E-Paper
Advertisement

ది ప్యారడైజ్ నాని నుంచి సంపూ వరకు ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?

ది ప్యారడైజ్ నాని నుంచి సంపూ వరకు ఎవరి రెమ్యూనరేషన్ ఎంతంటే?
Advertisement

The Paradise: నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ది ప్యారడైజ్(The Paradise). ఈ సినిమా మరికొన్ని గంటలలో ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే థియేటర్ల వద్ద నాని అభిమానుల హంగామా మొదలైంది. మరికొన్ని గంటలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై కూడా అభిమానులలో అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. తల్లి కొడుకుల సెంటిమెంటు నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఎస్ఎల్వి సినీ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

నాని కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్..

నాని సినీ కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కోసం నటీనటుల రెమ్యూనరేషన్ వివరాలకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాలో ఎవరు ఎంత మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయానికి వస్తే… నాని ఈ సినిమాలో జడల్ జమాన్ అనే పాత్రలో నటించారు. ఈ పాత్రలో నటించినందుకుగాను ఈయన ఏకంగా 35 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఇక విలన్ సికంజా మాలిక్ పాత్రలో నటించడం కోసం మోహన్ బాబు ఏకంగా ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది.

ఒక్కపాటకి కోటి రెమ్యూనరేషనా…

Advertisement

ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకు గాను ఈమె 1.5 కోట్లు, ఏశనాగుల కట్ట అంటూ సాగిపోయే స్పెషల్ సాంగ్లో మాత్రం కీర్తి సురేష్ నటించారు. ఇక కీర్తి సురేష్ ఈ ఒక్క పాటకి ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరో విలన్ విక్రమ్ మాలిక్ సింగ్ పాత్రలో బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయెల్ సందడి చేశారు. ఈ పాత్రకు ఈయన ఏకంగా 2.5 కోట్లు, బిర్యానీ పాత్రలో నటించిన సంపూర్ణేష్ బాబు 38 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఇక ఈ సినిమా కోసం అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఈయన ఏకంగా 15 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇలా నటీనటుల రెమ్యూనరేషన్ కోసమే సుమారు 60 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది.

రూ.200 కోట్ల టార్గెట్ రీచ్ అయ్యేనా?

ఇక నాని సినీ కెరియర్ లోనే ఈ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతుంది. ఇప్పటివరకు ఇలాంటి మాస్ పాత్రలలో నాని నటించలేదు మొదటిసారి ఇలా విభిన్నమైన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరిగింది. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే రూ. 200 కోట్లు రావలసి ఉంది. తెలుగు రాష్ట్రాలలోనే 150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. మరి నాని ఈ టార్గెట్ చేరుకోగలరా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ప్యారడైజ్ కోసం మైత్రి క్రేజీ ప్లాన్.. ఇంటర్వెల్ స్నాక్స్ గా తెలంగాణ స్పెషల్ ఫుడ్!

Related News

కయాదు లోహర్ పేరుకి పురాణాలతో ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

ప్యారడైజ్ కోసం మైత్రి క్రేజీ ప్లాన్.. ఇంటర్వెల్ స్నాక్స్ గా తెలంగాణ స్పెషల్ ఫుడ్!

అలా అయితే ప్రీమియర్ షోలకు దూరంగా ఉంటా.. సీఎం స్పందన పై నాని రిప్లై!

మోద రాత్రి మూవీలో ఆ ఫోటోలో ఉన్నది ఎవరో తెలుసా? అసలు విషయం చెప్పిన డైరెక్టర్!

తల్లి కావాలంటే పెళ్లే అవసరమా? వివాహ వ్యవస్థపై శృతిహాసన్ కామెంట్స్!

కొంచెం విషమిచ్చి చంపేయండి- పవిత్ర గౌడ!

థియేటర్లో సినిమా చూడాలన్న నాని.. సీఎం రేవంత్ రెడ్డి ఏమన్నారంటే?

Big Stories

Advertisement
×