Film Industry:తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే సభ్య సమాజం ఎటు పోతోంది అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 25 సంవత్సరాలు అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు కొంతమంది కర్కషకులు. అందులో భాగంగానే తాజాగా ఫిలిం ఇండస్ట్రీలో.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై.. కట్టుకున్న భర్తే అత్యంత కిరాతకంగా హత్యాయత్నానికి పాల్పడిన వైనం ఇప్పుడు ఇండస్ట్రీని ఆశ్చర్యంలో ముంచేసింది.
ఆటో డ్రైవర్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్న స్టార్ నటి..
నటన రంగంలో ఆమె ఒక స్టార్.. అయితే ఆమెపై పెప్పర్ స్ప్రే కొట్టి, ఆమె బర్త్డే కత్తితో దాడి చేసి,చంపే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అటు సినీ పరిశ్రమ కూడా ఉలిక్కిపడింది. అసలు విషయంలోకి వెళ్తే.. కర్ణాటకలోని బెంగళూరుకి చెందిన మంజుల నటిగా రాణిస్తున్నారు. ఈమె అసలు పేరు మంజుల అయినప్పటికీ బుల్లితెరపై మాత్రం శృతి (Shruti) పేరుతో చలామణి అవుతోంది. బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ లోని శ్రీనగర మునేశ్వర బ్లాక్ లో గత కొన్ని సంవత్సరాలుగా భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. గత 20 ఏళ్ల క్రితం ఆటోడ్రైవర్ గా ఉన్న అమరేష్(Amaresh ) అనే వ్యక్తితో ప్రేమలో పడిన శృతి.. అతడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంటకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఆలస్యంగా రావడమే అనుమానానికి దారితీసిందా..
హాయిగా జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ దంపతుల మధ్య అనూహ్యంగా గొడవలు చోటు చేసుకున్నాయి. దీనికి కారణం ఆమె ఎంచుకున్న నటన రంగం అని తెలుస్తోంది. వరుస సీరియల్స్ షూటింగ్స్ తో బిజీగా ఉన్న శృతి రాత్రి వేళలో ఆలస్యంగా ఇంటికి వస్తూ ఉండేది. దీంతో ఆమెపై అనుమానం పెంచుకున్నాడు భర్త అమరేష్. అయితే ఇద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకున్నాయి. ఇక రోజు రోజుకి వివాదం ముదురుతున్న నేపథ్యంలో శృతి తన భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త అమరేష్ ను పిలిపించి కౌన్సెలింగ్ కూడా ఇప్పించారు. అయినా సరే ఇద్దరి మధ్య గొడవలు మరింతగా ముదిరిపోయాయి. దీంతో భర్తతో ఉండలేక కొంతకాలంగా సోదరుడి ఇంట్లోనే ఉంది. ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి .. మళ్లీ ఒకే చోటకి చేర్చారు.
పెప్పర్ స్ప్రే కొట్టి.. కత్తితో అత్యంత దారుణంగా ప్రవర్తించిన భర్త..
అయితే ఓకే ఇంట్లో ఉన్నప్పటికీ తన పాత అలవాట్లను మార్చుకోలేకపోయిన శృతి మళ్లీ తన పాత వైఖరిని మొదలుపెట్టింది. శృతిలో వచ్చిన పరిస్థితిని గమనించిన అమరేష్ ఆమెలో ఎలాంటి మార్పు లేదని తెలుసుకొని.. శృతిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడువుగా జూలై 4వ తేదీన ఇద్దరు పిల్లలు కాలేజీకి వెళ్లడంతో.. శృతిపై పెప్పర్ స్ప్రే ప్రయోగించాడు. అక్కడితో ఆగకుండా.. కత్తితో అతి కిరాతకంగా దాడి చేశాడు. మొదట మెడపై.. ఆ తర్వాత పక్కటెముకలు.. తొడలపై ఇలా ఇష్టానుసారంగా తన కసి మొత్తాన్ని ఆమెపై చూపించాడు. అక్కడితో ఆగకుండా ఆమె జుట్టు పట్టుకొని గోడకేసి మరీ అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు.
రహస్యంగా వారం రోజులుగా హాస్పిటల్ లో చికిత్స..
ఇక ప్రస్తుతం శృతి విక్టోరియా ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుంది. అయితే భార్య పై దాడి చేసిన విషయాన్ని ఎవరికీ తెలియకుండా.. వారం రోజులుగా రహస్యంగా మెయింటైన్ చేస్తూ వచ్చాడు అమరేష్. హాస్పిటల్ వర్గాల సహాయంతో విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి ప్రత్యేక బృందంతో అమరేష్ ను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం శృతి ఘటన ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
ALSO READ:Fish Venkat Health Update: ఫిష్ వెంకట్ హెల్త్ అప్డేట్.. మూడు రోజులుగా కళ్ళు తెరవలేదు!