E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode August 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను భయపెట్టిన పిల్లల బిహేవియర్

Nindu Noorella Saavasam Serial Today Episode August 14th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను భయపెట్టిన పిల్లల బిహేవియర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లోంచి హనుమాన్‌ విగ్రహం తీసేస్తే సగం దరిద్రం పోతుందని అప్పుడు బుజ్జమ్మను ఎలాగైన ప్రచండకు అప్పగించొచ్చని మనోహరి ఆలోచిస్తుంది. పిల్లలు లేని టైం చూసి విగ్రహాన్ని కొట్టేయాలి అనుకుంటుంది. కానీ ఆ టైంలో ఎవరైనా చూస్తే అనుమానం వస్తుందని పిల్లలు ఉన్నప్పుడే ఎలాగైనా రూంలో ఉన్న హనుమాన్‌ విగ్రహాన్ని కొట్టేయాలని ప్లాన్‌ చేస్తుంది మనోహరి. అనుకున్నట్టుగానే.. పిల్లలందరూ రూంలోంచి బయటకు వచ్చి ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌ గురించి డిస్కషన్‌ చేసుకుంటుంటే.. మనోహరి చాటుగా యాదమ్మను లోపలికి వెళ్లి హనుమాన్‌ విగ్రహం తీసుకురమ్మని చెప్తుంది. యాదమ్మ భయంగా తాను వెళ్లలేనని పిల్లలు చూస్తే.. అమర్‌ సార్‌కు చెప్తారని భయపడితే.. మనోహరి తిట్టి ధైర్యాన్ని నింపి యాదమ్మను రూంలోకి పంపిస్తుంది.

రూంలోకి వెళ్లిన యాదమ్మ హనుమాన్‌ విగ్రహాన్ని పట్టుకోబోతుంటే.. వెంటనే అక్కడ ఒక కోతి వచ్చి యాదమ్మను బెదిరిస్తుంది. ఆ కోతిని చూసిన యాదమ్మ భయంతో గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకు బయట డిస్కషన్‌ చేసుకుంటున్న పిల్లలు పరుగున లోపలికి వెళ్తారు. యాదమ్మను చూసి షాక్‌ అవుతారు. యాదమ్మను రూంలోకి ఎప్పడు వచ్చావు.. ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. బయటి నుంచి అంతా చూస్తున్న మనోహరి లోపల పిల్లలను చూసిన యాదమ్మ ఇద్దరూ షాక్‌ అవుతారు. పిల్లలు గట్టిగా చెప్పు యాదమ్మ ఎందుకు రూంలోకి వచ్చావు అని అడిగితే..

Advertisement

రూం శుభ్రం చేద్దామని వచ్చాను అని అబద్దం చెప్తుంది యాదమ్మ. అంజుకు మాత్రం అనుమానం వస్తుంది. శుభ్రం చేయడానికి నీ చేతిలో చీపురుకట్ట లేదేంటి అని అడగ్గానే.. యాదమ్మ తడబడుతూ.. అది రూం సర్దిన తర్వాత క్లీన్‌ చేద్దామనుకున్నాను.. పిల్లలు  ఆ హనుమాన్‌ విగ్రహం అక్కడి నుంచి తీసేయండి.. రూం సర్దుతాను అని చెప్పగానే.. బుజ్జమ్మ కోపంగా ఆ హనుమాన్‌ అక్కడే ఉంటాడు.. నువ్వు రూంలోంచి బయటకు వెళ్లు అంటుంది. అంజు కూడా యాదమ్మ చెప్పేది నీకే ముందు నువ్వు రూంలోంచి బయటకు వెళ్లు అనగానే.. యాదమ్మ భయంగా బయటకు వెళ్తుంది.

