E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్ ప్లాన్ సక్సెస్  

Nindu Noorella Saavasam Serial Today march 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాథోడ్ ప్లాన్ సక్సెస్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ హ్యాపీగా రాథోడ్ ను పిలిచి ఇంకొద్ది సేపట్లో మనోహరి రూంలోంచి కేకలు వినిపిస్తాయి చూడు అని చెప్పగానే.. రాథోడ్‌ మంచి చేశావు మిస్సమ్మ… ఆ యాదమ్మకు కూడా ఇంట్లోంచి తరిమేయాలి అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ మరీ ఇంత వైలెంట్‌ గా తయారయ్యావేంటి రాథోడ్‌ అంటుంది. రాథోడ్‌ కోపంగా ఏం చేయమంటావు మిస్సమ్మ ఇద్దరి మీద అంత కోపంగా ఉంది అని చెప్పగానే.. మిస్సమ్మ కోపంగా నువ్వు ఆ ఇద్దరి మీద పెడుతున్న కాంన్‌సంట్రేషన్‌ మా ఇద్దరి మీద పెడుతున్నావా..? రాథోడ్‌.. వాళ్ల మీద కోపం పెడుతున్నట్టుగా మా మీద దృష్టి పెట్టడం లేదు.. అనగానే.. అలా అంటావేంటి మిస్సమ్మ నీకోసం ఎన్ని చేయలేదు అంటాడు.

దీంతో మిస్సమ్మ ఏం చేశావు రాథోడ్‌.. ఆయన్ని నన్ను కలిపావా..? ఆయనతో నన్ను మాట్లాడించావా..? కనీసం మా చూపులైనా కలిసిలాగా చేశావా..? ఇప్పటికీ మా రూములు వేరుగానే ఉన్నాయి తెలుసా…? అనగానే.. రాథోడ్‌ అర్థం అయింది మిస్సమ్మ ఇప్పుడే సార్‌ రూంకు వెళ్తాను.. అక్కడి నుంచి భాగీ అన్న పిలుపు వినిపిస్తుంది రెడీగా ఉండు.. అంటాడు. దీంతో మిస్సమ్మ అబ్బ చా ఆయన నన్ను పేరు పెట్టి పిలవడం అది జరిగే పనేనా…? అంటుంది. దీంతో రాథోడ్‌ నువ్వే చూస్తావుగా ఫాలో మీ అంటూ రాథోడ్‌ పైకి అమర్‌ రూంలోకి వెళ్తాడు. వెనకే మిస్సమ్మ వెళ్లి డోర్‌ దగ్గర నిలబడుతుంది. రూంలో అమర్‌ బట్టలు సర్దుతుంటాడు. రాథోడ్‌ వెళ్లి గుడ్‌ మార్నింగ్‌ సార్‌ ఏం చేస్తున్నారు సార్ అని అడుగుతాడు. దీంతో అమర్‌ కనిపించడం లేదా..? బట్టలు మడతపెడుతున్నాను.. అని చెప్పగానే..రాథోడ్‌ మీరెందుకు సార్ మడతపెట్టడం అంటాడు.

Advertisement

దీంతో అమర్‌ నేను  కాకపోతే నువ్వు మడతపెడతావా…? అంటాడు. దీంతో రాథోడ్‌ నేను ఎందుకు సార్‌ మడతపెడతాను.. అంటాడు. అమర్‌ కోపంగా అయితే నేను చేయక నువ్వు చేయక మరెవరు చేస్తారు అని అడగ్గానే.. రాథోడ్‌ ఆవిడను పిలిస్తే వచ్చి చేస్తుంది కదా..? సార్‌ అని చెప్పగానే.. అమర్‌ ఆవిడ ఎవరు..? అని అడుగుతాడు.. షాకింగ్‌ గా రాథోడ్‌ మీ ఆవిడ సార్‌ అంటాడు. అమర్‌ మా ఆవిడా…? అని ప్రశ్నించగానే.. రాథోడ్‌ నవ్వుతూ.. మిస్సమ్మ సార్‌ అంటాడు.. దీంతో అమర్‌ కోపంగా తను ఒకప్పుడు నా భార్య ఇప్పుడు తనను నేను యాక్సెప్ట్‌ చేయడం లేదు అని చెప్పగానే.. రాథోడ్‌ చేయకండి ఆవిడ ఇంట్లోంచి వెళ్లిపోతుంది. అప్పుడు మీ కూతురు ఎక్కడుందో మీకు తెలియకుండా పోతుంది చేయకండి అంటాడు.. దీంతో అమర్‌ అనుమానంగా రాథోడ్ ఏం అంటున్నావు అని అడగ్గానే.. రాథోడ్‌ లేకపోతే ఏంటి సార్ నేను మీకు చెప్పిన ప్లాన్ ఏంటి..? మీరు దాన్ని అమలు చేయకపోవడం ఏంటి..? సార్‌ మీరు మిస్సమ్మతో క్లోజ్‌గా ఉంటేనే సార్‌ మీ కూతురు ఎక్కడుందో తెలిసేది..? అని చెప్పగానే..

అమర్‌ భయంగా నేను తనతో క్లోజ్‌గా ఉంటే ఎక్కడ యాక్సెప్ట్‌ చేస్తానోనని భయంగా ఉంది రాథోడ్‌ తర్వాత కలిసిపోతానేమోనని టెన్షన్‌ గా ఉంది అని చెప్పగానే.. రాథోడ్‌ సార్ మీది మరీ ఇంత వీక్‌ మైండా సార్‌.. ఏంటి సార్‌ మరి మీరు ఎంత స్ట్రాంగ్‌ పర్సనో నాకు తెలియదా..? క్లోజ్‌గా ఉన్నట్టు నటించినంత మాత్రాన మిస్సమ్మకు పడిపోతారా మీరు..? అనగానే.. అమర్‌ లేదు ఐయామ్‌ స్ట్రాంగ్‌ పడిపోను.. అని చెప్పగానే.. అయితే మిస్సమ్మను పిలిచి పని చెప్పండి సార్‌ అంటాడు రాథోడ్‌.. దీంతో అమర్‌ నువ్వే పిలువు రాథోడ్‌ అంటాడు. నేను పిలవకూడదు సార్‌ మిస్సమ్మ ఇక్కడే ఎక్కడో ఉంది..? ఒకసారి భాగీ అని పిలవండి పరుగున వచ్చేస్తుంది. అనగానే.. అంతే అంటావా…? పిలవమంటావా.. ? అనగానే.. ఆలోచించకుండా  పిలవండి సార్‌ అని రాథోడ్‌ చెప్పగానే.. అమర్ భాగీ అంటూ గట్టిగా పిలుస్తాడు. డోర్‌ దగ్గరే నిలబడి అంతా వింటున్న మిస్సమ్మ అమర్‌ పిలుపునకు ఉలిక్కి పడుతుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

బిగ్ బాస్ అంటే మరీ అంత చులకనేంటీ శ్రీముఖి… యాంకరమ్మ పై భారీ ట్రోల్స్!

ఇండస్ట్రీలో గ్రూపులు.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!

ఎట్టకేలకు నరేష్ ఏజ్ బయటపెట్టిన రామ్ ప్రసాద్ !

వివాదంలో బిగ్ బాస్ షో.. విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై క్లారిటీ!

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ.. పోస్ట్ వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Big Stories

Advertisement
×