E-Paper
Advertisement

Smart Comparison: ఓప్పో A6s 5G vs ఐకూ Z11x vs పోకో M8.. ఏది కొనుగోలు చేయాలి?

Smart Comparison: ఓప్పో A6s 5G vs ఐకూ Z11x vs పోకో M8.. ఏది కొనుగోలు చేయాలి?
Advertisement

Oppo A6s 5G vs iQOO Z11x vs Poco M8 Smart Comparison| భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లొ ఇటీవలే ఓప్పో A6s 5G లాంచ్ అయింది. రూ.20,000 లోపు సెగ్మెంట్‌లో ఐకూ Z11x 5G, పోకో M8 5Gతో పోటీ పడుతోంది. మూడు ఫోన్లు వేర్వేరు బలాలు కలిగి ఉన్నాయి. పర్‌ఫామెన్స్, డిస్‌ప్లే, బ్యాటరీలో తేడాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిని వివరంగా చూద్దాం.

ధరలు, స్టోరేజ్ ఆప్షన్లు

ఓప్పో A6s 5G 4GB ర్యామ్ +128GB వేరియంట్ ధర రూ.18,999. 6GB వేరియంట్ ధర రూ.20,999.
iQOO Z11x 5G 6GB ర్యామ్ +128GB వేరియంట్ రూ.18,999, 8GB ర్యామ్ +128GB ధర రూ.20,999. 8GB ర్యామ్ +256GB వేరియంట్ ధర రూ.22,999.
Poco M8 5G 6GB ర్యామ్+128GB వేరియంట్ ధర రూ.17,999తో అతి చౌకగా ఉంది.

డిస్‌ప్లే, విజువల్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

ఓప్పో A6s 5Gలో 6.75 ఇంచ్ HD+ LCD డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1125 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
ఐకూ Z11x 5Gలో 6.76 ఇంచ్ Full HD+ డిస్‌ప్లే, 120Hz, 1200 నిట్స్ బ్రైట్‌నెస్ ఉంది.
పోకో M8 5Gలో 6.77 ఇంచ్ కర్వ్డ్ ఆమోలెడ్ స్క్రీన్, Full HD+, 120Hz, 3200 నిట్స్ బ్రైట్‌నెస్‌తో బెస్ట్ డిస్‌ప్లే ఇస్తుంది.

పర్‌ఫామెన్స్, ప్రాసెసర్

ఓప్పో A6s 5Gలో మిడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్ ఉంది. సాధారణ పనులు, మోడరేట్ ఉపయోగానికి సరిపోతుంది.
ఐకూ Z11x 5Gలో డైమెన్సిటీ 7400 టర్బో ఉంది. గేమింగ్, హై పనితీరుకు బెస్ట్.
పోకో M8 5Gలో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 ఉంది. రోజువారీ పనులకు బ్యాలెన్స్‌డ్ పనితీరు ఇస్తుంది.

సాఫ్ట్‌వేర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

ఓప్పో A6s 5G ఆండ్రాయిడ్ 16 + ColorOS 15తో స్మూత్ ఇంటర్‌ఫేస్ ఇస్తుంది.
ఐకూ Z11x 5G ఆండ్రాయిడ్ 16 + OriginOS 6తో పర్‌ఫామెన్స్, కస్టమైజేషన్‌ ప్రాధాన్యం ఇస్తుంది.
పోకో M8 5G ఆండ్రాయిడ్ Android 15 + HyperOS 2తో క్లీన్, ఆప్టిమైజ్డ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

కెమెరా పోలిక

ఓప్పో A6s 5G: 50MP ప్రైమరీ + 2MP సెకండరీ కెమెరాలుండగా.. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరా ఉంది.
ఐకూ Z11x 5G: 50MP మెయిన్ + 2MP డెప్త్ కెమెరా సెన్సార్లున్నాయి. 32MP సెల్ఫీ కెమెరాతో మూడు ఫోన్లలో ఇదే బెస్ట్.
పోకో M8 5G: 50MP మెయిన్ + 2MP సెకండరీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 20MP సెల్ఫీ కెమెరా ఉంది.

