Sharvari Wagh: శర్వరీ వాఘ్.. సరికొత్త పాత్రలు పోషిస్తూ తనకంటూ బాలీవుడ్ లో తనదైన స్టాంప్ వేసిన ఈ ముద్దుగుమ్మ ఇపుడు మరోసారి వార్తల్లో నిలిచింది.అవును..తాజాగా జరిగిన ‘Bazaar India Women of the Year’ ఈవెంట్ లో ప్రముఖ ‘Spotlight Actor of the Year’ అవార్డును అందుకుంది.ఇదే విషయమై తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పంచుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.
ఇక ఈ ఈవెంట్ కి సంబంధించిన గ్లామరస్ ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ, ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది. ఈ గుర్తింపు తనకు ఎంతో ప్రత్యేకమని, తన సినీ కెరీర్ జర్నీలో ఇది ఒక ముఖ్యమైన క్షణమని అయితే కేవలం అవార్డు రావడం మాత్రమే కాకుండా, వివిధ రంగాల్లో ప్రతిభ, ధైర్యం, క్రమశిక్షణతో ఎదిగిన, ఎదుగుతున్న ఎంతోమంది మహిళలతో కలిసి ఆ వేడుకలో పాల్గొనడం తనకు మరింత గర్వంగా,ఇన్స్పిరేషన్ గా అనిపించిందని చెప్పుకొచ్చింది.
సాధారణంగా ఏదైనా పెద్ద అవార్డు వచ్చినప్పుడు సెలబ్రిటీలు తమ పర్సనల్ సంతోషాన్ని లేదా విజయాన్ని మాత్రమే పంచుకుంటారన్న సంగతి తెల్సిందే. కానీ శర్వరీ మాత్రం తన కెరీర్ లో తనకు సపోర్ట్ గా నిలిచిన ప్రతి ఒక్కరినీ గుర్తు చేసుకోవడం విశేషం.
శర్వరీ సినిమా కెరీర్ విషయానికి వస్తే.2021లో వచ్చిన ‘బంటీ ఔర్ బబ్లీ 2’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే సత్తా చాటింది.అలా తన నటనతో యష్ రాజ్ ఫిల్మ్స్ వంటి పెద్ద బ్యానర్స్ లో మంచి అవకాశాలని పట్టేసింది. అలా శర్వరీ చేసిన సినిమాల్లో ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన సినిమాల్లో ‘ముంజ్యా’ఒకటి అని చెప్పాలి. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా లో శర్వరీ చేసిన బేలా రోల్ ఆడియన్స్ ని ఎంతగా మెస్మరైజ్ అయిందో చెప్పక్కర్లేదు.
అలా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ చూసింది ఈ సినిమా . ఇక ఆ తర్వాత వచ్చిన ‘మహారాజ్’, ‘వేదా’ వంటి సినిమాలు ఆమె రేంజ్‌ను మరింత పెంచాయనే చెప్పాలి. ముఖ్యంగా ‘వేదా’ సినిమాలో శర్వరీ చేసిన పాత్ర గతంలో ఆమె చేసిన గ్లామరస్ రోల్స్‌కు డిఫరెంట్ గా ఉండటం విశేషం.
ఇక ప్రస్తుతం శర్వరీ లైనప్ చూస్తే వరుస ప్రాజెక్టులతో తెగ బిజీగానే కనిపిస్తుంది.ముఖ్యంగా రీసెంట్ గా యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగమైన ‘ఆల్ఫా’ చిత్రంలో శర్వరీ, బాలీవుడ్ అగ్ర నటి అలియా భట్‌తో కలిసి నటించి మెప్పించింది కూడా.
also read :రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!
ఒకవైపు డిఫరెంట్ సినిమాలతో సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తూ మరోవైపు ట్రెండీ ఫ్యాషన్ స్టైల్స్‌తో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారే శర్వరీకి ఈ ‘స్పాట్‌లైట్ యాక్టర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం సరికొత్త జోష్ ఇచ్చిందని చెప్పుకోకతప్పదు.