E-Paper
Advertisement

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!

చచ్చిపోతామని డ్రామా ఆడారు.. పూరి, ఛార్మి లీలలు బయటపెట్టిన ప్రొడ్యూసర్!
Advertisement

Chaitanya Reddy: మొదటి సినిమా హనుమాన్ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి తాజా ఇంటర్వ్యూ లో పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చారు.సినిమా ప్రొడక్షన్ లో ఉండే ఫైనాన్షియల్ ఒత్తిళ్ళు, డిస్ట్రిబ్యూషన్ చిక్కులు, అగ్రిమెంట్ల వెనుక మైండ్ గేమ్స్ ..ఇలా అన్ని విషయాలపై ఓపెన్ గా మాట్లాడారు.ఈ క్రమంలోనే డేరింగ్ అండ్ డాషింగ్ ప్రొడ్యూసర్ పూరి జగన్నాథ్, చార్మీలు ఇష్మార్ట్ శంకర్ సినిమా సమయంలో తమని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో చెప్పిన మాటలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విషయంలోకి వస్తే పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేస్తామని దాదాపు 25 కోట్లు చెల్లించామని తెలిపారు.ఫస్ట్ పార్ట్ ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద 30 నుండి 35 కోట్లు వసూలు చేయడంతో, సీక్వెల్ డబుల్ ఇస్మార్ట్ కనీసం 40 నుండి 45 కోట్లు బిజినెస్ చేస్తుందని అంచనా వేశామన్నారు .

Advertisement

పైగా రవితేజ సినిమా అప్పటికి అనౌన్స్‌మెంట్ లేకపోవడంతో 4 రోజుల లాంగ్ వీకెండ్‌లో సోలోగా విడుదల చేసి సేఫ్ అవ్వచ్చని భావించామని అన్నారు. అయితే ఒప్పందం రాసుకునేటప్పుడే ఒక డెడ్‌లైన్ విధించి, సినిమా క్వాలిటీ తగ్గినా లేదా పూరి జగన్నాథ్ గత సినిమాల విషయంలో ఉన్న చిక్కులు ఈ సినిమా రిలీజ్ కి అడ్డంకిగా రావు అంటేనే ఈ సినిమాని డిస్ట్రిబ్యూషన్ చేస్తామన్నారు.ఇక ఏ మాత్రం తేడా కొట్టినా ఒక కేవలం 4 నుండి 5 కోట్ల నష్టంతో ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ క్లాజ్ పెట్టుకున్నట్లు తెలిపారు.

అయితే పూరి జగన్నాథ్ గత సినిమాలకి సంబందించిన వివాదాలు ఈ సినిమాని చుట్టు ముడతాయని ఎంతో మంది ప్రెండ్స్ చెప్పారని అన్నారు. ఇప్పటి వరకు కట్టిన డబ్బుకి నైజం కాని, సీడెడ్ కాని తీసుకుని అంతటితో వదిలించుకుంటే మంచిదని వార్నింగ్ ఇచ్చారని వాపోయారు.ఇక అదే సమయంలో క ఆగస్ట్ 15న రిలీజ్ అంటే 13న పూరి గత సినిమా తాలుకూ వివాదం ఒకటి ఈ సినిమా రిలీజ్ కి అడ్డంకిగా మారిందని,దాంతో కట్టిన డబ్బు పోయినా సరే మిగతా డబ్బు కట్టి ఇబ్బందుల పాలు కావోద్దని తాను నిర్ణయం తీసుకున్నాని,కానీ చార్మీ తన వద్దకి వచ్చి ఈ సమయంలో వెనక్కి వెళ్ళిపోతే చావే గతి అని బతిమిలాడుకుందని అసలు విషయం చెప్పుకొచ్చారు.

Advertisement

ఇక మరో వైపు తన భర్త నిరంజన్ కూడా 35 కోట్ల కోసం ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంటావా?వారు మనతో ఒక సినిమా చేస్తామని అంటున్నారని ,ఇక్కడ పేపర్స్ కన్నా మనుషులని నమ్మాలని నన్ను కన్విన్స్ చేసి మిగతా డబ్బు కట్టేలా చేశాడని వాపోయారు .అలా తన భర్త వల్ల వెనక్కి పోలేకపోయామన్నారు.