రూంలోంచి బయటకు వెళ్లిన యాదమ్మను మనోహరి తిడుతుంది. ఒక్క పని చేయడం చేతకాదు నీకు.. విగ్రహం ఎత్తుకురమ్మంటే.. ఎందుకు అరిచావు అంటూ తిట్టగానే.. యాదమ్మ భయంతో ఆ విగ్రహం పట్టుకోబోతుంటే.. కొతి వచ్చింది మనోహరి మొన్న మనల్ని బెదరించిన కోతే ఇవాళ వచ్చింది అని చెప్పగానే.. నేను చూస్తూనే ఉన్నాను.. నాకు కోతి కనిపించలేదు కథలు చెప్తున్నావా..? అనగానే.. నిజం మనోహరి కోతి వచ్చింది. కావాలంటే నువ్వు వెళ్లి పట్టుకో తెలుస్తుంది అని చెప్పగానే.. మనోహరి కోపంగా యాదమ్మను  తిట్టుకుంటూ వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత పిల్లలందరూ కిందకు రాగానే మిస్సమ్మ అందరినీ హోంవర్క్‌ చేశారా అని అడుగుతుంది. చేశామని పిల్లలు చెప్తూనే.. తాము ఇండిపెండెన్స్‌ డే సెలబ్రేషన్స్‌లో గెటప్స్‌ వేస్తున్నామని చెప్తారు. ఒక్కోక్కరు ఒక్కో గెటప్‌ వేస్తున్నామని అందుకు కావాల్సిన క్యాస్ట్యూమ్స్‌ మీరే తీసుకురావాలని మిస్సమ్మకు చెప్తారు. మిస్సమ్మ సరే తీసుకొస్తాము కానీ ఇప్పుడు అందరూ డిన్నర్‌ చేయండి అంతా రెడీగా ఉన్నాయి అని చెప్పగానే.. పిల్లుల తాము భోజనం చేయమని బయటకు వెళ్లి పానీపూరి తిందామని అడుగుతారు. అందుకు మిస్సమ్మ వద్దని చెప్తుంది. బయటకు వెళ్లి తిందామని పిల్లలు చెప్తుంటే.. అమర్‌ వస్తాడు.

ఏంటి పిల్లలు బయటకు ఎందుకు అని అడగ్గానే.. అందరూ సైలెంట్‌ అవుతారు. బుజ్జమ్మ మాత్రం తమకు పానీపూరి తినాలని ఉంది అని చెప్తుంది. వర్షాకాలం కాబట్టి బయటి ఫుడ్‌ వద్దని మిస్సమ్మ చెప్తుంది. పార్థు తీసుకెళ్తానంటే అమర్‌ వద్దని మిస్సమ్మ చెప్పింది కరెక్ట్‌.. పానిపూరీ తినాలంటే బయటకే వెళ్లాలా ఇంట్లోనే రెడీ చేసుకుందాం అంటాడు అమర్‌. మీకు పానీపూరి చేయడం కూడా వచ్చా డాడీ అంటూ పిల్లలు అడిగితే.. వచ్చని చెప్తాడు అమర్‌.. పిల్లలు హ్యాపీగా ఫీలవుతుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

సీరియల్‌లో చూస్తే తల్లిలా.. బయట చూస్తే హీరోయిన్‌లా.. ఈమె ఎవరో తెలుసా?

Friday Movies in Tv : మూవీ లవర్స్ కు పండగే.. శుక్రవారం టీవీలల్లోకి హిట్ చిత్రాలు..

9 సీజన్లు.. 9 కథలు.. బిగ్‌బాస్ విన్నర్స్ వీళ్లే!

అనిల్ రావిపూడిలో ఈ క్రియేటివిటీ కూడా ఉందా? ఆ స్టార్ హీరోను భలే రీ క్రియేట్ చేశారే!

హోస్ట్ గా మారుతున్న మరో స్టార్ హీరో?

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2లోకి ఎంపికైన 15 మంది వీరే.. హౌస్ లోకి అడుగుపెట్టే ఆరుగురు ఎవరు?

అల్లు అర్జున్ మూవీలో సీరియల్ బ్యూటీకి ఛాన్స్.. ఇదిగో ప్రూఫ్..

Big Stories

Advertisement
×