E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఐర్లాండ్ సిరీస్ ను పిక్నిక్ లా ఎంజాయ్ చేశారు..ఇప్పుడు ప‌ళ్లు రాల‌గొట్టుకున్నారు

ఐర్లాండ్ సిరీస్ ను పిక్నిక్ లా ఎంజాయ్ చేశారు..ఇప్పుడు ప‌ళ్లు రాల‌గొట్టుకున్నారు
Advertisement

Shoaib Akhtar:   టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Team India vs. Ireland) మధ్య జరిగిన టి20 సిరీస్ (India tour of Ireland, 2026 ) నిన్నటితో ముగిసింది. అయితే ఇందులో టీమిండియా వైట్ వాష్ అయింది. రెండు మ్యాచ్ లలో కూడా చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా, 2-0 తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడిపోయి పరువు తీసుకుంది. ఈ క్రమంలో టీమిండియా జట్టు పై దారుణంగా ట్రోలింగ్ మొదలైంది. గౌతమ్ గంభీర్ అలాగే శ్రేయస్ అయ్యర్ ను తొలగించాల్సిందేనని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అటు మాజీ క్రికెటర్లు కూడా టీమిండియా పై సీరియస్ అవుతున్నారు.

Also Read: Ambati Rayudu react on pakistan women team : నెద‌ర్లాండ్ పై గెలిచారు క‌దా..ఇక పాక్ వీధుల్లో ర్యాలీలు చేయండి

ఐర్లాండ్ సిరీస్ పిక్నిక్ లా ఎంజాయ్ చేశారు.. ప‌ళ్లు రాల‌గొట్టుకున్నారు

Advertisement

ఐర్లాండ్ చేతిలో ఓడిపోయిన టీమ్ ఇండియాను అవమానించే తరహాలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఐర్లాండ్ సిరీస్ ను పిక్నిక్ టూర్ ( Ireland Tour Is Picnic) లాగా టీమిండియా లైట్ తీసుకుందని… అందుకే ఇప్పుడు పళ్ళు రాలగొట్టుకుందని చురకలు అంటించారు. కేవలం ఇంగ్లాండ్ సిరీస్ ను మాత్రమే సీరియస్ గా తీసుకున్నారు. అందుకే పసికూన ఐర్లాండ్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయారని షోయబ్ అక్తర్ ఫైర్ అయ్యారు. ఒక ఛాంపియన్ జట్టుకు ఉన్న లక్షణాలు టీమిండియాలో కనిపించలేదని ఆగ్రహించారు. దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

సూర్య కుమార్ యాద‌వ్ ను తొల‌గించి, టీమిండియా త‌ప్పు చేసింది

ఐర్లాండ్ చేతిలో టీమిండియా సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో సోదరుడు కోల్పోయిన బాధలో ఉన్న పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar) కూడా రెచ్చిపోయి మాట్లాడారు. ఐపీఎల్ లో ఆడటం అలవాటు చేసుకున్న టీమిండియా ప్లేయర్లు.. విదేశీ మైదానాలలో ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారని మండిపడ్డారు. అంతేతప్ప టీమిండియా బలమైన జట్టేనని వ్యాఖ్యానించారు. ఐర్లాండ్ సిరీస్ లో ఓడిపోయిన టీమిండియా, ఇంగ్లాండ్ పై అద్భుతంగా రాణించే ఛాన్స్ లు ఉన్నాయని అంచనా వేశారు. టి20 ప్రపంచ కప్ గెలిచిన సూర్య కుమార్ యాదవ్ ను తొలగించకుండా అలాగే కొనసాగిస్తే, టీమిండియా ఇవాళ గెలిచేదని స్పష్టం చేశారు. కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ చేతకావడం లేదని ఆగ్రహించారు. దీన్ని గౌతమ్ గంభీర్ దృష్టిలో పెట్టుకొని ముందుకు నడవాలని కోరారు. ఐపీఎల్ లో హైవే లాంటి ఫ్లాట్ పిచ్ లు ఉంటాయని.. కానీ అంతర్జాతీయ మ్యాచ్లలో అలాంటి మైదానాలు ఉండబోవని టీమిండియా ప్లేయర్లు గ్రహించాలన్నారు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ( Shoaib Akhtar). దీంతో షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read:  Womens Champions Trophy 2027 No Chance For Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్‌..పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుకు నో ఛాన్స్‌

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా..ఇంగ్లండ్ సిరీస్ లోనూ వైభ‌వ్ ను ఆడించ‌బోం

అవి 24 క్యారెట్ల‌ ప్లాట్ ట్రాక్‌ లు కాదురా నాయ‌నా.. ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకుని ఆడండి

ఇక‌నైనా బుడ్డోడిని ఆడించు, లేక‌పోతే గుడ్డలు ఊడతీసి కొడతారంటూ గంభీర్ కు వార్నింగ్

ఐపీఎల్ పిచ్ ల‌కు అల‌వాటైపోయారు..బౌన్స‌ర్లు వ‌స్తే వ‌ణికిపోతున్నారు

ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్‌..ఓడించింది మ‌న ఇండియా వాడే, ఎవ‌రీ జై మూండ్రా ?

ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్‌..పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుకు నో ఛాన్స్‌

Ms Dhoni: ఓయ్‌ బిహారీ అంటూ యువ‌రాజ్ న‌న్ను అవ‌మానించాడు!

Big Stories

×