Dancers Association:తెలుగు సినీ పరిశ్రమలో డ్యాన్సర్స్ అసోసియేషన్ మధ్య మొదలైన వివాదం అంత ఈజీగా ఎండ్ కార్డ్ వేసుకునేలా కనిపించట్లేదు. ఇప్పటికే జానీ మాస్టర్ , శేఖర్ మాస్టర్ ల మధ్య ఉప్పు నిప్పుగా ఉన్న వ్యవహారం ఇపుడు మరిన్ని మలుపులు తీసుకుంటుంది. తాజాగా ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశం తర్వాత డ్యాన్సర్స్ అసోసియేషన్ లో డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత కి పెద్ద షాకే తగిలినట్టు తెలుస్తుంది.
సమావేశంలో పాల్గొన్న 225 మంది సభ్యులు
విషయంలోకి వస్తే ..ఫెడరేషన్ ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి డ్యాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతతో పాటు రఘు మాస్టర్, పలువురు సభ్యులను పిలిచినట్లు తెలుస్తోంది. ఇక మీటింగ్ కి పెద్ద సంఖ్యలో డ్యాన్సర్లు వచ్చారు కూడా.అలా మొత్తం ఇందులో 225 మంది సభ్యులు సమావేశంలో పాల్గొన్నారని సమాచారం. అయితే ఈ సమావేశంలో సభ్యులు ఇచ్చిన మద్దతే ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
సుమలతకు 11 రఘు మాస్టర్‌కు 214
అవును ..ఈ సమావేశంలో సుమలతకు కేవలం 11 మంది డ్యాన్సర్లు తమ సపోర్ట్ అందించగా, రఘు మాస్టర్‌కు ఏకంగా 214 మంది డ్యాన్సర్లు జై కొట్టడం గమనార్హం. అంటే ఈ లెక్కన చూస్తే సుమలత పై డ్యాన్సర్స్ అసోసియేషన్ ఎంత వ్యతిరేఖత ఉందొ అర్థమవుతుంది.ఇక సుమలత కి డ్యాన్సర్స్ అసోసియేషన్ లో సరైన సపోర్ట్ లేకపోవడంతో మరోసారి ప్రెసిడెంట్ పదవికి అలాగే ఎన్నికలు జరగాల్సిన ఇతర పదవులకు కూడా ఎన్నికలు నిర్వహించాలని డిసైడ్ అయిందట ఫెడరేషన్.
ఎన్నికలు వచ్చే అక్టోబర్ 11న
ఇక డ్యాన్సర్స్ అసోసియేషన్‌కు కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు జరిగే ఈ ఎన్నికలు వచ్చే అక్టోబర్ 11న జరగనున్నాయని తెలుస్తుంది.వాస్తవానికి ఆగస్టు 30న జరిగిన ఒక సమావేశంలో తాత్కాలిక అధ్యక్షుడిగా రఘు మాస్టర్ ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు ఒక వర్గం ఇప్పటికే ప్రకటించింది.ఇక అప్పట్లో శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్, భాను మాస్టర్ లంతా రఘు మాస్టర్‌కు మద్దతు తెలిపినట్లు టాక్ వినిపించింది కూడా.
వివాదానికి ఎండ్ కార్డ్ పడుతుందా
దీంతో డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న సుమలత రఘు మాస్టర్ ఎన్నిక చెల్లదని స్పష్టం చేశారు. ఫెడరేషన్ తమ కమిటీకి సహకరించడం లేదన్న విషయంపై కూడా ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేసింది కూడా. దీంతో ఇది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదంగా కాకుండా, యూనియన్‌ను ఎవరు నడపాలి? సభ్యుల సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకోవాలి? అనే పెద్ద ప్రశ్నగా మారింది.
also read :సరిగమపలో అదరగొడుతున్న దైవిక్.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే!
మరి అక్టోబర్ 11న జరిగే ఎలక్షన్స్ తోనైనా ఇప్పటివరకు కొనసాగుతున్న వివాదానికి ఎండ్ కార్డ్ పడుతుందా లేక ఈ వివాదం మరిన్ని మలుపులు తీసుకుంటుందా చూడాలి.