Vijay Devarakonda -Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) జంటగా నటించిన రణబాలి(Ranabaali) సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ దసరా పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదలకు మరొక ఆరు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ రష్మిక వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.
రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఇదివరకు గీతగోవిందం, డియర్ కామ్రేడ్ వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమా అనంతరం వీరిద్దరూ ఇన్నేళ్ల తర్వాత రణబాలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే రణబాలి సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్(Rahul Sankrityn) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సుమారు 150 సంవత్సరాల క్రితం రాయలసీమ ప్రాంతంలో ఏర్పడిన కరువు, బ్రిటిష్ పాలకుల అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడిన ఒక యోధుడి కథ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో నటించగా రష్మిక మందన్న జయమ్మ పాత్రలో నటించారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ రష్మిక మందన్న తీసుకున్న రెమ్యూనరేషన్ (Remuneration)కి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కోసం ముందుగా 80 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకోగా అది కాస్త 120 కోట్లకు చేరిందని తెలుస్తోంది. ఇలా 120 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా నుంచి రష్మిక విజయ్ దేవరకొండకు సుమారు 30 కోట్ల వరకు రెమ్యూనరేషన్ వెళ్ళిందని తెలుస్తోంది.
ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ 23 నుంచి 25 తీసుకున్నారని రష్మిక కూడా రూ. 8 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా కోసం సుమారు 30 కోట్ల వరకు వీరిద్దరూ రెమ్యూనరేషన్ తీసుకున్నారు. ఈ సినిమా బ్రిటిష్ పాలన వ్యతిరేకత నేపథ్యంలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దసరా పండుగను పురస్కరించుకొని అక్టోబర్ 16వ తేదీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పెళ్లి తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన్న నటించిన మొట్టమొదటి సినిమా కావడంతో ఈ సినిమా పై భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ వీడియో సినిమా పట్ల భారీ అంచనాలను పెంచింది. మరి దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రణబాలి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
Also Read: ‘బ్లడీ రోమియో’గా నాని..లుక్ టెస్ట్ పూర్తి.. అదిరిపోయిన లుక్