ్రౌండ్ వర్క్‌కు సంబంధించిన విషయాలను ఇందులో చూపించడంతో సినిమాపై ఉన్న క్యూరియాసిటీ ఒక్కసారిగా పెరిగిపోయింది.
రవితేజ మార్క్ అన్‌స్టాపబుల్ ఎనర్జీకి వివేక్ ఆత్రేయ రాసే బలమైన పాత్రలు, స్క్రీన్‌ప్లే తోడైతే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్ పరంగా కూడా మంచి హైప్ నెలకొంది.
ఈ సినిమాలో ప్రియాంకా మోహన్ ‘మహాలక్ష్మి’ అనే ఆసక్తికరమైన పాత్రలో కనిపించనుండగా, మరో కథానాయికగా అనాసవర రాజన్ నటిస్తున్నారు. వీరితో పాటు టాలెంటెడ్ నటులు జేడీ చక్రవర్తి శివాజీ రావు గాను, దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రంలో దేవరాజ్ అనే కీలకమైన పాత్రలల్లో నటించబోతుండటం విశేషం. ఈ స్టార్ కాస్టింగ్ చూడగానే సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
also read:శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో స్క్రిప్ట్ రైటర్ రెమ్యూనరేషన్ అంతా?
‘ఇరుముడి’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసిన రవితేజ, అదే జోష్‌తో బ్యాక్ టూ బ్యాక్ ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెడుతున్నారు. వివేక్ ఆత్రేయతో చేస్తున్న ఈ ప్రయోగాత్మక మాస్ అండ్ క్లాస్ మూవీ ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచిపోతుందని సినీ వర్గాల్లో గట్టిగా చర్చ జరుగుతోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్‌డేట్స్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.
ఇక మొత్తానికి, రవితేజ మరియు వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న ‘తులాభారం’ సినిమా టైటిల్ డాక్యుమెంటరీతోనే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, మాస్ మహారాజాని కొత్త కోణంలో ఎలా చూపిస్తుందో వేచి చూడాలి..