E-Paper
Advertisement

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్

దిండుపై పడుకుని బుమ్రా రిలాక్స్…మీకు పని పాట లేదంటూ పరువు తీసిన సంజనా గణేశన్
Advertisement

Jasprit Bumrah custom Japanese pillow:  జపాన్ పర్యటనకు వెళ్లిన టీమిండియా రేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా, ఓ దిండుతో మెరిశాడు. తన మెడకు సౌకర్యవంతంగా ఉండే ఓ దిండును దగ్గరుండి తయారు చేయించుకున్నాడు. ఆ తర్వాత దిండు (Jasprit Bumrah custom Japanese pillow)పై పడుకుని సేద తీరాడు. ఇప్పుడు తనకు ఎంతో రిలాక్స్ ఉందంటూ పేర్కొన్నాడు బుమ్రా. అయితే, ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను టీమిండియా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ క్యాప్చర్ చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఈ వీడియోను చూసిన బుమ్రా భార్య సంజనా గణేశన్ క్లాస్ పీకింది.  మీకు పని పాట లేదంటూ పరువు తీసింది. జపాన్ దాకా వెళ్లింది, దిండ్లపై హాయిగా పడుకోవడానికా ? లేక మ్యాచ్ ఆడటానికా ? అంటూ సెటైరికల్ కామెంట్ చేశారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది. ఇది చూసిన నెటిజెన్స్ రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. జపాన్ తో మ్యాచ్ తనను ఆడించలేదని, ఇలా జాలీగా బుమ్రా ఎంజాయ్ చేస్తున్నాడని కొందరు పేర్కొంటున్నారు. అయితే, దిండ్లకు సంబంధించిన యాడ్ షూట్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

బుమ్రా వాడిన దిండుతో ఎన్నో ఉపయోగాలు

టీమిండియా రేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తాజాగా వాడిన దిండుతో ఎన్నో ఉపయోగాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. నిత్యం బౌలింగ్ చేస్తూ బుమ్రా చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే రాత్రి రిలాక్స్ గా మెడ నొప్పులు రాకుండా ఉండటానికి ఈ దిండు ఉపయోగ పడుతుందని చెబుతున్నారు. ఈ దిండ్లు ప్రత్యేకంగా చేయించుకోవచ్చు. మన మెడ సైజు, తల, భుజాల వెడల్పు ఆధారంగా ఈ దిండ్లు తయారు చేస్తారని తెలుస్తోంది. క్రికెటర్లే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ దిండ్లు వాడుకోవచ్చని స్పష్టం చేస్తున్నారు. ప్రశాంతమైన నిద్రతో పాటు, మెడ నొప్పులు కూడా పోతాయని అంటున్నారు.

Advertisement

Ajit Agarkar opposed Jasprit Bumrah as India captain in 2023: అజిత్ అగర్కార్ పెద్ద దుర్మార్గుడు..బుమ్రాను కూడా కెప్టెన్ కాకుండా అడ్డుకున్నాడు ! Tanveer Ahmed On Ind vs JPN

జపాన్ టూర్ సక్సెస్ చేసుకున్న టీమిండియా

టీమిండియా వర్సెస్ జపాన్ జట్ల మధ్య జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ వివాదాల నడుమ విజయవంతంగా ముగిసింది. వర్షం కారణంగా 5 ఓవర్లకు మ్యాచ్ కుదించగా, మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 4 వికెట్ల నష్టానికి 32 పరుగులే సాధించింది. ఇందులో అభిషేక్ శర్మ డకౌట్ కాగా, మిగతావారు ఏదో అలా రాణించారు. ఒక్క సిక్సర్ కూడా మనోళ్లు కొట్టకపోవడం కొసమెరుపు. ఇక టీమిండియా విధించిన టార్గెట్ ఛేదించే క్రమంలో జపాన్ తేలిపోయింది. 3 వికెట్ల నష్టానికి 30 పరుగులే చేసింది. దీంతో 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇదే మ్యాచ్ లో అక్షర్ పటేల్ వైడ్ వివాదం రాజుకోగా, దానిపై పాకిస్తాన్ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తోంది.

Advertisement

Japan Kusuda-Nairn targets Vaibhav Sooryavanshi : రాసి పెట్టుకోండి..వైభవ్ ను డకౌట్ చేస్తాం..జపాన్ బౌలర్ హెచ్చరికలు 

 

 

 

Related News

న్యూజిలాండ్ సిరీస్‌లో వైభవ్‌ను ఒత్తిడిలోకి నెట్టి..బౌన్సర్లతో టార్చర్ చేస్తాం

జపాన్ పిచ్చే సరిగ్గా లేదు…లేకపోతే మనోళ్లు 5 ఓవర్లలో 150 బాదేవాళ్లు

ఐపాడ్‌లో పాటలు వింటూ 300 బాదేసిన వీరేంద్ర సెహ్వాగ్

పాకిస్తాన్ వెళ్లిన రాజీవ్ శుక్లా…ఇంజామామ్ తో బిర్యానీ పార్టీ కూడా!

గ్యారీ కిర్‌స్టెన్ పీకింది లేమీ లేదు…2011 వ‌ర‌ల్డ్ క‌ప్ అత‌ని వ‌ల్ల రాలేదు

టీమిండియా మ‌హిళ‌ల గోల్డ్ మెడ‌ల్స్ దొంగిలించిన మొహ్సిన్ న‌ఖ్వీ ?

అంపైర్ మెడపై కత్తి పెట్టి బెదిరించి, టీమిండియా గెలిచింది

Big Stories

Advertisement
×