Ranabaali Second Documentary: విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) రష్మిక మందన్న (Rashmika Mandanna)ప్రధాన పాత్రలలో రాహుల్ సాంకృత్యన్(Rahul Sankrityn) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రణబాలి(Ranabaali). ఈ సినిమా దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ చాలా మంచి ఆదరణ సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేకర్స్ సరికొత్త నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా థియేటర్లలో విడుదలవ్వడానికంటే ముందుగానే ఈ సినిమా కథ నేపథ్యం ఏంటి అనే అంశాలను డాక్యుమెంటరీ ద్వారా ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ది ట్రూత్ సిరీస్ అంటూ నాలుగు భాగాలను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ది ఫెమిన్ వుయ్ ఫర్గాట్ అనే ఒక సిరీస్ విడుదల చేయగా తాజాగా రెండో సిరీస్ విడుదల చేశారు ద హిస్టరీ వుయ్ ఫర్గాట్ (The History we Forgot)పేరుతో రెండో భాగం విడుదల అయింది ఇందులో భాగంగా బ్రిటిష్ పాలకుల నిర్ణయాలపై ఈ సిరీస్ లో ప్రస్తావించారు. ముఖ్యంగా బ్రిటిష్ పాలనలో దక్షిణాది భారత దేశంలో నెలకొన్న పరిస్థితుల గురించి అప్పటి ప్రజల జీవన విధానం, 19వ శతాబ్దంలో చోటుచేసుకున్న కరువు, ప్రజలు ఎదుర్కొన్న ఆకలి, పేదరికం వంటి పరిస్థితులను తెలియజేశారు.
ఇకపోతే ఈ సిరీస్ లో బ్రిటిష్ కాలంలో రైల్వేలను అభివృద్ధి చేయడం గురించి కూడా ప్రస్తావించారు. బ్రిటిష్ పాలనలో రైల్వే వ్యవస్థను కేవలం ప్రజల సౌకర్యం కోసం అభివృద్ధి చేశారా ? లేకపోతే వారి అవసరాల కోసమే రైల్వే ఏర్పాటు చేశారా? అనే అంశాలను కూడా ఈ సిరీస్ ద్వారా తెలియజేశారు. సాధారణంగా మనం చదివే చరిత్రలో కొన్ని సంఘటనలను మాత్రమే మనకు కనిపిస్తుంటాయి కానీ చాలా నిజాలు కాలక్రమంలో మరుగున పడిపోయాయని ఈ సిరీస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా 1876-78 మధ్యకాలంలో ఏర్పడిన కరువు అప్పటి బ్రిటిష్ పాలనకు సంబంధించిన విషయాలు ఇందులో చూపించబోతున్నారని తెలుస్తోంది. రణబాలి అనేది కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా మరుగున పడిపోయిన కొన్ని నిజాలను ప్రేక్షకులకు ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమాకు సంబంధించి ఈ డాక్యుమెంటరీ ద్వారా సినిమాలోని కీలక విషయాలను తెలియచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రణబాలి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది.
Also Read: బిగ్ బాస్ కృష్ణుడు కూతురిని చూశారా? ఎంత అందంగా ఉందో?