E-Paper
Advertisement

రెండు జడలతో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? టాలీవుడ్ ట్రెండింగ్ డైరెక్టర్?

రెండు జడలతో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తుపట్టారా? టాలీవుడ్ ట్రెండింగ్ డైరెక్టర్?
Advertisement

Sreekanth Odela: సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రెటీలు తమ చిన్ననాటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. అయితే తాజాగా ఒక డైరెక్టర్ రెండు జడలు వేసుకుని ఉన్నటువంటి చిన్ననాటి ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ ఫోటోలో ఉన్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ప్రస్తుతం ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్ . అవునండి మీరు ఊహించింది కరెక్టే ఈ ఫోటోలో ఉంది డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela).

రెండు జడలతో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల..

దసరా సినిమా ద్వారా ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన శ్రీకాంత్ తన మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం నానితో కలిసి ఈయన ది ప్యారడైజ్(The Paradise) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ సోషల్ మీడియా వేదికగా తన చిన్ననాటి ఫోటోని షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలో ఈయన రెండు జడలు వేసుకుని ఉండటం విశేషం. ప్రస్తుతం ఈయన దర్శకత్వంలో రాబోతున్న ది ప్యారడైజ్ సినిమాలో హీరో కూడా రెండు జడలు వేసుకోవడంతో ఈయన ఈ ఫోటోని షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు.

జడల్ పుట్టుక, పోరాటం కల్పితం కావచ్చు.. కానీ..

Advertisement

ఇలా రెండు జడలు వేసుకుని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేసిన శ్రీకాంత్ ఓదెలా..” జడల్ పుట్టుక, పోరాటం కల్పితం కావచ్చు.. కానీ అతని జడలు, రూపం నా చిన్ననాటి నుండి ప్రేరణ పొందాయి.నేను పెరిగేకొద్దీ, ఈ సినిమాలో చాలా సన్నివేశాలు నా చిన్ననాటి జ్ఞాపకాలతో ప్రభావితమయ్యాయి. నాకు ఐదు, ఆరు సంవత్సరాల వయస్సు వచ్చే వరకు అమ్మ జడలు వేసి కట్టేది… నేను పెద్దయ్యాక, కమర్షియల్ సినిమాలో 70MM తెరపై జడలతో ఒక హీరో ఎలా కనిపిస్తాడో అని ఎప్పుడూ ఊహించుకునేవాడిని… ఇక ఇప్పుడు, జడల్‌తో ఉన్న నా హీరో నాని అన్నను మీకు పరిచయం చేస్తున్నాను.ఈ చిత్రం కేవలం నా చిన్ననాటిది కాదు…కొన్ని గంటల్లో మీ అందరికీ ది ప్యారడైజ్ లోకి స్వాగతం “అంటూ ఈ ఫోటోని షేర్ చేశారు.

Advertisement

ఇలా ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని సైతం రెండు జడలతో జడల్ జమాన్ అనే పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. దర్శకుడిగా శ్రీకాంత్ తన రెండో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు మరి ఈ సినిమా శ్రీకాంత్ అలాగే నానికి ఎలాంటి సక్సెస్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరికొన్ని గంటలలో ప్రీమియర్లు ప్రసారం కాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: ది ప్యారడైజ్ నాని నుంచి సంపూ వరకు ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?

Related News

మా కుటుంబాన్ని మార్చేసిన రోజు..చిరు 48 ఇండస్ట్రీ జర్నీ పై చరణ్ ఎమోషనల్ పోస్ట్!

ఆ రోజు చిన్న రోల్.. ఈ రోజు వంద కోట్ల సినిమా.. సుహాస్ జర్నీ ఇదే!

డ్యాన్సర్స్ అసోసియేషన్‌లో సుమలతకు షాక్..రఘు మాస్టర్‌కు 214 మంది మద్దతు!

ది ప్యారడైజ్ నాని నుంచి సంపూ వరకు ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?

కయాదు లోహర్ పేరుకి పురాణాలతో ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ప్యారడైజ్ కోసం మైత్రి క్రేజీ ప్లాన్.. ఇంటర్వెల్ స్నాక్స్ గా తెలంగాణ స్పెషల్ ఫుడ్!

అలా అయితే ప్రీమియర్ షోలకు దూరంగా ఉంటా.. సీఎం స్పందన పై నాని రిప్లై!

Big Stories

Advertisement
×