E-Paper
Advertisement

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనసేన ఎంపీ కొడుకు కారు ఢీకొని యువతి మృతి!

మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. జనసేన ఎంపీ కొడుకు కారు ఢీకొని యువతి మృతి!
Advertisement

Road Accident: జనసేన ఎంపీ లింగమ నేని రమేష్ కుమారుడు సంజయ్ పై కేసు నమోదైంది. రోడ్డు ప్రమాదం కేసులో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌ఆర్బిట్ మాల్‌ వద్ద ఎదురుగా రోడ్డు క్రాస్ చేస్తున్న యువతులను కారుతో గుద్దగా ప్రామాదంలో లైఫ్‌స్టైల్ ఉద్యోగిని మృతి చెందింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదుచేశారు. మాదాపూర్ ఇనార్బిట్ మాల్‌లో పని చేస్తున్న ఉద్యోగిని అక్కడికక్కడే మృతి చెందింది. రోడ్డు ప్రమాద వివరాలను మాదాపూర్ పోలీసులు గోప్యంగా ఉంచారు. దీంతో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆగస్టు 16వ తేదీన..

ఈ నేల ఆగస్టు 16వ తేదీన ఆదివారం మధ్యాహ్నం వేగంగా వచ్చిన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కుమారుడి కారు ఢీకొనడంతో భారతి ముఖి (26) అనే మహిళ మృతి చెందింది. ఒడిశా రాష్ట్రం, మయూర్ భంజ్ జిల్లాకు చెందిన భారతి ముఖిగా పోలీసులు గుర్తించారు. మాదాపూర్ పర్వత్ నగర్ ప్రాంతంలో మహిళ నివాసం ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. ఇనార్బిట్ లోని ‘లైఫ్‌స్టైల్’ షోరూమ్‌లో సేల్స్ గర్ల్‌గా పనిచేస్తున్న మృతురాలు భారతి ముఖి పనిచేస్తున్నారు.

Advertisement

Also read: జీవో 97 vs పాలిటెక్నిక్ స్టూడెంట్స్.. రంగంలోకి కేటీఆర్.. ప్రభుత్వానికి స్ట్రాంగ్ వార్నింగ్!

కారు అతివేగంగా..

ఆదివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో భారతి ముఖి తన సహోద్యోగి పూజ అశోక్‌తో కలిసి భోజనం తెచ్చుకోవడానికి ఐటీసీ కోహినూర్ వైపు వెళ్లింది. తిరుగు ప్రయాణంలో ఇనార్బిట్ మాల్ ఎదురుగా ఉన్న రోడ్డు దాటుతుండగా TG-09-G-0666 నంబర్ గల కారు అతివేగంగా, నిర్లక్ష్యంగా వచ్చి భారతి ముఖిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె తలకు తీవ్రమైన గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే ఆమెను జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించిన స్థానికులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

పోలీసులపై అనుమానాలు..

Advertisement

ఈ ఘటనపై లైఫ్‌స్టైల్ షోరూమ్ మేనేజర్ పంజాల అశ్విన్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ కుమారుడిపై “సంజ్జుష్” పై BNS 106(1) సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే ఈ ఘటన వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన జరిగిన తరువాత ముడోవ రోజుల తరువాత మాదాపూర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనను గోప్యంగా ఉంచాడడానికి భారి మొత్తంలో డబ్బులు తిసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

Also Read: పరోక్షం వద్దు.. ప్రత్యక్షమే ముద్దు..20 ఏళ్ల తర్వాత ఏపీ స్థానిక పోరులో చారిత్రాత్మక మార్పు!

Tags

Related News

కడప గడ్డ నుంచి జగన్‌కు సీఎం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్, రూ. 40 కోట్ల సుపారీకి సమాధానం చెప్పాలి

వైసీపీ ఎంపీ ఉన్నా.. అభివృద్ధిలో వివక్ష లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

ఏపీలో స్పెషల్ టెట్-2026 హాల్ టికెట్లు విడుదల, షెడ్యూల్ ఇదే! ఫలితాలు మాత్రం

ఏపీలో లక్షన్నర కోట్ల BPCL రిఫైనరీ ప్రాజెక్టు.. పర్యావరణ అనుమతులకు గ్రీన్‌సిగ్నల్, శంకుస్థాపనకు ప్రధాని

విజయవాడలో సైకో ప్రేమికుడు వీరంగం.. ఏం చేశాడంటే?

తిరుపతిలో ముగ్గురు వైద్యులపై ఉన్నతాధికారులు వేటు

ఏకపక్షంగా 14 ఆదేశాలా.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై వైఎస్ షర్మిల ఫైర్!

Big Stories

Advertisement
×