E-Paper
Advertisement

HBD Prasad babu: ప్రసాద్ బాబు కోడలు ఒక స్టార్ హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడేం చేస్తోందో తెలుసా?

HBD Prasad babu: ప్రసాద్ బాబు కోడలు ఒక స్టార్ హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
Advertisement

HBD Prasad babu:టాలీవుడ్ సీనియర్ నటుడు ప్రసాద్ బాబు పుట్టినరోజు సందర్భంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సుమారు 1500 చిత్రాలలో నటించిన ఆయన, తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని, అందరూ స్వయంకృషితో ఎదిగారని తెలిపారు. ముఖ్యంగా తన కొడుకు శ్రీకర్ మరియు కోడలి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అద్భుతమైన నటిగా పేరు తెచ్చుకున్న తన కోడలు, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఏ రంగంలో రాణిస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు చూద్దాం..

కొడుకు, కోడలు ఇద్దరూ నటులే!:

ప్రసాద్ బాబు కుమారుడు శ్రీకర్ కన్నడ, తమిళ చిత్రాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. గ్లిజరిన్ వాడకుండానే ఎమోషనల్ సీన్స్‌లో అద్భుతంగా నటించే శ్రీకర్ జాతకం సాక్షాత్తూ ఎన్టీఆర్ గారి జాతకంతో పోలి ఉంటుందని ప్రసాద్ బాబు గర్వంగా చెబుతారు. ఇక తన కోడలు కూడా తక్కువ కాదని, ఆమె ఒక అద్భుతమైన నటి అని ఆయన ప్రశంసించారు. ఇక ముఖ్యంగా సెంటిమెంట్ పాత్రలను పండించడంలో ఆమెకు సాటిలేరని ,నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బంగారం, ఢి వంటి తదితర తెలుగు చిత్రాలలో నటించింది, పెళ్ళయ్యాక కుటుంబ బాధ్యతల వల్ల ఆమె నటనకు కాస్త విరామం ఇచ్చారని వివరించారు.

నటి నుండి బిజినెస్ ఉమెన్ దాకా:

Advertisement

ఒకప్పుడు స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న తన కోడలు, ఇప్పుడు వెండితెరకు దూరమైనప్పటికీ ఇండస్ట్రీతో తనకున్న అనుబంధాన్ని మాత్రం తెంచుకోలేదు. ప్రస్తుతం ఆమె ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా రాణిస్తోంది. కాస్ట్యూమ్ మరియు మేకప్ ఆర్టిస్టుగా పనిచేస్తూనే, సొంతంగా ఎన్నో సంస్థలను నడుపుతున్నట్లు ప్రసాద్ బాబు వెల్లడించారు. ఇక ఎవరిపైనా ఆధారపడకుండా తన సొంత వ్యాపారంలో ఆమె దూసుకుపోతుండటం చూస్తుంటే ముచ్చటేస్తుందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

మంగళగిరిలో ‘ఒంటరి’ ఇల్లు.. భార్య జ్ఞాపకాలు:

ప్రసాద్ బాబు తన 65వ ఏట మంగళగిరిలో కొండల మధ్య ఒక అందమైన ఇల్లు కట్టుకున్నారు. ఎవరి సహాయం తీసుకోకుండా, కూలీలతో పాటు ఎండలో నిలబడి ఆ ఇంటిని నిర్మించారట. ఇప్పుడు ఆ ప్రాంతం రాజధానిగా మారడం తన అదృష్టమని ఆయన భావిస్తారు. అలాగే తన భార్య గురించి చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. ఇక షూటింగ్ సెట్స్‌కు తన భార్య స్వయంగా వండిన ఆహారాన్ని పంపేవారని, సత్యనారాయణ, మురళీ మోహన్ వంటి వారు ఆమె చేతి వంటను ఎంతో ఇష్టంగా తినేవారని పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

Advertisement

also read:Peddi Movie: పహిల్వాన్ గా రామ్ చరణ్.. ఆయన ఇన్స్పిరేషన్ తోనే?

అడుక్కోవడం ఇష్టం లేకనే దూరం:

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’ సినిమా తర్వాత ప్రసాద్ బాబు మరే సినిమాలో నటించలేదు. ఇక అవకాశాలు అడుక్కోవడం ఇష్టం లేకనే తాను సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒకే రోజు ఆరు, ఏడు సినిమాల షూటింగ్‌లలో పాల్గొన్న బిజీ లైఫ్ నుండి ఇప్పుడు ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. ఇక తన పిల్లలు, కోడలు ఎవరి కాళ్ల మీద వారు నిలబడి సమాజంలో గౌరవంగా బతకడమే తనకు అత్యంత సంతృప్తినిచ్చే విషయమని ఈ సీనియర్ నటుడు మనసు విప్పి చెప్పారు.

?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

Related News

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

Big Stories

Advertisement
×