E-Paper
Advertisement

2007లోనే టీమిండియాను ఓడించి, ఇంటికి పంపించాం

2007లోనే టీమిండియాను ఓడించి, ఇంటికి పంపించాం
Advertisement

Shakib Al Hasan On 2007 Indian Match:  2007 వన్డే వరల్డ్ కప్ (2007 ODI World Cup) సందర్భంగా ఇండియాను చిత్తుగా బంగ్లాదేశ్ ఓడించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ మ్యాచ్ పెను సంచలనం సృష్టించింది. అయితే ఇండియా పై బంగ్లాదేశ్ విజయం సాధించిన నేపథ్యంలో తాజాగా ఆ జట్టు ఆల్రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్‌ (Shakib Al Hasan ) సంచలన వ్యాఖ్యలు చేశారు. మేమే తోపులమని దిగిన టీమిండియాకు 2007 వన్డే వరల్డ్ కప్ సందర్భంగానే ఓటమిని చూపించామని హాట్ కామెంట్స్ చేశారు. ఫియర్లెస్ క్రికెట్ ఆడి.. టీమిండియాను ఇంటికి పంపించామని చురకలు అంటించారు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ తో మ్యాచ్ లు అంటేనే టీమిండియా భయపడుతోంద‌ని షకీబ్ అల్ హసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

2007లోనే టీమిండియాను ఓడించి, ఇంటికి పంపించాం

2007 ప్రపంచ కప్ (2007 ODI World Cup) సందర్భంగా ఇండియాను ఓడించినప్పుడు తామంతా చాలా చిన్న కుర్రాళ్ళ మని.. అయినప్పటికీ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి సక్సెస్ అయినట్లు షకీబ్‌ అల్‌ హసన్‌ (Shakib Al Hasan ) వెల్లడించారు. ఆ రోజున బంగ్లాదేశ్ క్రికెటర్లలో భయమనేదే లేదని… భయంకరంగా ఉన్న టీం ఇండియాను ఓడించి ఇంటికి పంపామని వివరించారు. ఎంతో ధైర్యంగా ఫియర్లెస్ క్రికెట్ ఆడడం కారణంగానే తాము గెలిచామని వెల్లడించారు. తమ చేతిలో ఓడిపోయిన టీమిండియా, ఆ తర్వాత ఇంటిదారి పట్టిందని గుర్తు చేశారు. ఇండియా పై అప్పట్లో సాధించిన ఆ విజయం చారిత్రాత్మకమైనదని వివరించారు. తమ దెబ్బకు టీమిండియా ప్లేయర్లు కృంగిపోయారని వ్యాఖ్యానించారు.

Advertisement

SRH Batter Harry Brook On Kavya Maran: SRH జ‌ట్టులో నాకు న‌ర‌కం చూపించారు..టోర్నీ మ‌ధ్య‌లోనే పారిపోయేలా చేశారు!

బంగ్లా దెబ్బ‌కు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన టీమిండియా

2007 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ సందర్భంగా టీమిండియా గ్రూప్ స్టేజ్ లో మొత్తం మూడు మ్యాచులు మాత్రమే ఆడింది. ఈ సందర్భంగా తొలి మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా 49.3 ఓవర్లు ఆడి 191 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి 43 ఓవర్లలోనే బంగ్లాదేశ్ ఛేదించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తర్వాత బెర్ముడాపై అత్యంత భయంకరంగా ఆడిన టీమిండియా 257 పరుగుల తేడాతో విజయం నమోదు చేసుకుంది. ఇక మూడో మ్యాచ్ శ్రీలంకతో జరగగా.. 59 పరుగుల తేడాతో ఇండియానే ఓడిపోయింది. ఈ క్రమంలో వ‌న్డే వరల్డ్ కప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ అయింది. ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్ వర్సెస్ టీమిండియా మధ్య వన్డేలతో పాటు టి20 సిరీస్ నిర్వహించేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తోంది. అయితే భద్రతా కారణాలు చూపించి ఈ టోర్నమెంట్ ను స్కిప్ చేసింది బీసీసీఐ. బంగ్లాదేశ్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ తో మూడు టి20లు ఆడేందుకు సిద్ధమైంది.

Advertisement

Shoaib Akhtar ON Mohammad Amir: ఐపీఎల్ 2027లో మహ్మద్ అమీర్ ను ఆడించండి..బీసీసీఐకి అక్త‌ర్ రిక్వెస్ట్!

Related News

ఆసియా క‌ప్ గెలిస్తే, అన్ని మూసుకుని న‌ఖ్వీ చేతుల మీదుగా తీసుకోవాల్సిందే

విరాట్ కోహ్లీనే రియ‌ల్ కింగ్…అత‌ను పాకిస్తాన్ లో పుట్టుంటే బాగుండేది

ఇంగ్లండ్ చేతిలో 3-0 తేడాతో పాకిస్తాన్ వైట్ వాష్ కావ‌డం ప‌క్కా

2024 టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో టెస్ట్ ప్లేయ‌ర్ కంటే దారుణంగా ఆడాడు…కోహ్లీ ప‌రువు తీసిన అక్ష‌ర్ ప‌టేల్!

బాబ‌ర్ ఆజం పెద్ద మోస‌గాడు…PCBని మోసం చేసి, ఇంగ్లాండ్ కు వెళ్లాడు

ఐపీఎల్ లో తొలి సూప‌ర్ ఓవ‌ర్ వేశాడు..ఇప్పుడు దిక్కుతోచ‌ని స్థితిలో ఉన్నాడు !

ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఆడి, ఇంగ్లండ్‌లో.. పాకిస్తాన్ ప‌ళ్లు రాల‌గొట్టుకుంది

Big Stories

Advertisement
×