BigTV English

YSRCP : రప్పా రప్పా.. చీకట్లో చేసేయండి.. వైసీపీ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

YSRCP : రప్పా రప్పా.. చీకట్లో చేసేయండి.. వైసీపీ ఏం మెసేజ్ ఇస్తున్నట్టు?

YSRCP : రప్పా..రప్పా.. వేసేస్తాం.. అంతు చూస్తాం.. తొక్కేస్తాం.. లేపేస్తాం.. ఇలా వైసీపీ శ్రేణులు ఓపెన్‌గానే రెచ్చిపోతున్నారు. ఫ్లెక్సీలు, ప్లక్లార్డులు, నినాదాలతో.. జగన్ 2.0 అంటూ కూటమి నేతలను బెదిరిస్తున్నారు. ఓటమి తర్వాత చిప్ చితికిందో.. లేదంటే, మళ్లీ గెలవలేమనే భయంతో బరితెగించారో కానీ.. ఫ్యాన్ పార్టీ నేతలు కయ్యానికి కాలుదువ్వుతున్నారు. అధికార పార్టీ సహనానికి సవాళ్లు విసురుతున్నారు. ఏదో కొందరు కార్యకర్తలు ఇలా చేస్తున్నారేమో అని అనుకోవటానికి లేదు. స్వయంగా అధినేత జగన్ వారికి సపోర్ట్‌గా మాట్లాడటం.. సినిమా డైలాగులు చెబితే తప్పేంటంటూ మాట్లాడటంతో మిగతా పార్టీ నేతలూ అదే డేంజర్ గేమ్ ఆడుతున్నారు. లేటెస్ట్‌గా మాజీ మంత్రి పేర్ని నాని కాంట్రవర్సీ కామెంట్లతో కేడర్‌ను రెచ్చగొట్టారు.


రప్పా రప్పా.. కేడర్‌కు ఫ్రీ హ్యాండ్

జగన్ 2.0 ప్రభుత్వం రాగానే కార్యకర్తలు, నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని.. అప్పటి వరకు ఇలా రప్పా రప్పా అంటూ కామెంట్ చేయడం మానేయాలన్నారు కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు పేర్ని నాని. ఈ మాటలు విని.. అబ్బా నాని గారు ఎంత చక్కటి మెసేజ్ ఇచ్చారో అని అనుకోడానికి లేదు. ఆయన రప్పా రప్పా అనొద్దని చెప్పడం వెనుక మరింత దారుణమైన కుట్ర దాగుంది. ఆ డైలాగ్ తర్వాత అసలైన మెసేజ్ ఇచ్చారు.


చీకట్లో కన్ను కొడితే..

పేర్ని నాని ఏమన్నారంటే.. “చీకట్లో కన్ను కొడితే జరిగిపోవాల్సిన పనులు పట్టపగలు మాట్లాడుకుంటామా”. ఇదీ పేర్ని చేసిన స్టేట్‌మెంట్. అంటే? బయటకు అనకండి.. చాటుగా చేయాల్సింది చేసేయండి అనేగా ఆయన చెప్పేది అంటున్నారు. రప్పా రప్పా అనకంటూనే.. రప్పా రప్పా నరికేయండి అనేలా.. హత్యా రాజకీయాలను ప్రోత్సాహించేలా.. పేర్ని నాని మాట్లాడారంటూ తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. అసలే ఓడిపోయామనే పగతో రగిలిపోతోంది వైసీపీ కేడర్. నాని లాంటి నేతలు ఇలాంటి మెసేజ్ ఇస్తే ఎంత ప్రమాదకరం? నిజంగానే చీకట్లో రప్పా రప్పా చేసి చూపిస్తారా? దాడులు, హత్యలతో ఏపీలో లా అండ్ ఆర్డర్‌ను ఛాలెంజ్ చేస్తారా? వైసీపీ వ్యూహం ఇదేనా? అంటూ నాని వ్యాఖ్యలతో ఏపీలో పాలిటికట్ హీట్ రాజుకుంది.

Also Read : జనసేనను చూసి వైసీపీ నేర్చుకోవాల్సింది ఇదేనా?

కార్యకర్తలను రెచ్చగొడుతున్నారా?

టీడీపీ రెడ్‌బుక్‌‌ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరిచే కుక్క కరవదని.. కరిచే కుక్క అరవదని సెటైర్లు వేశారు. టీడీపీ ఓ వైపు ఎర్రబుక్కు అంటుంటే.. మనోళ్లు రప్పా..రప్పా అంటున్నారని కామెంట్ చేశారు. జగన్‌ 2.O లో మిత్తితో సహా చెల్లిస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. నాని స్పీచ్ ఆసాంతం కార్యకర్తలను రెచ్చగొట్టేలా సాగిందని అంటున్నారు. అటు జగన్ సపోర్ట్.. ఇటు నాని ఎంకరేజ్‌తో రానున్న రోజుల్లో వైసీపీ శ్రేణులు తమ ఒర్జినల్ క్యారెక్టర్‌ను బయటకు తీస్తారా? రెచ్చిపోతే కూటమి సర్కారు చూస్తూ కూర్చుంటుందా? తాట తీస్తుందా?

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×