కనెక్టివిటీ ఫీచర్లు

ఓప్పో A6s 5G ఫోన్ 5G కనెక్టివిటీ, Wi-Fi 5, బ్లూటూత్ 5.4 టెక్నాలజీలను సపోర్ట్ చేస్తున్నాయి.
ఐకూ Z11x 5G: Wi-Fi 6, డ్యూయల్ సిమ్ సపోర్ట్‌ చేస్తుంది.
పోకో M8 5G: 5G నెక్టివిటీ, Wi-Fi 6, బ్లూటూత్ 5.1 సపోర్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి.
ఐకూ కొత్త ఫోన్‌లో అడ్వాన్స్ కనెక్టివిటీ ఫీచర్స్‌ ఉండడంతో.. ఈ కేటగిరీలో అదే బెస్ట్.

బ్యాటరీ, ఛార్జింగ్

ఓప్పో A6s 5Gలో 6500mAh బ్యాటరీ కెపాసిటీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఐకూ Z11x 5G: 7200mAh (అతి పెద్ద బ్యాటరీ) + 44W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
పోకో M8 5G: 5520mAh బ్యాటరీ + 45W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
పెద్ద బ్యాటరీలో ఐకూ ఆధిక్యంలో ఉంది.

Also Read: లగ్జరీ కార్లు తయారు చేస్తున్న రోబోలు.. జర్మన్ కంపెనీ ప్రయోగం

ఏది బెస్ట్?

డిస్‌ప్లేలో పోకో M8 5G బెస్ట్. పనితీరు, బ్యాటరీ పరంగా iQOO Z11x 5G బలంగా ఉంది. బ్యాలెన్స్‌డ్ ఫీచర్లు, మంచి బ్యాటరీ కోసం ఓప్పో A6s 5G తీసుకోండి. మీ అవసరాలకు తగిన ఫోన్ ఎంచుకోండి.

ముఖ్య గమనిక: ఈ కథనంలో పేర్కొన్న స్మార్ట్‌ఫోన్ల ధరలు.. ఆయా కంపెనీలు ఇచ్చే ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. కస్టమర్లు జాగ్రత్తగా చెక్ చేసి కొనుగోలు చేయాలని సూచన. ఈ కథనంలో తెలిపిన ధరలు మీరు కొనుగోలు చేసే సమయానికి మారిపోయి ఉండవచ్చు. ‘బిగ్ టీవీ’ అలాంటి విషయాలకు బాధ్యత వహించదు.

Related News

సినిమా లవర్స్‌కు పండగే.. పాకెట్ మనీ ధరకు.. 4K కంటెంట్ స్ట్రీమింగ్ ప్రొజెక్టర్!

భూమి తిరగడం ఒక్క సెకను ఆగితే ఏమవుతుంది? అసలు మానవజాతి మిగులుతుందా?

ల్యాప్‌టాప్ కావాలా? మార్కెట్లో అదరగొడుతున్న.. టాప్-5 టచ్‌స్క్రీన్ మోడల్స్ ఇవే!

ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నా ఫోన్ సన్నగానే ఉందా? ఒప్పో మ్యాజిక్ అంటే ఇదేనేమో!

ఆస్ట్రేలియా బాటలోనే భారత్.. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాపై ఆంక్షలు నిజమేనా?

మోటరోలా కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ సేల్ మొదలైంది.. ఆఫర్లతో ఏకంగా రూ.10,000 ఆదా!

ఏకకాలంలో 10 గాడ్జెట్లు చార్జ్.. బ్లూయెట్టి మ్యాజిక్ పవర్ స్టేషన్.. అడవుల్లోనూ ఇంట్లో ఉన్నట్లే!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

Big Stories

Advertisement
×