Actor Nani: నాచురల్ స్టార్ నాని హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోయినా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మంచి సక్సెస్ సాధించారు. ఇక నాని ది ప్యారడైజ్ (Paradise)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్ల పరంగా మంచి ఓపెనింగ్స్ రాబట్టింది థియేటర్లో హౌస్ఫుల్ రన్ అవుతున్నాయి కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. ఇలా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
నాని సినీ కెరియర్ లోనే ప్యారడైజ్ హైయెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమా అని చెప్పాలి. ఈ సినిమా మంచి వసూలు రాబట్టినప్పటికీ సినిమా విడుదల కాకుండానే సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేసినట్లు నాని సన్నిహితులు దగ్గర ఎమోషనల్ అయినట్టు సమాచారం.తెలంగాణ డైరెక్టర్‌తో, తెలంగాణ కోసం సినిమా తీస్తే..తనను తొక్కేయాలని చూస్తున్నారని నాని ఆవేదన చెందారట. ఇలా తన సినిమా గురించి నెగిటివ్ కామెంట్లు వస్తున్న నేపథ్యంలోనే నేడు ఈయన కూడా ఈ విషయంపై స్పందిస్తూ నెగిటివిటీని కూడా తాను ఎంజాయ్ చేస్తున్నానని పోస్ట్ చేశారు.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో కూడా నాని చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే కచ్చితంగా ఈయనపై ఇండస్ట్రీలో ఏదో కుట్ర జరుగుతుందనే స్పష్టం అవుతుంది. మనం ఎదుగుతున్నామంటే మన చుట్టూ పాజిటివ్ కంటే నెగెటివిటీ కూడా పెరుగుతుంది. ఇలా వచ్చే నెగెటివిటీని మనం ఎప్పుడు పట్టించుకోకూడదు పాజిటివిటీ ద్వారా మాత్రమే ముందుకు వెళ్లాలి. మనం గెలవాలని కోరుకున్న వాళ్లు పెరిగినట్టే ఓడిపోతే చూద్దామనుకునే వాళ్ళు అంతకుమించి ఉంటారు.
నన్ను ఓడించాలనుకునే వారిని ఓడించడానికి నేను ప్రయత్నం చేయను కానీ గెలుస్తానని నమ్మే వాళ్ళని గెలిపించడానికి కష్టపడతాను అంటూ నాని మాట్లాడారు.
ఇలా ప్రీ రిలీజ్ వేడుకలు నాని చేసిన వ్యాఖ్యలు తాజాగా సినిమాకు నెగిటివ్ కామెంట్లు , నెగిటివ్ రివ్యూ ఇచ్చే వారి గురించి నాని స్పందిస్తూ చేసిన పోస్ట్ చూస్తుంటే ఈయన ఎదుగుదలను ఇండస్ట్రీలో కొందరికి జీర్ణం కాలేదని అందుకే తనపై కుట్రలు చేస్తున్నారనే స్పష్టం అవుతుంది. మరి నాని పై కుట్రలు చేసే అవసరం ఎవరికి ఉంది? నాని ఎవరిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? అనే విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా నాని మాత్రం ప్రేక్షకుల అంచనాలకు అనుగుణంగానే ది ప్యారడైజ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకున్నారు.
Also Read:నన్ను తొక్కేయాలని చూస్తున్నావా? ఫరియా పై చిరు కామెంట్స్ వైరల్!