E-Paper
Advertisement

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ట్యాగ్ వెనుక ఎన్నో త్యాగాలు.. ప్రియాంక చోప్రా ఎమోషనల్!

Priyanka Chopra: గ్లోబల్ స్టార్ ట్యాగ్ వెనుక ఎన్నో త్యాగాలు.. ప్రియాంక చోప్రా ఎమోషనల్!
Advertisement

Priyanka Chopra: ప్రియాంక చోప్రా పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం హాలీవుడ్ సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ గ్లోబల్ రేంజ్ లో కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలా గ్లోబల్ బ్యూటీగా పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో రాబోతున్న వారణాసి(Varanasi) సినిమాలో హీరోయిన్ గా నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

సినిమాల కోసం ఎన్నో త్యాగాలు..

ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా పేరు భారీ స్థాయిలో మారుమోగుతుంది తరచూ ఈమెకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక చోప్రా తన కెరియర్ గురించి మాట్లాడుతూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. తాను కెరియర్ పరంగా నేడు ఈ స్థాయిలో ఉన్నాను అంటే ఈ విషయం వెనుక ఎన్నో త్యాగాలు ఉన్నాయని ఈమె తెలిపారు. 20 సంవత్సరాల వయసులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎలాంటి సినిమాలు ఎంపిక చేసుకోవాలో తెలియక వచ్చిన అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ బిజీగా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలో పండుగలు పుట్టినరోజులను త్యాగం చేశానని తెలిపారు.

నాన్నను చూసుకోలేక పోయాను..

Advertisement

ఇలా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల కుటుంబంతో కలిసి గడిపిన క్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని ఈమె వెల్లడించారు. ముఖ్యంగా తన తండ్రి చివరి రోజుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా పక్కన ఉండి తన తండ్రిని చూసుకోలేక పోయాను అంటూ ఎమోషనల్ అయ్యారు. అప్పుడు ఈ స్థాయిలో కష్టపడ్డాను కాబట్టి ప్రస్తుతం తాను ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్నానని ప్రియాంక చోప్రా తెలియజేశారు. ఇక ప్రస్తుతం ఈమె హాలీవుడ్ సినిమాలు వెబ్ సిరీస్ లతో పాటు ఇండియన్ సినిమాలలో కూడా నటిస్తున్నారు.

రామ్ చరణ్ తో నటించిన ప్రియాంక చోప్రా..

Advertisement

గత కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైన ఈమె ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ తెలుగు సినిమాలో నటించబోతున్న నేపథ్యంలో ప్రియాంక చోప్రా తిరిగి ఇండియన్ సినిమాలలో బిజీ కాబోతున్నారని తెలుస్తోంది. ఇక వారణాసి సినిమాలో ఈమె మందాకిని అనే పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే . ఈ సినిమా కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పబోతున్నారని అందుకు అనుగుణంగానే తెలుగు కూడా నేర్చుకుంటున్నానని ప్రియాంక చోప్రా తెలియచేశారు. ఈమె మహేష్ బాబు కంటే ముందుగా సౌత్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ త కలిసి జంజీర్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ కు తీవ్ర నిరాశను కలిగించింది. అయితే ఇదే సినిమాని తెలుగులో తుఫాన్ పేరుతో విడుదలైన ఇక్కడ కూడా సక్సెస్ అందుకోలేకపోయింది. ఇలా రామ్ చరణ్ తర్వాత ఈమె సౌత్ ఇండస్ట్రీలో మహేష్ బాబుతో సినిమా చేస్తుండటం విశేషం.

Also Read: Sandeep Raj: సానుభూతి కోరుకోలేదు.. నా ఉద్దేశం అది కాదు.. క్లారిటీ ఇచ్చిన సందీప్ రాజ్!

Related News

రీ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ‘ఉపేంద్ర’ మూవీ!

ఈ స్పీడ్ ఏంటి రవితేజా.. ఇరుముడి తర్వాత జోరు పెంచాడుగా !

67 ఏళ్లకే ప్రెగ్నెన్సీ అంటూ ట్రోలింగ్.. నీనా గుప్తా దిమ్మతిరిగే కౌంటర్!

నా భార్య నన్ను నమ్మింది… సైమా అవార్డుతో మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్!

సెప్టెంబర్ 18న వచ్చేస్తున్న’పిఠాపురంలో అలా మొదలైంది’!

బేబీబంప్ తో రష్మిక మందన్న…రణబాలి నుంచి స్పెషల్ వీడియో!

తారక్ నెక్ట్స్ సినిమాలు ఇవేనా.. ఒక్కొక్కటి మామూలు కాంబో కాదుగా !

సూరితో పోటీగా సుహాస్ క్రేజ్.. తమిళనాట మండాడి హంగామా!

Big Stories

Advertisement
×