E-Paper
Advertisement

ఇందిరమ్మ ఇళ్లు పథకం పేరుతో భూ కబ్జా.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు!

ఇందిరమ్మ ఇళ్లు పథకం పేరుతో భూ కబ్జా.. పట్టించుకోని మున్సిపల్ అధికారులు!
Advertisement

Huzurabad Land: స్వేచ్చ బ్యూరో: పట్టపగలే అధికారిక పథకాల పేరుతో భూ ఆక్రమణలకు తెగబడుతూ, న్యాయం అడిగిన వారిపైనే దౌర్జన్యాలకు దిగుతున్న ఆగడాలు హుజూరాబాద్‌లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ పత్రాలు, స్పష్టమైన హద్దులున్న స్థలంలోకి చొరబడి, హద్దు రాయిని తొలగించి మరీ అక్రమంగా పిల్లర్లు వేస్తున్న వైనం స్థానికంగా విస్మయానికి గురిచేస్తోంది. బాధితులకు న్యాయం చేయాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంతో, మున్సిపల్ యంత్రాంగం అక్రమార్కులతో కుమ్మక్కైందా అనే తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

అసలేం జరిగింది?

బాధితుల వివరాల ప్రకారం.. హుజూరాబాద్ పట్టణ పరిధిలోని 9వ వార్డు, సర్వే నంబర్ 1988/A/C/A పరిధిలో గల 242 గజాల స్థలాన్ని బోరగాల సులోచన వద్ద నుండి సేల్ డీడ్ ద్వారా బాధితురాలు సబ్బని వరలక్ష్మి కొనుగోలు చేశారు. నాలుగు దిక్కులా స్పష్టమైన సరిహద్దు రాళ్లు (హద్దు కనులు) ఉన్న ఈ రిజిస్టర్డ్ భూమిలోకి కొందరు వ్యక్తులు చొరబడ్డారు. సదరు స్థలంలోని ఒక హద్దు రాయిని దౌర్జన్యంగా తొలగించి, పిల్లర్లు వేస్తూ గోడ నిర్మాణాన్ని ప్రారంభించారు. తమ భూమిలో హద్దులు చెరిపివేసి అక్రమ నిర్మాణాలు ఎందుకు చేపడుతున్నారని సబ్బని వరలక్ష్మి, ఆమె భర్త వెంకటస్వామి నిలదీయగా.. నిర్మాణ పనులు చేయిస్తున్న బరిగె సమ్మయ్య, పాక స్వరూప, పాక సాయికిరణ్, బోనగిరి నరసయ్య తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. “మా వార్డులోకి వచ్చి మమ్మల్నే ప్రశ్నిస్తారా? ఎంత ధైర్యం మీకు? మీ అంతు చూస్తాం” అంటూ భార్యాభర్తలను నడిరోడ్డుపై తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపేస్తామని బెదిరింపులకు దిగారు.

అనుమతుల్లేవు.. ఆధారాల్లేవు.. అంతా దౌర్జన్యమే!

Advertisement

నిర్మాణదారులు తాము కడుతున్నది ‘ఇందిరమ్మ ఇల్లు’ అంటూ ప్రచారం చేస్తూ, గత జూన్ 25న మార్కింగ్ పేరిట స్థలంలోకి ప్రవేశించారు. అయితే, నేటివరకు ఆ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి చట్టబద్ధమైన డాక్యుమెంట్లు గానీ, అధికారిక అనుమతులు గానీ లేవని తెలుస్తోంది. పక్కా రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్న ప్రైవేట్ స్థలాన్ని ఏ ఆధారాలు లేకుండా పథకం ముసుగులో కబ్జా చేయడానికి యత్నించడం గమనార్హం.

Also read: ఎర్రవల్లి ఫామ్‌హౌస్ సరిహద్దుల్లో 45 ఎకరాల మిస్సింగ్.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం!

మున్సిపల్ అధికారుల తీరుపై తీవ్ర అనుమానాలు!

Advertisement

తమ స్థలాన్ని కాపాడాలని బాధితురాలు సబ్బని వరలక్ష్మి, భర్త వెంకటస్వామి తగిన రికార్డులతో హుజూరాబాద్ మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడమే కాకుండా, ఆర్డీవో ప్రజావాణిలో కూడా లిఖితపూర్వకంగా ఆర్జీ సమర్పించారు. అయినప్పటికీ అధికారులు క్షేత్రస్థాయికి వచ్చి నిర్మాణాన్ని అడ్డుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. కళ్లముందే అక్రమ నిర్మాణం జరుగుతున్నా మున్సిపల్ యంత్రాంగం చోద్యం చూస్తోందంటే.. అక్రమార్కులతో అధికారులు లోపాయికారీగా చేతులు కలిపారా? లేక రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారా? అని ప్రజలు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.

దొంగే దొంగ అన్నట్లు.. రివర్స్ కేసులు!

తమ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రభుత్వ అధికారుల దృష్టిని మళ్లించేందుకు కబ్జాదారులే ఏకంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బాధితులపై తప్పుడు ఫిర్యాదు చేశారు. తప్పు చేసి దబాయించడమే కాకుండా, పోలీసులను సైతం తప్పుదోవ పట్టించేలా బాధితులపైనే రివర్స్ ఫిర్యాదు ఇవ్వడం ‘ఉల్టా చోర్ కొత్వాల్‌ను కొట్టిన’ చందంగా మారింది.

ఉన్నతాధికారులు స్పందించాలి..

మహిళ అని కూడా చూడకుండా నడిరోడ్డుపై ప్రాణహాని బెదిరింపులకు దిగుతూ, రిజిస్టర్డ్ స్థలాన్ని ఆక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సబ్బని వరలక్ష్మి, వెంకటస్వామి దంపతులు కన్నీటిపర్యంతమై వేడుకుంటున్నారు. తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, క్షేత్రస్థాయి విచారణ జరిపి అక్రమ నిర్మాణాన్ని నిలిపివేయించి కూల్చివేయాలని, బెదిరింపులకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read: కేటీఆర్ మరో కోణం…. నకిలీ బతుకుల ఫేక్ అకౌంట్లకు కేరాఫ్ అడ్రస్..! సోషల్ మీడియా చీకటి రాజ్యానికి తనో రారాజు…!

Tags

Related News

రామాయంపేట బడుల్లో ఎమ్మెల్సీ మల్క హల్‌చల్.. కేజీబీవీ విద్యార్థులకు కీలక హామీ!

కేబీఆర్ పార్కు చుట్టూ భారీగా మార్పులు.. జీహెచ్‌ఎంసీ మరో బిగ్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా..?

సైలెంట్‌గా గులాబీ సర్వేలు.. ఖైరతాబాద్, ఎమ్మెల్సీ పోరుపై ముందస్తు వ్యూహం!

కన్నీళ్లు పెట్టిస్తున్న తెల్లబంగారం.. నల్గొండలో 80 శాతం పత్తిపంట నష్టం!

నాగోల్‌లో దారుణం.. నడిరోడ్డుపై కాళ్లు, చేతులు లేని మహిళ మృతదేహం!

తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్‌లో రూ.7 కోట్ల స్కామ్.. షాక్‌లో ఉన్నతాధికారులు!

నెల దాటినా పూర్తికాని పంట సర్వే.. ప్రభుత్వం విధించిన గడువు నీటిమూటలేనా?

Big Stories

Advertisement
×