BigTV English

Kingdom Film : కింగ్డమ్ సినిమా అసలు డ్యూరేషన్ ఎంతంటే.?

Kingdom Film : కింగ్డమ్ సినిమా అసలు డ్యూరేషన్ ఎంతంటే.?

Gowtham Tinnanuri: రీసెంట్ టైమ్స్ లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన సినిమా అంటే కింగ్డమ్ అని చెప్పాలి. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూలై 31న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమాను చాలాసార్లు వాయిదా వేశారు.


ఈ సినిమాను అనౌన్స్ చేసినప్పుడే నిర్మాత నాగ వంశీ ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు పెంచేసాడు. ఈ సినిమా విషయంలో ఎటువంటి రివ్యూ వచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేస్తాను అంటూ తెలిపాడు. అలానే ఈ సినిమాలో ఎటువంటి లోటుపాట్లు కూడా ఉండవు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత సెకండ్ ఆఫ్ విషయంలో కంప్లైంట్ ఉంది అంటే దానిని కూడా యాక్సెప్ట్ చేశాడు నాగ వంశీ.

అసలు డ్యూరేషన్ ఇది 


రీసెంట్ టైమ్స్ లో ప్రేక్షకులకి ఓపిక చాలా తగ్గిపోయింది అనేది వాస్తవం. ఒక కథను ఎంగేజింగ్ గా చెప్పగలిగితే మాత్రమే సినిమాకు ఎక్కువ డ్యూరేషన్ ఉండాలి. లేదు అనుకుంటే చెప్పాల్సిన కథను చాలా తక్కువ టైంలో చెప్పే ప్రయత్నం చేయాలి. కింగ్డమ్ సినిమా విషయానికి వస్తే గౌతమ్ ఈ సినిమా ఫస్ట్ కట్ చేసినప్పుడు మూడు గంటల ఐదు నిమిషాలు వచ్చిందట. ఆ తరువాత సినిమాను తగ్గించారు. ఈ సినిమాను తగ్గించినా కూడా సెకండాఫ్ లో చాలామందికి కంప్లైంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా నుంచి ముందు రిలీజ్ చేసిన పాట లేకపోవడం కొంతమందికి నిరాశ కలిగించింది. ప్రస్తుతానికి అయితే ఈ సినిమా పాజిటివ్ టాక్ తోనే ముందుకు సాగుతుంది. ఆగస్టు 14 వరకు సరైన సినిమాలు లేవు కాబట్టి ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

ఇంట్రెస్టింగ్ గా ఉండాలి 

సినిమా డ్యూరేషన్ ఎంత ఉన్నా కానీ కథ ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే, అలానే ప్రేక్షకులు సినిమాలో ఇన్వాల్వ్ అయిపోతే టైం తెలియకుండా పోతుంది. ఇలా సక్సెస్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. ముఖ్యంగా రంగస్థలం, అర్జున్ రెడ్డి, అనిమల్ వంటి సినిమాలు డ్యూరేషన్ ఎక్కువ ఉన్నా కూడా మంచి సక్సెస్ సాధించాయి. దీనికి కారణం సినిమాను ఆయా దర్శకులు డీల్ చేసిన విధానం. మొత్తానికి ఈ సినిమా కూడా కొంతమేరకు ప్రేక్షకులకు నచ్చడానికి కారణం సినిమాను ట్రిమ్ చేయడమే. బహుశా కొన్ని సీన్లు ఉండి ఉంటే కథ క్లారిటీగా అర్థమయ్యేది కావచ్చు.

Also Read: Sathyaraj : రజినీకాంత్ నేను అలా నటించడం ఇదే మొదటి సారి, ఎమోషనల్ అయిపోయిన కట్టప్ప

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×