Fake Lecturer: ఉమ్మడి నిజామాబాద్‌లో మరో ఫేక్ లెక్చరర్ సమాచారం BIG TV చేతికి చిక్కింది. కష్టపడి చదివినోళ్లకు అన్యాయం.. నకిలీ సర్టిఫికెట్లతో కొలువులా.. పాఠాలు చెప్పడంలో ఇబ్బందులు పడుతున్నారంటూ లెక్చరర్‌పై విద్యార్థుల ఫిర్యాదులు చేస్తున్నారు. ఈయన సర్టిఫికెట్లు అసలైనవేనా..? లెక్చరర్ల అర్హతలపై విచారణ ఎటువైపు..? ఉమ్మడి నిజామాబాద్‌లో జిల్లాలో మరికొందరి జాబితాను బిగ్ టీవీ సిద్ధం చేసింది.. దీంతో ప్రభుత్వ విచారణలో ఎవరెవరు బయటపడేదెవరో ఇక చూడాలి.
ఇక వివరాల్లోకి వెలితే.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోనూ ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందారు. జిల్లాలో మరికొందరి ఫేక్ లెక్చరర్లు ఉన్న సమాచారం BIG TV చేతికి చిక్కింది. అయితే బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓ జూనియర్ లెక్చరర్ స్వరూప్ అనే వ్యక్తి పై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో 15–16 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ లెక్చరర్‌గా పనిచేసి.. 2023లో రెగ్యులరైన స్వరూప్.. ఇతను జువాలజీ సబ్జెక్టునులో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు తెలుగులో బోధిస్తున్నారంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం లేదంటూ గతంలో విద్యార్థుల ఆందోళన చేసినట్టు సమాచారం.
దీంతో మా సమస్య పరిష్కరించాలంటూ ఆర్డీవోకు విద్యార్థులు వినతిపత్రం సమర్పించారు. దీంతో విచారణ మొదలు పెట్టినట్టు అధికారుల తెలిపారు. విచారణ అనంతరం బాన్సువాడ నుంచి బీర్కూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వారం రోజులపాటు తాత్కాలిక బదిలీ అయ్యాడు. ప్రస్థుతం దసరా సెలవులకు ముందు నుంచి స్వరూప్ కళాశాలకు రావడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో లెక్చరర్‌పై కొనసాగుతున్న విచారణతో నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నది ఎవరు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also read: ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!