BigTV English

Monda Market: ఆవుల చోరీ కేసులో పోలీసులు ఓవర్ యాక్షన్.. అసలు నిజాలివే.. తప్పంతా వాళ్లదే..?

Monda Market: ఆవుల చోరీ కేసులో పోలీసులు ఓవర్ యాక్షన్.. అసలు నిజాలివే.. తప్పంతా వాళ్లదే..?

Monda Market: ఆవులకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేసిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇటీవల మోండా డివిజన్ బండి మెట్, సెకండ్ బజారులో ఇటీవల ఆవుల చోరీ జరిగింది. కొంత మంది దొంగలు ఖరీదైన కారుల్లో వచ్చి ఆవులను కార్లలో వేసుకుని పారిపోయారు. ఆవులను హింసిస్తూ ఇన్నోవా, హెర్టిగా కారుల్లో తీసుకువెళ్లారు. రెండు చోట్ల ఇదే ఘటన చోసుకోవడంతో స్థానిక ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. ఇందులో ముఠా ఆవులను ఎత్తుకు వెళుతున్న దృశ్యాలు కనిపించాయి. సిటీలో పలు ప్రాంతాల్లో గోవులకు మత్తు మందు ఇచ్చి కార్లల్లో తరలిస్తున్నట్టు బయటపడింది. దీనికి సంబంధించిన సీసీ టీవీ వీడియోలు కూడా సోషల్  మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కేసులో పోలీసులు ఆ ముఠాను అరెస్ట్ చేయలేదని తెలుస్తోంది.


సికింద్రాబాద్ మార్కెట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆవుల చోరీ కేసులో పోలీసులు ఓవర్ యాక్షన్ తాజాగా బయటపడింది. ఆవుల దొంగతనం వీడియోలు ప్రసారం చేయొద్దంటూ ఆంక్షలు విధించారు.  పోలీసుల నైట్ గస్తీ నిర్లక్ష్యంతోనే ఆవులకు మత్తు ఇంజక్షన్లు ఇచ్చి దొంగలించే సంఘటనలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు.  గతంలో చోరీలు జరిగాయని మీడియా సమావేశంలో స్వయంగా పోలీసులు చెప్పేశారు. తాజాగా ఆవుల దొంగతనం జరిగింది వాస్తవమంటూ నార్త్ జోన్ డీసీపీ పెరుమాళ్ పూర్తి వివరాలు వెల్లడించారు. దొంగల కోసం గాలిస్తున్నామని.. టీమ్ ఏర్పాటు చేశామని చెప్పిన చెప్పారు.

ALSO READ: Uttam Kumar Reddy: లోకేష్ ఏం మాట్లాడుతున్నవ్.. కొంచెం ఆలోచించు కదా: ఉత్తమ్ కుమార్ రెడ్డి


నైట్ గస్తీ పెంచకుండా, పెట్రోలింగ్ నిర్లక్ష్యంతో ఆవుల దొంగతనాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. దర్జాగా కారులో వచ్చి దొంగలు ఆవులను ఎత్తుకెళ్తున్నారని.. పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేదని అంటున్నారు. నగరంలో ఇప్పటికే రెండు చోట్లా ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. గత మూడు రోజులుగా ఆవుల ఎత్తుకెళ్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ALSO READ: Karachi Hotels: కరాచీలోని ఆ హోటళ్లకు వెళ్లకండి.. వణికిపోతున్న అమెరికా, అసలు ఏమైంది?

ఆవుల దొంగలించిన కేసులో దొంగలను పెట్టుకోకుండా పలు మీడియా సంస్థలపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేయడం ఎంతవరకు కరెక్ట్ నెటిజన్లు నిలదీస్తున్నారు. ఎలాంటి విద్వేషాలు, మతాల అంశాలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు లేకున్నా అక్రమ కేసులు పెడుతున్నట్టు తెలుస్తోంది. దొంగలను పట్టుకోకుండా పట్టుకుంటామని ప్రెస్ మీట్ డీసీపీ ఆర్భాటంగా చెప్పిన విషయం తెలిసిందే. నిందితుల సమాచారం తెలపకుండా ప్రెస్ మీట్ పెట్టి డీసీపీ ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదని స్థానికులు అంటున్నారు. పోలీసుల నెగ్లిజెన్సీతోనే రాత్రి పూట దొంగతనాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. మార్కెట్ పోలీసు స్టేషన్ లో ఆవుల దొంగతనాలు ప్రసారం చేశారని పోలీసులు, జర్నలిస్టులను ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×