Kona Venkat: కోన వెంకట్ పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రచయితగా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కోన వెంకట్ తాజాగా కామ్రేడ్ కళ్యాణ్ (Comread Kalyan)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అక్టోబర్ 9వ తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో కోన వెంకట్ ఈ సినిమా ఈవెంట్లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఇందులో భాగంగానే కోన వెంకట్ టాలీవుడ్ దర్శకుల తీరు గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇటీవల కాలంలో దర్శకులు ఎలాంటి ప్లానింగ్ లేకుండా సినిమాలు చేస్తూ నిర్మాతల డబ్బులు వృథా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వారిపై ఈయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్శకులు సుమారు మూడు గంటల నిడివితో సినిమా చేసి ఎడిటింగ్లో సుమారు గంట 50 నిమిషాల ఫుటేజ్ ని చెత్తబుట్టలో పడేస్తున్నారని తెలిపారు. చెత్తబుట్టలో పడేసిన ఫుటేజీ అంత ఖర్చు పెట్టి ఎందుకు షూట్ చేయాలని ఈయన ప్రశ్నించారు. ఆ గంటన్నర ఫుటేజ్ తీయడం కోసం నిర్మాత కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ఈయన గుర్తు చేశారు.
ఈ విధంగా నిర్మాతలు ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి పెట్టుబడిగా పెట్టి సినిమాని చేస్తారు. ఆ డబ్బుతో దర్శకులు బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రవర్తిస్తారని ఈయన మండిపడ్డారు. సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకుల చేతిలో ఉంటుంది కానీ సినిమాని పక్క ప్రణాళికలతో ప్రేక్షకులు ముందుకు తీసుకురావడం మాత్రం దర్శకుడు బాధ్యత అని ఈయన తెలిపారు. ఒక సినిమా రన్ టైప్ ఎంత ఉంటుంది అనే విషయంపై స్పష్టత లేని దర్శకులు నిర్మాతలను రోడ్లపైకి తీసుకువస్తున్నారని ఇలాంటి వాళ్లు క్రిమినల్స్ తో సమానమని ఇలాంటి వారిని చిత్ర పరిశ్రమ బ్యాన్ చేయాలి అంటూ ఈ సందర్భంగా కోన వెంకట చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి.
ఒకప్పుడు ఒక సీన్ కోసం పది రూపాయలు ఖర్చు చేస్తే ₹20 రావడం కోసం నిర్మాతలు కష్టపడేవారు కానీ ఇప్పుడు 20 రూపాయల సీన్ కోసం డైరెక్టర్లు 200 రూపాయలు ఖర్చు చేస్తున్నారని దర్శకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఈయన టాలీవుడ్ దర్శకుల గురించి చేసినటువంటి ఈ కామెంట్లు వైరల్ గా మారడంతో కోన వెంకట్ ఎవరిని ఉద్దేశించి చేశారు అంటూ చర్చలు జరుగుతున్నాయి. మరి కోన వెంకట్ వ్యాఖ్యలపై టాలీవుడ్ డైరెక్టర్స్ ఎవరైనా స్పందిస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. కామ్రేడ్ కళ్యాణ్ సినిమాలో శ్రీ విష్ణు హీరోగా నటించిన సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.