ఇక సినిమా రిలీజ్ ముందు వరకు కూడా ఫైనాన్షియర్ల నుంచి వన్ డే అప్రూవల్ సంపాదించి క్యూబ్ డిజిటల్ ప్రింట్లకు పర్మిషన్ తెచ్చుకోవడానికి ఛాంబర్ లో పోరాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు ,అందువల్లే సినిమా కి ప్రమోషన్స్ సరిగ్గా ఉండవని, రిలీజ్ రోజు కూడా షోలో లేట్ గా పడ్డాయని గుర్తు చేశారు.

గతంలో వరంగల్ శీను అనే డిస్ట్రిబ్యూటర్ నష్టపోయినప్పుడు ఛాంబర్ మొత్తం ఆయన వెనక నిలబడిందని, కానీ ప్రైమ్ షో బ్యానర్‌కి కోట్లలో నష్టం వస్తే ఏ ఒక్కరూ మద్దతుగా నిలబడలేదని వాపోయారు. సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయిన తర్వాత పూరి ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి ఎలాంటి స్పందన లేదని, రికవరీ విషయమై మాట్లాడటానికి వారి ఇంటికి వెళ్దామంటే రానివ్వకుండా ఫోన్ నంబర్లు కూడా బ్లాక్ చేశారని బయటపెట్టారు.

ఈ ఊహించని నమ్మకద్రోహం మరియు ఆర్థిక నష్టం వల్ల చైతన్య రెడ్డి దాదాపు 4 నుండి 5 నెలల పాటు తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లామని అన్నారు. తన మాట వినకుండా ఈ సినిమాకు డబ్బులు ఇచ్చినందుకు నిరంజన్ రెడ్డి కూడా బాధ పడ్డాడని తెలిపారు.ఇక రిలీజ్ తర్వాత చిన్న సినిమా చేయామని పూరి ని అడిగితే డైరెక్షన్ చేసినందుకు 10 కోట్ల పైగా ,మరియు సినిమాలో వాటా కావాలని అడిగారని, ఒక వైపు ఇష్మార్ట్ సినిమా పోయి మేము బాధల్లో ఉంటె ఇలా రివర్స్ మమల్నే డబ్బులు కావాలని అడగటం ఏంటని మండిపడ్డారు.

పూరి టాక్స్ అంటూ నీతులు చెప్పే పూరి డబ్బు విషయంలో ఇలా చేయడం ఏంటని, గతంలో పూరి కూడా కోట్లు సంపాదించిన వాడేనని ,మళ్ళీ తన టాలెంట్ తో డబ్బు సంపాదించుకోవచ్చు కానీ ఇలా మా డబ్బులతో ఆటలాడటం ఏం బాగోలేదని ఫైర్ అయింది.

ఇక ఇష్మార్ట్ శంకర్ సినిమా విషయంలో ఇప్పటివరకున్న ఫైనాన్షియల్ ఇష్యూస్ ని 90 నుండి 95 శాతం అమౌంట్ క్లియర్ చేసేశామని, భవిష్యత్తులో ఏ కొత్త ప్రొడ్యూసర్ కూడా తమలాగా మోసపోకూడదనే ఉద్దేశంతోనే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మరియు ఫిలిం ఛాంబర్ వ్యవహారాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్నట్లు తెలిపారు.

చూడాలి మరి చైతన్యా రెడ్డి చేసిన ఈ కామెంట్స్ పై పూరి జగన్నాథ్ ఎలా రియాక్ట్ అవుతాడో !

also read :‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

Tags

Related News

బూతులు తిడుతూ..చచ్చిపో అంటూ శాపాలు… రేణు దేశాయ్ ఎమోషనల్!

‘ముంజ్యా’ బ్యూటీ శర్వరీకి క్రేజీ అవార్డ్… ఆమె చేసిన సినిమాల లిస్ట్ ఇదే!

ప్రమోషన్లలో రణబాలి సరికొత్త స్ట్రాటజీ.. సినిమాకు ప్లస్ అయ్యేనా?

ఆదర్శ కుటుంబం నుంచి ‘నారాయణమ్మ’ ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్

వెంకటేష్ అంటే త్రివిక్రమ్ కు అంత భయమా.. ఎందుకో తెలుసా?

అమ్మ హీరోయినే..కూతురు హీరోయినే..ఇండస్ట్రీలో తల్లీకూతుర్ల హవా!

రూ.200 కోట్లు సాధ్యమేనా..? ‘ప్యారడైజ్’కి అసలు పరీక్ష ఇప్పుడే!

Big Stories

Advertisement
×