E-Paper
Advertisement

వెంటిలేటర్ పై జబర్దస్త్ కమెడియన్.. వైద్యులు ఏమన్నారంటే?

వెంటిలేటర్ పై జబర్దస్త్ కమెడియన్.. వైద్యులు ఏమన్నారంటే?
Advertisement

Jabardasth Comedian: తెరపై నవ్వులు చిందిస్తూ.. ఆడియన్స్ ను మెప్పించడమే లక్ష్యంగా ఎంతోమంది సెలబ్రిటీలు శ్రమిస్తూ ఉంటారు. అయితే తెర వెనుక వారు పడే కష్టాలు వెలుగులోకి వచ్చినప్పుడు మాత్రం అయ్యో పాపం అనడం మినహా ఇంకేం చేయగలం అనే కామెంట్లు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇకపోతే వెండితెరపై నవ్వులు కురిపించి, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న జబర్దస్త్ కమెడియన్ ఇప్పుడు అనారోగ్య సమస్యలతో వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటూ అభిమానులను ఆందోళనలకు గురి చేస్తున్నారు. మరి ఆయన ఎవరు? అసలేం జరిగింది? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ? వైద్యులు ఏమంటున్నారు ? తదితర విషయాలపై సోషల్ మీడియా వేదికగా ఆరా తీస్తున్నారు.

వెంటిలేటర్ పై జబర్దస్త్ కమెడియన్..

ఆయన ఎవరో కాదు అగ్గిపెట్టె మచ్చ కిరణ్ (Aggipette macha Kiran) . సోషల్ మీడియా ద్వారా ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈయన తనదైన కామెడీ, ప్రత్యేకమైన మాట తీరు , హావ భావాలతో మంచి ఆదరణ దక్కించుకున్నారు. రీల్స్ వీడియోలు చేస్తూ ఒకప్పుడు ఆడియన్స్ మెప్పించిన కిరణ్.. జబర్దస్త్ , శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి టీవీ షోలలో కూడా సందడి చేశారు . ఇకపోతే నిన్నటి వరకు తన వీడియోలతో, రీల్స్ తో అందరినీ నవ్వించిన కిరణ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనే వార్త అభిమానులను కలచి వేస్తోంది. ఈ మేరకు అందుతున్న సమాచారం ప్రకారం.. తీవ్ర అనారోగ్యంతో అక్టోబర్ 5న తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం..

వైద్యులు ఏమన్నారంటే?

Advertisement

ఆయన అనారోగ్య సమస్యల దృష్ట్యా ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచి అత్యవసర వైద్యం అందిస్తున్నట్లు సమాచారం . ముఖ్యంగా ఆయన త్వరగా కోలుకోవాలి అంటే అత్యవసర మెరుగైన చికిత్స అవసరమని వైద్యులు సూచించారట. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి అసలు కిరణ్ కు ఏమైంది ? ఏ అనారోగ్య సమస్య తలెత్తింది? ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలపై అధికారికంగా పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.

ALSO READ:  నాగార్జున ఫోన్లో ఒక్క ఫోటో కూడా ఉండదట.. ఎందుకో తెలుసా?

సోషల్ మీడియాతోనే భారీ పాపులాటిరీ..

అగ్గిపెట్టె మచ్చ పేరుతో తిరుపతికి చెందిన కిరణ్ ప్రత్యేకమైన డైలాగులు, హావ భావాలతో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. కొద్దికాలంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. అంతేకాదు యూట్యూబర్లు కూడా ఈయనను ప్రత్యేకంగా ఇంటర్వ్యూలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా సోషల్ మీడియా సెన్సేషన్ గా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న కిరణ్.. ఇప్పుడు సడన్గా అనారోగ్యం బారినపడి వెంటిలేటర్ పై చికిత్స తీసుకోవడం అందరిని కలిచివేసే అంశం.. ఆయన త్వరగా కోలుకోవాలని మళ్లీ ఎప్పటిలాగే తన కామెడీతో అభిమానులను నవ్వించాలి అని నెటిజన్స్ కోరుతున్నారు. ఏది ఏమైనా అగ్గిపెట్టె మచ్చ కిరణ్ ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాలంటే ఆ టెస్టులు పాస్ అవ్వాల్సిందేనా?

అతని చేతిలో దారుణంగా మోసపోయిన బిగ్ బాస్ గాయత్రి!

Gundeninda GudiGantalu Today episode: తాయత్తు ఎంతపని చేసింది..? ఇదేం రచ్చ రా నాయనా.. రోహిణి ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : మహా, విక్కీ లవ్ ట్రాక్.. చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ పై సెటైర్లు.. ఇదే ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి దిమ్మతిరిగే షాక్.. రామారాజుకు నిజం తెలుస్తుందా..? ఇంట్లోంచి వల్లి వెళ్ళిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: ఇంట్లోంచి వెళ్లిపోయిన పల్లవి.. దిమ్మతిరిగే షాక్.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి..

Nindu Noorella Saavasam Serial Today Episode October 7th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థును చంపేందుకు స్పాట్‌కు తీసుకెళ్లిన మనోహరి

Big Stories

Advertisement
×