E-Paper
Advertisement

ఇదేందయ్యా ఇది.. కుక్కలు, పిల్లులకు ప్రత్యేక ఆలయాలు.. తరలివెళ్తున్న పెంపుడు జంతువులు!

ఇదేందయ్యా ఇది.. కుక్కలు, పిల్లులకు ప్రత్యేక ఆలయాలు.. తరలివెళ్తున్న పెంపుడు జంతువులు!
Advertisement

Dog Cat Temples: చైనా జానపద సాహిత్యమంతా కుక్కలు, పెంపుడు జంతువులకు సంబంధించిన అనేక పురాణగాథలతో నిండి ఉంటుంది. ‘జర్నీ టు ది వెస్ట్’, ‘ఇన్వెస్టిచేర్ ఆఫ్ ది గాడ్స్’ వంటి ప్రసిద్ధ చైనీస్ కథలను గమనిస్తే.. వాటిల్లో ‘ఎర్లాంగ్ షెన్’ అనే దేవుడి వెంట ఉండే ‘జియావోటియాన్ క్వాన్’ అనే శునకం ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ క్రమంలోనే చైనాలో కుక్కలు, పిల్లులను ఆరాధించే వారి సంఖ్య గణనీయంగానే పెరిగింది. ఫలితంగా అక్కడ కుక్కలు, పిల్లుల కోసం ప్రత్యేకంగా దేవాలయాలు, ఆలయ ప్రాంగణాలు సైతం వెలిశాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

ప్రాచీన శునకం ఆలయం

సిచువాన్ లోని ‘దుజియాంగ్యాన్’ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘గుటియాన్ గౌ మియావ్’ ఆలయం (పురాతన డాగ్ గాడ్ టెంపుల్) ఉంది. ఇక్కడ శునకాన్ని దైవంగా భావించి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఒకానొక సమయంలో ఈ గ్రామాన్ని భయంకరమైన వరదల నుంచి ఆ దైవిక కుక్క రక్షించిందని ఇక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. నేటికీ చైనీయులు తమ పెంపుడు కుక్కలను ఈ ఆలయానికి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేయిస్తుంటారు. తమ అరుపులు, అల్లర్లతో ఇంట్లో సంతోషాన్ని నింపే పెంపుడు శునకాలు.. ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండాలని ఇక్కడి కుక్క దేవుడికి వేడుకుంటారు.

పిల్లులకు సైతం ప్రత్యేక పూజలు

Advertisement

కేవలం కుక్కలకే పరిమితం కాకుండా పిల్లుల ప్రేమికులకు కూడా చైనా పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. చైనాలోని ‘తన్మావో హాల్’ అనే ప్రాచీన ఆలయానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన కథ ప్రచారంలో ఉంది. అక్కడ ఉండే ఒక పిల్లి.. ‘ఝావో గొంగ్మింగ్’ అనే వ్యక్తి సిరిసంపదల దేవుడిగా (గాడ్ ఆఫ్ వెల్త్) మారకముందు ఆయనకు రక్షణగా కాపలా ఉండేదని చెబుతారు. ఈ నమ్మకంతోనే పిల్లులకు కూడా ఆలయాల్లో ప్రత్యేక పూజలు అందుకునే భాగ్యం దక్కింది. చాలా చోట్ల ఆలయాల ప్రాంగణాల్లో పిల్లులకు ప్రత్యేకంగా విగ్రహాలు ఏర్పాటు చేసి పూలు నిర్వహిస్తున్నారు.

Also Read: 200 ఏళ్ల నాటి మిస్టరీ.. ఒక్క రాత్రిలో ఖాళీ అయిన ‘దెయ్యాల గ్రామం’.. కుల్ధారా వెనుక రహస్యాలేంటి?

నెట్టింట ఆసక్తికర కామెంట్స్..

Advertisement

చైనాలో ఇలా కుక్కలు, పిల్లులను పూజిస్తుండటంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పెంపుడు జంతువులకు ప్రత్యేకంగా దేవాలయాలు ఉండటం, వాటి ఆరోగ్యం కోసం పూజలు చేయించడం.. వింతగా, ఆసక్తికరంగాను ఉందంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ‘పెంపుడు ప్రాణులపై చైనీయులకు ఉన్న ప్రేమ, విశ్వాసం వేరే లెవెల్’ అని ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. మరికొందరు నెటిజన్లు తమ పెంపుడు కుక్కలు, పిల్లుల ఫోటోలను షేర్ చేస్తూ ఈ ఆలయాల విశేషాలను రీపోస్ట్ చేస్తున్నారు.

Also Read: BSNL లవర్స్‌కి గుడ్ న్యూస్.. రూ.1 ప్లాన్ మళ్లీ వచ్చిందోచ్.. ఉచిత సిమ్, కాల్స్, 24GB డేటా!

Tags

Related News

200 ఏళ్ల నాటి మిస్టరీ.. ఒక్క రాత్రిలో ఖాళీ అయిన ‘దెయ్యాల గ్రామం’.. కుల్ధారా వెనుక రహస్యాలేంటి?

విమానాన్ని హైజాక్ చేయలేదట.. పైలెట్ల లొల్లి వల్లే దారి తప్పిందట.. ఎంత టెన్షన్ పెట్టారో!

దేశంలోనే పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఇదే.. చిన్నది ఎక్కడుందో తెలుసా?

రైళ్లు కావు.. కదిలే రాజభవనాలు.. భారత్‌ లోని ఈ ట్రైన్లు చూస్తే ఆశ్చర్యపోతారు!

1979లో దీవిలోకి 30 ముంగిసలు.. కట్ చేస్తే ప్రభుత్వానికే చుక్కలు.. 45 ఏళ్లలో ఊహించని విధ్వంసం!

వాటర్ ఫాల్స్ కాదు బ్లడ్ ఫాల్స్.. రక్తం ప్రవహించే ఈ ప్రదేశం ఎక్కడుందంటే?

టికెట్ల నుంచి రైళ్ల మెయింటెనెన్స్ వరకు.. ఈ స్టేషన్‌లో పనిచేసేది అంతా మహిళలే!

Big Stories

Advertisement
×