Nagarjuna : మీరు కథలను అద్భుతంగా రాస్తారా..? సినిమాలకు రైటర్ గా పనిచెయ్యాలని అనుకుంటున్నారా..? అన్నపూర్ణ స్టూడియో లో స్టోరీ రైటర్ గా చెయ్యాలి అనుకొనేవారికి సువర్ణ అవకాశం. స్టోరీ రైటర్స్ కు నాగార్జున లాంటి స్టార్ హీరోలతో పనిచేసే అవకాశం.. అన్నపూర్ణ స్టూడియోలో రైటర్స్ కోసం సూపర్ ఛాన్స్.. తాజాగా ఓ మూవీ ఈవెంట్ లో పాల్గొన్న నాగార్జున కొత్త రైటర్స్ కు అన్నపూర్ణ స్టూడియో అవకాశం ఎప్పుడు ఉంటుందని చెప్పారు.. ఆ ఈవెంట్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియోలో వైరల్ అవుతుంది..
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘పళ్ళబురుసు’. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ మూవీకి సంబందించిన ఈవెంట్ ను మేకర్స్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నాగార్జున మాట్లాడుతూ.. పళ్ళబురుసు చిత్రం స్టోరీపై నాగార్జున ప్రశంసలు కురిపించాడు. అద్భుతమైన స్టోరీ ఎలాంటి స్టోరీలను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు అంటూ అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కొత్తగా కదలని రాసేవారికి అన్నపూర్ణ స్టూడియో ఎప్పుడు ఆహ్వానం పలుకుతుంది అని నాగార్జున చెప్పారు.. కొత్తగా సినిమాల కోసం కథలు రాసే వారి కోసం అన్నపూర్ణ స్టూడియో సువర్ణ అవకాశమిస్తుంది.. మీరు ఆ టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మ టీం ముందుగా కదలని విని నచ్చితే నాకు చెప్తారు నేను మీతో నేరుగా కూర్చుని కథలు వింటాను అని అన్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నాగార్జునపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
?igsh=MTN3NzIyNHl6bmpldg==
టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. హీరోగా సినిమాలు చేయడంతో పాటుగా మల్టీస్టారర్ మూవీలలో కూడా నటిస్తూ వరుసహిట్లను తన ఖాతాలు వేసుకుంటున్నారు.. ప్రస్తుతం ఆయన తన వండవ సినిమాలలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశ ఉన్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
‘పళ్లబురుసు’ మూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కొడుకు తనకు టూత్‌బ్రష్ కొనివ్వలేదంటూ ఒక తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, ఆ తండ్రీకొడుకుల చిన్న గొడవ పెద్దదై స్టేషన్ దాకా వెళ్లడం స్టోరిగా ఈ మూవీ వస్తుంది. ‘బలగం’ ఫేమ్ సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, గోమతి, ప్రజ్వల్ యాద్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఆగస్టు 14న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్లు, టీజర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. కొత్తగా స్టోరీ ఉండడంతో జనాలు ఈ సినిమాని ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామని వెయిట్ చేస్తున్నారు.. ఇప్పటివరకు జనాలని ఆకట్టుకున్న ఈ సినిమా థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి…
Also Read :నెటిజన్లకు బాలు దిమ్మతిరిగే కౌంటర్.. ఆ రూమర్స్ కు చెక్ పడ్డట్లేనా..?