Kayadu Lohar: కయాదు లోహర్ (Kayadu Lohar) .. డ్రాగన్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి సినిమాలు ప్రకటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే ఈమె పాపులారిటీ ఇప్పుడు మరింత పెరగడానికి కారణం నాని (Nani) హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ చిత్రంలో హీరోయిన్గా అవకాశం అందుకోవడమే.. నిన్న మొన్నటి వరకు ప్రమోషన్స్ కి దూరంగా.. తన తమిళ సినిమా షూటింగ్ లతో బిజీగా గడిపిన కయాదు.. ఇప్పుడు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో విషయాలను పంచుకుంటోంది. అందులో భాగంగానే తన పేరు వెనుక ఉన్న అసలు విషయాన్ని, దాని అర్థాన్ని, ముఖ్యంగా తన పేరుకు పురాణాలతో ఉన్న సంబంధం గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది కయాదు లోహార్.
తాజాగా సుమ నిర్వహించిన ది ప్యారడైజ్ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో నాని తో కలిసి ఈమె సందడి చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా సుమ ప్రశ్నిస్తూ.. మీకు ఆ పేరు పెట్టడం వెనుక అసలు కారణం ఏమిటి ? అని ప్రశ్నించింది దీనికి కయాదు మాట్లాడుతూ.. పురాణాలలో హిరణ్యకశిపుడి భార్య పేరు కయాదు. ఆ పేరు స్ఫూర్తితోనే నాకు కయాదు అనే పేరు పెట్టారు.
అలాగే నా ఇంటి పేరు వెనుక కూడా ఒక ఆసక్తికరమైన మార్పు ఉంది. మొదట మా కుటుంబ ఇంటి పేరు గదైలి గా ఉండేది. అయితే మా కుటుంబం అస్సాం నుంచి పూణేకి మారిన తర్వాత మా నాన్న దానిని లోహార్ గా మార్చారు. అయితే పేరు మార్చడం వెనుక అసలు కారణం నాకు తెలియదు. లోహర్ అనే పదానికి ఐరన్ లేడీ అని అర్థం వస్తుంది. అందుకే నా పేరు వెనుక ఇంత హిస్టరీ ఉంటుందని ఎవరు ఊహించి ఉండరు అంటూ కయాదు లోహర్ తెలిపింది.
also read:బిగ్ బాస్ 10లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న భల్లాల దేవ?
మోడల్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈమె.. తొలిసారి మొగిల్ పేట అనే చిత్రంతో తన కెరీర్ను ప్రారంభించింది. నటిగా మొదటి సినిమాతో పర్వాలేదనిపించుకున్న ఈమె.. ఆ తర్వాత మలయాళ చిత్రంలో నటించింది. 2022 లో మొదటిసారి అల్లూరి అనే చిత్రంలో నటించింది కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక తర్వాత తమిళంలో వచ్చిన డ్రాగన్ సినిమాను తెలుగులో విడుదల చేయగా ఇక్కడ విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇక ఇటీవల వచ్చిన ఫంకీ, హృదయం మురళి వంటి చిత్రాలు ఈమెకు మంచి విజయాన్ని అందించాయి.