E-Paper
Advertisement

పోస్టర్స్ పై నంబర్స్ ఎవడడిగాడు….బ్లాస్ట్ అయిన దిల్ రాజు !

పోస్టర్స్ పై నంబర్స్ ఎవడడిగాడు….బ్లాస్ట్ అయిన దిల్ రాజు !
Advertisement

Dil Raju: ఇండస్ట్రీలోని బొక్కల్ని మరోసారి బయటపెట్టారు. దిల్ రాజు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సీనియర్ స్టార్ ప్రొడ్యూసర్ సినిమా గురించి, ఇక్కడి సంగతుల గురించి తనదైన శైలిలో సమాధానమిచ్చారు.ముఖ్యంగా సినిమాల పోస్టర్స్ పై వేసే నంబర్స్ పై,అలాగే పాటలకి వేసే మిలియన్ల వ్యూస్ , లైక్స్ పై కుండ బద్దలు కొట్టేశాడు.అసలు ఆ నంబర్స్ వేయమని ఎవడు అడిగాడని, ఎవరో ఒకరు మొదలెట్టిన దీనిని మెల్లిగా ఇండస్ట్రీ అంతా వంట బట్టించుకుందని, దీని వల్ల వచ్చే లాభం పైసా ఉండదని అసలు విషయం చెప్పుకొచ్చాడు.

హీరోల ఫ్యాన్స్ కి మాత్రమె నంబర్స్ పట్ల ఆసక్తి

నిజానికి ఇదంతా 2015 కి ముందు లేదని, ఆ తర్వాతే ఇండస్ట్రీలో ఇది పాకి పోయిందని తెలిపాడు.మొదట్లో నేను కూడా ఇలానే వేశానని ,అలా మూడేళ్ళు అయ్యాక ఇదేదో రాంగ్ గా వెళ్తుందని గ్రహించి అప్పటి నుండి ఆర్గానిక్ వ్యూస్ అని వేయడం అలవాటు చేసుకున్నానని చెప్పుకొచ్చాడు.హీరోల ఫ్యాన్స్ కి మాత్రమె ఈ పోస్టర్స్ ,నంబర్స్ ,లైక్స్ ,వ్యూస్ పట్ల ఆసక్తి ఉంటుందని,కానీ కామన్ ఆడియన్ కి ఏ మాత్రం అవసరం లేని టాపిక్ అని అన్నారు.ఎదో స్వంత సాటిస్ ఫ్యాక్షన్ కోసం ఉల్టా డబ్బులు ఇచ్చి నంబర్స్ వేయించుకోవాలని కానీ అదసలు అవసరమే లేదని, సినిమా ,లేదా పాట బాగుంటే ఆటోమేటిక్ గా జనమే నెత్తిన పెట్టుకుంటారని చెప్పుకొచ్చాడు.

Advertisement

also read:ట్రాజెడీ ట్రెండ్.. చావుల చుట్టూ తిరిగే ప్రేమకథలను నేటి యూత్ యాక్సెప్ట్ చేస్తుందా?

ఆ పాటకి ఏకంగా 114 మిలియన్ల వ్యూస్

ఇక దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోని గోదారి గట్టుపైన సాంగ్ ని చెప్పుకొచ్చాడు. ఈ పాటకి టీ సిరిస్ వాళ్ళు మొదట్లో1 మిలియన్ వ్యూస్ అనే నెంబర్ మాత్రమే వేశారని ,కాని జనాలు దాన్ని బాగా లైక్ చేసి సూపర్ హిట్ చేయడం తో ఆ పాటకి ఏకంగా 114 మిలియన్ల వ్యూస్ తో దుమ్ము దులిపిదందని అసలు విషయం బయటపెట్టాడు. విషయంలో సత్తా ఉంటె ఫేస్ ప్రమోషన్స్ అవసరమే లేదని ఇకనుండైనా వీటికి దూరంగా ఉండటం మంచిదని తెలిపాడు.

మంచి దారిలో నడవాలంటూ హితవు

Advertisement

ఇక ఇదే ఇంటర్వ్యూ లో గేమ్ చేంజర్ సినిమా కలెక్షన్స్ పోస్టర్ పై కూడా చెప్పుకొచ్చాడు దిల్ రాజు. అందరు చేసిన తప్పుల్లో భాగంగా మేమూ అలానే చేశామని ,కానీ రెండో రోజుకే జనాలకి ఇది ఫేక్ పోస్టర్ అని అర్థం అవుతుందని మనసులోని మాటని బయటపెట్టాడు.నిజానికి 80ఏళ్ల చరిత్ర ఉన్న ఈ  ఇండస్ట్రీకి అలా నెగెటివ్ దారిలో ,తప్పుగా వెళ్ళడం అవసరం లేదని ,ఇప్పటి జనరేషన్ అయినా ఫేక్ పోస్టర్ల వైపు , ఫేక్ ప్రమోషన్స్ వైపు వెళ్ళకుండా మంచి దారిలో నడవాలంటూ హితవు పలికాదు.

also read:Kalki 2898 AD.. రెండేళ్లయినా తగ్గని ‘కల్కి’ రేంజ్.. సరికొత్త పోస్టర్‌తో షేక్ చేస్తున్న ప్రభాస్

మొత్తంగా ఈ ఇంటర్వ్యూలో దిల్ రాజు ఇండస్ట్రీ గురించి చేసిన మరిన్ని కామెంట్స్ ఇపుడు అటు సినీ ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయ్.చూడాలి మరి థియేటర్ల వ్యవహారం, పోస్టర్ల వ్యవహారం , సినిమా ప్రొడక్షన్ వ్యవహారాలపై దిల్ రాజు చేసిన ఈ కామెంట్స్ పై ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో !

Tags

Related News

“ఆయన నక్క.. నేను కుక్కను” నసీర్‌పై కంగనా ఘాటు వ్యాఖ్యలు

డ్రామాలొద్దంటున్న త్రిష.. ఎవరిని ఉద్దేశించిందో తెలుసా?

50కి దగ్గరైనా తగ్గేదేలే.. సురేఖ వాణి జిమ్ వీడియో వైరల్!

మళ్లీ నోరుజారిన చిరు.. ‘మెగా 158’ టైటిల్ లీక్ చేసి.. ఇదే ఆ టైటిల్

రాముడిగా మహేష్ బాబు.. ఫ్యాన్సుకు పూనకాలు తెప్పిస్తున్న వీడియో, ఏం ఉంది భయ్యా!

పరిగెడుతూ ముక్కుపుడక మింగేసిన హీరోయిన్..వైరల్ వీడియో !

తెలంగాణ సంస్కృతి చూసి ఫరియా కంటతడి.. అసలేం జరిగిందంటే?వీడియో వైరల్!

ఎన్టీఆర్ కి రేపు సర్జరీ.. డ్రాగన్ వాయిదా పడనుందా?

Big Stories

Advertisement
×