Weather News: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగస్టు నెలలో దాదాపు 20 రోజుల పాటు భారీ వానలు కురిశాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. భారీ వర్షాల ధాటికి కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ ప్రజలు ఆ బాధల నుంచి తేరుకోలేదు. ఆగస్టు చివరి వారంలో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. అయితే హైదరాబాద్ వాతావరణ శాఖ మరోసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అలర్ట్ చేసింది.
కాసేపట్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం..
రాబోయే 2 గంటల్లో తెలంగాణలోని 5 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు..
ఇవాళ ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వివరించారు..
రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
రేపు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఈ ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు.
బయటకు రావొద్దు..
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారు సూచిస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళ పొలాల వద్దకు వెళ్లొద్దని చెబుతున్నారు. రాత్రి సమయంలో ఇంట్లోనే ఉంటే బెటర్ అని పేర్కొన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.