E-Paper
Advertisement

హీరోయిన్ చాందినికి ఘోర అవమానం.. తల్లితోనే ఆ మాట అన్నారా?

హీరోయిన్ చాందినికి ఘోర అవమానం.. తల్లితోనే ఆ మాట అన్నారా?
Advertisement

Chandini Chowdary : క్రేజీ హీరోయిన్ చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. ఒక్క సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా క్రేజీ ఆఫర్లను అందుకుంటూ జనాలని ఆకట్టుకుంటూ వస్తుంది. తెలుగమ్మాయి అయినా ఈమె నటనకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు.. ఇప్పటివరకు డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించిన చాందినికి చేదు అనుభవం ఎదురైందని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. తనకు జరిగిన అవమానం గురించి చెప్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఆమెకు ఎదురైన ఆ చేదు అనుభవం గురించి ఏం చెప్పిందో కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

చాందిని చౌదరికి ఘోర అవమానం.. 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తాజాగా ఈమెకు సబందించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది.. ఆ వీడియోలో ముందుగా బ్రహ్మోత్సవం మూవీలో ఒక చిన్న పాత్ర చేశాను. ఆ తర్వాత నాకు ఒక జువెల్లారి యాడ్ కోసం ఆఫర్ వచ్చింది. దానికోసం మా అమ్మకు కాల్ చేశారు. ఈ అమ్మాయి అంతా చూడడానికి కూడా బాగోలేదు. ఈ ఆఫర్ ఇవ్వాలి అంటే ప్రొడ్యూసర్ దగ్గరికి ఒకసారి వెళ్ళాలి అని చెప్పడంతో ఒక్కసారిగా నేను షాక్ అయిపోయాను.. అంతే కాదు ఆ తర్వాత నేను నో చెప్పడంతో చాందినీకి పొగరెక్కువ అని ఇండస్ట్రీలో ప్రచారం చేశారు.. ఇప్పటికీ నాకు ఆ పేరు ఇండస్ట్రీలో ఉంది అని ఆమె చెప్పుకొచ్చారు.. ఆ వీడియోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది..

చాందిని చౌదరి సినిమాల విషయానికొస్తే.. 

Advertisement

టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ చాందిని చౌదరి షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బాగా ఫేమస్ అయి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.. హీరోయిన్ గా చేయకముందు పలు సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు వంటి సినిమాల్లో ఆమె చిన్న పాత్రల్లో నటించింది. కలర్ ఫోటో చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ సినిమాతో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు కూడా పడ్డాయి.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి బిజీగా మారింది.. ఇటీవల కాలంలో ఆమె హీరోయిన్ కన్నా చిన్న పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.. ఇటీవల బాలయ్య డాకు మహారాజ్ సినిమాలోనూ మెరిసింది. ప్రస్తుతం ఓ రెండు చిత్రాల్లో నటిస్తుందని తెలుస్తుంది.. త్వరలోనే ఆ సినిమాల గురించి వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.. సోషల్ మీడియాలో కూడా చాందిని ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.. ఒకప్పుడు పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు ఇప్పుడు గ్లామర్ డోస్ పెంచిందన్న విషయం తెలిసిందే.. లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంటాయి.

Related News

మా ఇంటి వాచ్‌మెన్ ఫోన్‌లో నా ఇంటిమేట్ సీన్స్.. నరకం చూశా – రాధిక ఆప్టే

డింపుల్ హయతి నెలకు అంత సంపాదిస్తుందా..? సినిమాల కన్నా ఎక్కువే..

ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

నాని కెరీర్‌లోనే బిగ్ రిలీజ్.. ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ లెక్కలు ఇవే!

అబ్బబ్బా.. ఖుషీ కపూర్ ఏంటి ఈ లుక్! ఫ్యాన్స్‌కి ఫుల్ ట్రీట్

కోమల్ నుదుటిపై సింధూరం.. గోవిందా సీక్రెట్ మ్యారేజ్ నిజమేనా?

నాని ‘ది ప్యారడైజ్’కి చిరంజీవి సపోర్ట్.. మెగా స్టార్ పోస్ట్ వైరల్

Big Stories

Advertisement
×