Singeetham Srinivasa Rao: సింగీతం శ్రీనివాసరావు పేరు చెప్పగానే.. విరిసినది వసంతగానం పాట గుర్తుకు వస్తుంది. పరిశ్రమలో సినిమా ప్రయోగాలకు ఆయన్ని పితామహుడిగా చెబుతారు. స్వాతంత్యానికి ముందే పుట్టినా, మారుతున్న జనరేషన్‌కు అనుగుణంగా సినిమాలు చిత్రీకరణ చేయడంలో ఆయనకు ఆయనే సాటి. కాలానికి ముందే ఆలోచించి సగటు ప్రేక్షుకుడు ఆలోచించని విధంగా సినిమాలు తీసే లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. గతరాత్రి ఆయన చెన్నైలో కన్నుమూశారు.
లెజండరీ ఫిల్మ్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు గురించి చెప్పనక్కర్లేదు. ఆయన తెరకెక్కించిన సిన్మాలు, చేసే ప్రతీ సన్నివేశం, మాటలు, నటన ఇలా ప్రతీది ఓ ట్రెండ్ సెటర్. ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ సినీ ప్రేక్షకుల్ని థియేటర్లలో కూర్చో బెట్టిన దర్శక ధీశాలి. ఒక్కమాటలో చెప్పాలంటే పరిశ్రమ పెద్దలు.. ఆయన్ని దర్శక మాంత్రికుడిగా పిలుచుకుంటారు. వయసు అనేది కేవలం శరీరానికి మాత్రమేనని, మనసుకు కాదని సందర్భాన్ని బట్టి ఆయన చెప్పేవారు.
చివరి శ్వాస వరకు వెండితెరపై సరికొత్త ప్రయోగాలు చేస్తూ అద్భుతాలు సృష్టించారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 60కి పైగా చిత్రాలకు ఆయన డైరెక్షన్ చేశారు. టెక్నాలజీ గురించి తెలియని రోజుల్లో ‘ఆదిత్య 369’ మూవీ చూసిన నాసా శాస్త్రవేత్తలు ఆనాడో ఆయన్ని మెచ్చుకున్నారు. ముఖ్యంగా టైమ్ ట్రావెల్-లైటుకి ఉండే రిలేషన్‌ని చాలా ఫర్పెక్ట్‌గా చిత్రీకరించారని, అది నిజమేనని అంగీకరించారంటే ఆయన ఎలాంటివారో అర్థం చేసుకోవచ్చు.
దేశానికి స్వాతంత్ర్యం వచ్చేనాటికి 16 ఏళ్ల వయస్సు గల యువకుడు సింగీతం శ్రీనివాసరావు. ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో 1931 సెప్టెంబరు 21న పుట్టిన ఆయన, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదివేటప్పుడే నాటక రంగంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో బీఎస్సీ ఫిజిక్స్ చేశారు. నాటక ఇష్టంతో ఆ రంగంలోకి ప్రవేశించారు. ఆ రోజుల్లోనే హాలీవుడ్ సినిమాలు చూసేవారు.
దిగ్గజ దర్శకుడు కెవి రెడ్డి వద్ద మాయాబజార్-1957 లాంటి చిత్రానికి సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు సింగీతం. మ్యూజిక్ డైరెక్టర్ సాలూరి రాజేశ్వరరావు వద్ద శిష్యరికం చేసిన ఆయన, మ్యూజికల్ చిత్రాలు తీసేలా చేసింది. కూతుళ్లు, మనవళ్లతో కలిసి చెన్నైలో ఉంటున్న ఆయన అంత్యక్రియలు అక్కడే నిర్వహించనున్నట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. లెజండరీ డైరెక్టర్ సింగీతం మృతిపై సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
ఆదిత్య 369, పుష్పక విమానం, మయూరి… ఎన్నో మరపురాని చిత్రాలు. ❤️
There was no one like you before, and there will be no one like you after.
Rest in peace, Singeetam garu. 🕊️🙏#SingeethamSrinivasaRao pic.twitter.com/nzZdEbMbkK
— 𝑲𝒂𝒍𝒚𝒂𝒏𝒊 𝑪𝒉𝒐𝒘𝒅𝒂𝒓𝒚 🐘💫 (@Kalyani_Tweetzz) October 3, 2026
96 ఏళ్ల సినీ శకం
నీతి నిజాయితీతో మొదలై
శ్రీ కృష్ణార్జున విజయం
మయూరి
ఆదిత్య 369
పుష్పక విమానం
భైరవద్వీపం
అమావాస్య చంద్రుడు
మైకేల్ మదన కామరాజు
పంతులమ్మ
ఆడవాళ్ళకు మాత్రమే
బృందావనం
సింగీతం తో ముగిసింది..#SingeethamSrinivasaRao pic.twitter.com/06VnjoHRkJ— TheMusicDiary🎶 (@TheMelodicStory) October 3, 2026
"There was no one like you before & there will be no one like you after"
Rest in Peace Sir 🕊️💔 #SingeethamSrinivasaRao #RIPSingeethamSrinivasaRao pic.twitter.com/3oMDjKkvMH— Jadal Targaryen (@ParodyPeaks) October 3, 2026
Rest Well Sir
Cinema will always remember you!!#SingeethamSrinivasarao #KFI #TFI pic.twitter.com/Gn3wx2RcWa
— NANU 🦅 (@_NANU_01_) October 3, 2026