Shreyas Iyer – BCCI: టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు అదిరిపోయే శుభవార్త చెప్పేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమైనట్లు చెబుతున్నారు. శ్రేయాస్ అయ్యర్ కు భారత క్రికెట్ నియంత్రణ మండలి… అవకాశం ఇవ్వడం లేదని జోరుగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతని కోసం ప్రత్యేక పోస్ట్ సిద్ధం చేసిందట. టీమిండియా కెప్టెన్సీ బాధ్యతలు శ్రేయాస్ అయ్యర్ కు అప్పగించే ఆలోచనలో ఉన్నారట. అయితే టీమిండియా ఏ జట్టుకు… శ్రేయాస్ అయ్యర్ ను కెప్టెన్ చేయాలనేది భారత క్రికెట్ నియంత్రణ మండలి నిర్ణయమని తెలుస్తోంది. పర్మినెంట్గా టీమిండియా ఏ జట్టుకు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అవుతాడని చెబుతున్నారు. లేకపోతే టీమిండియా ఏ అలాగే ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య జరిగే సిరీస్ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కు కేప్టెన్సీ కచ్చితంగా వస్తుందని చెబుతున్నారు.
Also Read : Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే
టీమిండియా యంగ్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ కు అడుగడుగున తీవ్ర అన్యాయం జరుగుతున్న సంగతి తెలిసిందే. అద్భుతంగా రాణించిన… పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ దాకా తీసుకు వెళ్లినప్పటికీ… టీమిండియా యంగ్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కు మాత్రం… జట్టులో స్థానం దొరకడం లేదు. తాజాగా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా జట్టును ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ టోర్నమెంట్ జరగనుంది. టి20 ఫార్మాట్ లో జరగనున్న ఈ టోర్నమెంట్ కు కచ్చితంగా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో శ్రేయాస్ అయ్యర్ ను సెలెక్ట్ చేయలేదు భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ తరుణంలోనే భారత క్రికెట్ నియంత్రణ మండలిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. శ్రేయాస్ అయ్యర్ ను సెలక్ట్ చేయకపోవడంపై టీమిండియా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రీడ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే… శ్రేయాస్ అయ్యర్ కు కెప్టెన్సీ ఇవ్వబోతున్నారట. టీమిండియా మెయిన్ జట్టుకు కాకుండా… టీమిండియా A జట్టుకు శ్రేయస్ అయ్యర్ ను కెప్టెన్ చేస్తారని తెలుస్తోంది. లేకపోతే ఆస్ట్రేలియా వర్సెస్ టీమ్ ఇండియా జూనియర్ ప్లేయర్ల సిరీస్ ఉంది. ఆ సిరీస్ నేపథ్యంలో టీమిండియా A జట్టుకైనా శ్రేయాస్ అయ్యాను కెప్టెన్ చేస్తారని చెబుతున్నారు.
🚨 IMPORTANT ROLE FOR SHREYAS IYER 🚨
– Shreyas is likely to get a prominent role in India A team, Captaincy or otherwise against Australia A. [Cricbuzz] pic.twitter.com/EOuKkTiG8p
— Johns. (@CricCrazyJohns) September 6, 2025