E-Paper
Advertisement

Theater Movies : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..

Theater Movies : ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్..
Advertisement

Theater Movies : ప్రతివారం బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి.. గత వారంతో పోలిస్తే ఈ వారం కూడా చిన్న సినిమాలతో కలిపి చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ తో పాటుగా హాయిర్ కామెడీ ఛానల్ లో రాబోతున్న తెలుగు చిత్రం అగధ వంటి సినిమాలతో పాటుగా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతవారం థియేటర్లలో రిలీజ్ అయిన వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ వారం సూర్య మూవీ పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లలోకి ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో ఒక్కసారి తెలుసుకుందాం..

ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న సినిమాలు..

విశ్వనాథ్ అండ్ సన్స్..

కొలీవుడ్ సూర్య హీరోగా సితార ఎంటర్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్’ అందులో ఒకటి.. మమత బైజు హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన అన్ని అప్డేట్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇవాళ థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. యాక్షన్ జోనర్ లో నటించిన సూర్య ఈ మూవీతో కాస్త ప్రేక్షకులను డిఫరెంట్ స్టోరీలోకి తీసుకొని వెళ్తాడు. టైటిల్కు తగ్గట్టుగానే సినిమా ఉండడంతో జనాలు దీన్ని చూసేందుకు ఆసక్తి కనిపరుస్తున్నారు.. మరి ఇవాళ ఈ సినిమా ఎలాంటి టాక్ని అందుకుంటుందో చూడాలి..

మకుటం..

Advertisement

తమిళ స్టార్ హీరో విశాల్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘మకుటం’. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ నటించారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.. ఈ మూవీలో విశాల్ డిఫరెంట్ లుక్ లు కనిపించడంతో జనాలు ఈ సినిమాని చూసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ది ఎండ్ ఆఫ్ ఓక్ స్ట్రీట్..

ఇది ఒక డబ్బింగ్ చిత్రం.. డేవిడ్ రాబర్ట్ ఈ ఎడ్వంచర్ థ్రిల్లర్ కు దర్శకత్వం వహించారు. వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మించిన ‘ది ఎండ్ ఆఫ్ ఓక్’ లాగా ఈ మూవీ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది..

Advertisement

వీటితో పాటుగా తెలుగులో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నా హారర్ చిత్రం అగధ కూడా ఇవ్వాలే రిలీజ్ అవుతుంది.. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తున్న మరో సినిమా ‘పళ్ళ బురుసు’ సైతం శుక్రవారం వస్తోంది.. అదే విధంగా సురేశ్‌ బాబు పంపిణీ చేస్తున్న ‘హుషార్ పిట్టలు’ సినిమా ఆగస్ట్ 15 శనివారం జనం ముందుకొస్తోంది.. ఈవారం బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్న సినిమాలలో ఏ సినిమా విన్నర్ గా నిలుస్తుంది అన్నది ప్రస్తుతం జనాల్లో ఆసక్తిగా మారింది..

Also Read : ఫ్రైడే ఓటీటీ సందడి.. ఆ రెండు మస్ట్ వాచ్..!

Related News

గాయాలతో హీరోయిన్.. ఫ్యాన్స్ ఆందోళన.. ఏం జరిగిందంటే..?

ఒక్క సినిమా కెరీర్ మొత్తం మార్చేసింది.. ఇప్పుడు ఆమె రేంజ్ ఇదే!

రిలీజ్‌కు ముందే జైలర్ 2 రికార్డ్.. ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే ధర!

రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయడం వల్లే..తేజస్విని మదివాడ వైరల్ కామెంట్స్ !

ఈ వీకెండ్ సినిమాల జాతర.. బరిలో ఉన్నవి ఇవే!

బండ్ల గణేష్ ఇంట మొదలైన పెళ్లి సందడి.. ఘనంగా హల్దీ వేడుక!

నిర్మాత కారు యాక్సిడెంట్.. హాస్పిటల్ ఖర్చుల దగ్గరే అసలు గొడవ!వైరల్ వీడియో

Big Stories

Advertisement
×