BigTV English

OTT Movie : తల్లీ కూతుర్లు ఇద్దరినీ ఒకేసారి… రక్తాన్ని మరిగించే దారుణం… ప్రతీ సీను క్లైమాక్స్ లా ఉండే రివేంజ్ డ్రామా

OTT Movie : తల్లీ కూతుర్లు ఇద్దరినీ ఒకేసారి… రక్తాన్ని మరిగించే దారుణం… ప్రతీ సీను క్లైమాక్స్ లా ఉండే రివేంజ్ డ్రామా

OTT Movie : బాలీవుడ్ సినిమాలకు టాలీవుడ్ ప్రేక్షకులు రెడ్ కార్పెట్ వేస్తుంటారు. ఈ సినిమాలను చూస్తూ చిల్ అవుతుంటారు. అయితే ఇప్పుడ్డు మనం చెప్పుకోబోయే బాలీవుడ్ సినిమా రివేంజ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ చిత్రంలో ఒక తల్లి, ఆమె కుమార్తెపై జరిగిన దారుణమైన దాడి తరువాత ఈ స్టోరీ ఒక గట్టి రివేంజ్ మోడ్ లోకి వెళ్తుంది. రవీనా టాండన్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాలలోకి వెళితే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘మాతృ’ (Maatr) 2017లో విడుదలైన హిందీ రివెంజ్ థ్రిల్లర్ చిత్రం. దీనికి అష్టర్ సయ్యద్ దర్శకత్వం వహించారు. ఇందులో రవీనా టాండన్ (విద్యా చౌహాన్‌గా), మధుర్ మిత్తల్ (అపూర్వ మాలిక్‌గా), దివ్యా జగ్దలే (రీతుగా), అలీషా ఖాన్ (టియాగా), అనురాగ్ అరోరా (ఇన్‌స్పెక్టర్ జయంత్ ష్రాఫ్‌గా), రుషద్ రానా (రవిగా), సహీమ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2017 ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని సీడీబీ మ్యూజికల్ బ్యానర్‌పై మైఖేల్ పెల్లికో నిర్మించారు. సంగీతం పాకిస్తానీ సూఫీ రాక్ బ్యాండ్ ఫుజోన్ అందించారు.


స్టోరీలోకి వెళితే

విద్యా చౌహాన్ (రవీనా టాండన్) ఒక స్కూల్ టీచర్. ఢిల్లీలో తన భర్త రవి (రుషద్ రానా), టీనేజ్ కుమార్తె టియా (అలీషా ఖాన్)తో జీవిస్తుంటుంది. భర్తతో ఆమె సంబంధం అంతంతమాత్రమే సాగుతున్నప్పటికీ, ఆమె తన కుమార్తెపై అపారమైన ప్రేమను కలిగి ఉంటుంది. ఒక రాత్రి స్కూల్ వార్షికోత్సవ కార్యక్రమం నుండి ఇంటికి తిరిగి వస్తుండగా, ట్రాఫిక్ జామ్‌ను తప్పించడానికి విద్యా ఒక నిర్మానుష్యమైన రహదారిని ఎంచుకుంటుంది. ఈ నిర్ణయం వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తుంది. ఈ రహదారిపై వీళ్ళ కారును ఒక గ్యాంగ్ ఫాలో అవుతుంది. వీళ్ళు అత్యంత దారుణమైన రీతిలో విద్యా, టియాపై అఘాయిత్యం చేస్తారు. ఈ దాడిలో టియా చనిపోతుంది. కానీ విద్యా బతికి బయటపడుతుంది. విద్యా ఈ దారుణ సంఘటన నుండి బయటపడినప్పటికీ, ఆమె జీవితం పూర్తిగా ఛిన్నాభిన్నమవుతుంది.

Read Also : కాల్ సెంటర్ లో రొమాంటిక్ చాట్… సీను సీనుకో ట్విస్ట్… క్లైమాక్స్ హైలెట్ మావా

ఆమె భర్త రవి ఈ ఘటనకు ఆమెనే నిందిస్తూ, ఆమెను విడిచిపెట్టడానికి నిర్ణయించుకుంటాడు. పోలీసు వ్యవస్థ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే దాడి అపూర్వ మాలిక్ అనే వ్యక్తి , ఒక శక్తివంతమైన రాజకీయ నాయకుడి కుమారుడు. న్యాయం దక్కకపోవడంతో, విద్యా తన స్నేహితురాలు రీతు (దివ్యా జగ్దలే) సహాయంతో స్వయంగా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇప్పుడు విద్యా ఒక సాధారణ స్కూల్ టీచర్ నుండి, ఒక ప్రతీకార యోధురాలిగా మారుతుంది. ఆమె తన కుమార్తెను చంపిన, తనపై దాడి చేసిన దుండగులను ఒక్కొక్కరినీ గుర్తిస్తూ, వారి కదలికలను ట్రాక్ చేస్తూ చంపుతుంటుంది. క్లైమాక్స్‌లో విద్యా తన ప్రతీకార యాత్రను పూర్తి చేస్తుంది.

Related News

OTT Movie : 28 హోటల్స్ ఫాంటసీ… బిజినెస్ మీటింగుకెళ్లి ఇదెక్కడి దిక్కుమాలిన యాపారం? మస్త్ మసాలా సీన్స్

OTT Movie : ‘స్క్విడ్ గేమ్’ లాంటి రియాలిటీ గేమ్… 2,000 మందితో బీస్ట్ గేమ్స్… మోస్ట్ కాంట్రవర్షియల్ కొరియన్ సిరీస్

OTT Movie : ప్రతీ రాత్రి ఒకరిని చంపే డెడ్లీ డెత్ గేమ్… కంటికి కన్పించకుండా నరకం చూపించే మాఫియా… ఒక్కో సీన్ కు గూస్బంప్స్

OTT Movie : చంపడానికే ఓటింగ్… చిన్న పిల్ల అని కూడా చూడకుండా దారుణం… చిన్న కథ కాదు భయ్యా

OTT Movie : డేటింగ్ యాప్ పేరుతో అమ్మాయి అరాచకం… తెలియకుండానే సైకో కిల్లర్ ఉచ్చులో… లాస్ట్ లో మతిపోగోట్టే ట్విస్ట్

OTT Movie : తలలు నరికి ఎత్తుకెళ్ళే సీరియల్ కిల్లర్… డెడ్లీ వయొలెన్స్… పోలీసులకే చెమటలు పట్టించే కేసు

Big Stories

×