Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా సందీప్ కిషన్ హీరోగా తమిళనాడు సీఎం విజయ్ కొడుకు సంజయ్ (Sanjay)దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సిగ్మా (Sigma)సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరయ్యారు. ఈ సినిమా అక్టోబర్ రెండవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు ఇందులో భాగంగానే తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో చిరంజీవి సినిమా గురించి అలాగే విజయ్, సంజయ్ గురించి అలాగే వారి కుటుంబంతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు.
ఇకపోతే ఈ సినిమాలో సందీప్ కిషన్ జోడిగా నటి ఫరియా అబ్దుల్లా(Faria Abdullah) హీరోయిన్ పాత్రలో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఈ కార్యక్రమంలో చిరంజీవి అందరి గురించి మాట్లాడుతూ చివరికి హీరోయిన్ గురించి కూడా మాట్లాడారు ఆమె డాన్స్ అద్భుతంగా చేస్తుందని ఇటీవల ఒక ఛానల్ వార్షికోత్సవంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఫరియా డాన్స్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఆరోజు నేను డాన్స్ చేయకూడదని చాలా గట్టిగా అనుకున్నాను కానీ ఈ అమ్మాయి మాత్రం తన చేత డాన్స్ చేయించింది అంటూ మాట్లాడారు. అదేవిధంగా చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలో కూడా ఫరియా నటించాల్సి ఉండేదని చిరంజీవి తెలిపారు.
ఈ సినిమాలో ఒక ప్రత్యేక పాటలో ఫరియా చేయాల్సి ఉండగా కానీ చేయలేదని, ఈ అమ్మాయి నా సినిమాకు నో చెప్పింది.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా ? అంటూ మాట్లాడటంతో ఒక్కసారిగా ఫరియా షాక్ అయ్యారు. విశ్వంభర సినిమా తాను రిజెక్ట్ చేయలేదని తెలిపారు. అయితే తనతో హైట్ సమస్య అనుకుంటే నేను కూడా హీల్ వేసుకొని నీతో డాన్స్ చేస్తాను అంటూ సరదాగా చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వేడుకలో భాగంగా చిరంజీవి నన్ను తొక్కేయాలని చూస్తున్నావా అంటూ చేసిన కామెంట్స్ మాత్రం హైలెట్ అయ్యాయి.
కొంత కొంతకాలంగా ఇండస్ట్రీలో చిరంజీవి గురించి పరోక్షంగా చిరంజీవి ఇండస్ట్రీలో కొంతమందిని తొక్కేశారు అంటూ మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.చిరు ఎంతమందిని ప్రోత్సహించినా ఈ విమర్శలు, సూటి పోటి మాటలు తప్పడం లేదు. వాళ్లందరికీ చిరు ఇలా సరదాగానే కౌంటర్ వేసినట్టున్నారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా చిరంజీవి విజయ్ కొడుకు డైరెక్టర్ గా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్న నేపథ్యంలోనే తమ సపోర్ట్ అవసరమన్న ఉద్దేశంతోనే తాను షూటింగ్ పూర్తి చేసుకుని సరాసరి ఈ వేడుకకు వచ్చాను అనే విషయాన్ని కూడా చిరంజీవి తెలిపారు.
Also Read: సినిమా చేయాలంటే హీరోల భార్యలకు నచ్చాలి.. తాప్సీ సెన్సేషనల్ కామెంట్స్!